ట్రంప్ చెప్పిన ఆసక్తికర విషయం
వాషింగ్టన్: భార్యలకు పని అప్పగించడం చాలా ప్రమాదకరమని అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 1994లో ఏబీసీ న్యూస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష బరిలో నిలవడంతో ఈ ఇంటర్వ్యూలో బయటకు వచ్చింది. ఆ ఏడాది మార్చిలో 'ప్రైమ్ టైమ్ లైవ్'లో మాట్లాడుతూ.. తన మాజీ ఇవానాకు తన వ్యాపారంలో బాధ్యతలు అప్పగించడం వల్లే ఆమెతో వివాహబంధం విచ్ఛిన్నమైందని పేర్కొన్నారు. అట్లాంటిక్ సిటీ కాసినోస్ లో ఆమెను మేనేజనర్ నియమించానని తెలిపారు.
'మీ వ్యాపారంలో భార్యకు పని అప్పగించడం చాలా ప్రమాదకరం. ఇది తెలితక్కువ ఐడియా. ఇలా చేయడం వల్లే ఇవానాతో నా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చాయి. వివాదస్పద వ్యాపార కార్యకలాపాల గురించి ఫోన్ లో ఆమె పెద్దగా ఆరవడం నాకు నచ్చేది కాదు. భార్యగా ఉన్నప్పుడు ఇవానా సున్నితంగా వ్యహరించేంది. నా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా నియమించాక ఆమెలో సున్నిత స్వభావం మాయమైంద'ని ట్రంప్ వెల్లడించారు.
1991లో ఇవానా నుంచి విడిపోయిన తర్వాత 1993లో మార్లా మాప్లెస్ ను పెళ్లాడారు. 1997లో ఆమెకు కూడా విడాకులిచ్చారు. 2005లో మెలానియా క్నాస్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే మగాళ్ల కంటే మహిళలు బాగా పనిచేస్తారని తన పుస్తకం 'ది ఆర్ట్ ఆఫ్ ది డీల్'లో ట్రంప్ పేర్కొనడం విశేషం.