Memorial building
-
అమరవీరులను అవమానించడమే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలియన్‌వాలా బాగ్ మెమోరియల్ ఆధునీకరణ పనులను ‘అమరవీరులకు కలిగిన అవమానం’గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బలిదానం అంటే అర్ధం తెలియని వారే ఇలా అవమానించగలరని ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘నేను అమరవీరుడి కొడుకును. అమరులకు కలిగిన అవమానాన్ని ఏ మాత్రం సహించబోను. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకోని వారు దీనిని అర్థం చేసుకోలేరు’ అని పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయంలో ఆధునీకరణ పేరుతో చేసిన మార్పులు, చేర్పులు చరిత్రను నాశనం చేసేవిగా ఉన్నాయంటూ వెల్లువెత్తుతున్న విమర్శలపై ఒక మీడియా కథనాన్ని మంగళవారం ఆయన ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మార్పులు బ్రిటిష్ పాలన, జనరల్ డయ్యర్ పాల్పడిన అకృత్యాలను ప్రజలకు స్మరణకు తెచ్చేలా చేయడానికి బదులు..తుడిచేసేలా ఉన్నాయని కాంగ్రెస్ నేత జైవీర్ షేర్గిల్ ఆరోపించారు. ఆధునీకరించిన జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయాన్ని శనివారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఉన్నారు. కొత్తగా చేపట్టిన మార్పులపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు కురిపించగా అదే పార్టీకి చెందిన సీఎం అమరీందర్ మాత్రం ప్రశంసలు కురిపించడం గమనార్హం. జలియన్‌వాలా బాగ్ మెమోరియల్ సముదాయం ఆధునీకరణ అనంతరం చూడటానికి చాలా బాగుందన్నారు. ఈ సముదాయంలో ఏఏ నిర్మాణాలను తొలగించారో తనకు తెలియదన్నారు. రాహుల్ ట్విట్టర్లో విమర్శించిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. -
భారతీయులకు దన్నుగా భారత్..!
అమృత్సర్: ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఆపదలో ఉన్నా, సాయం చేసేందుకు యావద్భారతం ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసానిచ్చారు. అఫ్గాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కుతగ్గమన్నారు. అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ మెమోరియల్‌ను సుందరీకరించి దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో ఆయన వీడీయోలైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ దేవీ శక్తి గురించి మాట్లాడారు. ఆపరేషన్ దేవీ శక్తిలో భాగంగా పలువురు స్వదేశీయులను అఫ్గాన్ నుంచి ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ తరలింపులో భాగంగా ప్రజలతో పాటు పవిత్రమైన సిక్కు మత గ్రంధాలను కూడా వెనక్కు తెచ్చామని మోదీ తెలిపారు. గురు కృప(సిక్కు గురువుల ఆశీస్సులు)తో ఈ కష్టమైన కార్యాన్ని సమర్ధవంతంగా భారత్ నిర్వహిస్తోందన్నారు. కోవిడ్ కావచ్చు, అఫ్గాన్ సంక్షోభం కావచ్చు... భారతీయులకు కష్టం వస్తే భారత్ వెంటనే ఆదుకుంటుందనే సందేశమిచ్చారు. ఇటీవల కాలంలో మానవాళి ఎదుర్కొంటున్న కఠిన సవాళ్లను ఎదుర్కోవడంలో గురువుల బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని కొనియాడారు. గురువులు చూపిన మార్గాన్ని అనుసరించి నూతన చట్టాలను తీసుకువచ్చామని పరోక్షంగా సీఏఏ గురించి ప్రస్తావించారు. ఆత్మనిర్భరత్వం, ఆత్మ విశ్వాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. పునరుద్ధరించిన జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆనాటి ‘జలియన్‌వాలా మారణకాండ’లో వీరమరణం పొందిన వారి కోసం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సముదాయం అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. స్మారక సముదాయంలో ఉన్న ఉపయోగంలో లేని భవనాల్లో 4 మ్యూజియం గ్యాలరీలను కొత్తగా ఏర్పాటు చేసింది. నవీకరించిన సముదాయంలో జలియన్‌వాలా మారణకాండ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై దృశ్య, శ్రవణ ప్రదర్శనను అందుబాటులోకి తెచ్చింది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1919 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన జలియన్‌వాలాలో సమావేశమైన వేలాది మందిపై బ్రిటిష్ సైనికులు విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో వేయి మంది పౌరులు నేలకొరగ్గా, వందలాదిగా గాయాలపాలైన విషయం తెలిసిందే. -
స్మారక నిర్మాణం కోసం చెట్లను నరకొద్దు: సీఎం
