ఇక్కడ... ఫొటో దిగుదామా?
ఖాళీ బీరు బాటిళ్లు... పిచ్చిమొక్కల మధ్యలో ఈ శిలాఫలకం దగ్గర ఫొటోలు దిగటం ఏమిటని ఆశ్చర్యపోకండి... అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏడాది కిందట శంకుస్థాపన చేసిన స్థలమిది. శిలాఫలకం దానికి సంబంధించినదే. పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నర తర్వాత దసరా రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు రూ.250 కోట్లు ఖర్చుపెట్టి, పెద్దలందరినీ పిలిచి