ముంబై: శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఔరంగబాద్‌లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని సోమవారం మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణానికి ఒక్క చెట్టును నరికివేయడానికి వీల్లేదని, చెట్లకు ఎటువంటి హాని తలపెట్టకుండానే ప్రతిపాదిత స్మారక నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ మేరకు పార్టీ సీనియర్ నేత, ఔరంగబాద్ మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే ఒక ప్రకటనలో తెలిపారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పైగా చెట్లు నరికివేతకు గురవుతున్నాయని ఆదివారం పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, మీడియా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంతో తాజాగా చెట్లను నరికి వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే పర్యావరణానికి సంబంధించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. స్మారక నిర్మాణం కోసం ప్రియదర్శిని గార్డెన్లో చెట్లను నరికివేస్తామని సేన ఎన్నడు చెప్పలేదు. సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఆదివారం సాయంత్రం మౌఖిక ఆదేశాలు అందాయని.. ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తామని ఈ మేరకు ఖైరే పేర్కొన్నారు. ప్రియదర్శిని ఉద్యానవనంలో కనీసం 80 రకాల పక్షులు ఉన్నాయి. వాటిలో 52 భారత సంతతికి చెందగా మిగిలినవి విదేశీ పక్షులు. 35 రకాల సీతాకోక చిలుకలు, ఏడు రకాల పాములతో పాటు 80 రకాల కీటకాలతో పాటు సరిసృపాలకు నివాసంగా ఉంటూ ప్రధాన ఆక్సిజన్ వనరుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఆదివారం శివసేనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
స్మరిస్తూ.. విస్మరిస్తూ
ఏడేళ్లుగా నిర్మాణానికి నోచుకోని స్మారక భవనం టీఆర్ఎస్ సర్కారుకు పట్టని వైనం నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి విముక్తి పోరాటంలో విప్లవజ్వాలై రగిలి.. నిజాం నిరంకుశంపై అంకుశమై నిలిచి.. అమరత్వంతో అగ్నిశిఖలను పంచి.. సాయుధ పోరును పదునెక్కించిన ధీరుడు.. దొడ్డి కొమురయ్య. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి వేగు చుక్క. తాను అమరుడైనా.. ఆ స్ఫూర్తితో ఉద్యమ ఫలితాన్ని నిర్దేశించిన యోధుడు. పోరాటాల పుట్టినిల్లు కడివెండి ముద్దుబిడ్డ కొమురయ్య అమరత్వానికి నేటితో 69 ఏళ్లు. కడవెండి(దేవరుప్పుల) : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య. ఆయన స్ఫూర్తిని సభల్లో ప్రస్తావించడం.. ఆచరణలో విస్మరించడం పాలకులకు అలవాటుగా మారింది. నేటికీ ఆయన స్మారక భవనాన్ని నిర్మించకపోవడం దీని కొనసాగింపే. అమరత్వం ఇలా.. పాలకుర్తి మండలం విస్నూరులో రామచంద్రారెడ్డి, కడవెండిలో అతడి తల్లి జానమ్మ దొరసాని దౌర్జన్యాలను ఎదురించేందుకు గుప్తల సంఘం ఏర్పడింది. ఈ సంఘంలో 1928లో దొడ్డి గట్టమ్మ- కొండయ్య కుమారుడు కొమురయ్య చేరారు. తన పదహారో ఏటనే కొమురయ్య వివాహం చేసుకున్నాడు. అన్న మల్లయ్య ప్రభావంతో సంఘ సభ్యుడిగా కీలకపాత్ర పోషించాడు. 1946 జూలై 4న కడివెండి లో నిరసన ప్రదర్శన చేస్తున్న సంఘ సభ్యులపై ప్రస్తుత బొడ్రాయి వద్ద విస్నూరు దేశ్‌ముఖ్ గూండాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అన్న మల్లయ్యతోపాటు పలువురు గాయపడగా దొడ్డి కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అప్పటి నుంచే సాయుధ పోరాటం ఎరుపెక్కింది. దొడ్డి కొమురయ్య అమరత్వం స్ఫూర్తితో నాలుగు వేల మంది ప్రాణాలు త్యాగం చేసి నైజాం సర్కారు నీడ నుంచి అనేక గ్రామాలను విముక్తి చేశారు. తర్వాత నూతన ప్రజాస్వామిక విప్లవం పేరిట వివిధ పంథాలో సాగుతున్న సాయుధ పోరాటంలోనూ ఈ గ్రామస్తులదే ప్రధాన భూమిక. శిలాఫలకానికే స్మారక భవనం పరిమితం కడవెండిలో దొడ్డి కొమురయ్య స్మారకార్థం నిర్మించాల్సిన భవనం శిలాఫలకానికే పరిమితమైంది. సీపీఐ భారీ స్మారక స్థూపం నిర్మిం చిం ది. 2007 జూలై 4 న వామపక్షాలు ఇతర విప్లవ గ్రూపుల సాయంతో 700 గజాల స్థలాన్ని సేకరించి స్మారక భవన నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యంతో శంకుస్థాపన చేరుుంచారు. కానీ నిర్మాణానికి నోచుకోవడం లేదు. పాలకులు స్పందించరేమి? తెలంగాణ మలివిడత ఉద్యమంలో కొమురయ్యను పదేపదే తలుచుకున్న టీఆర్ఎస్ నేతలకు ఉద్యమాల గడ్డపై కొమురయ్య స్మృతి చిహ్నం నిర్మించే తీరిక లేకుండా పోరుుం దనే విమర్శ విన్పిస్తోంది. ఇటీవల సీపీఐ రాష్ర్టశాఖ ఇదే భవన నిర్మాణానికి నిధుల కోస సీఎం కేసీఆర్ వద్దకెళ్తే స్పందించలేదనే ఆరోపణ ఉంది. నేడు నిర్వహించే దొడ్డి కొమురయ్య వర్ధంతి సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రానున్నట్లు నియోజకవర్గ కార్యదర్శి ముద్దం శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.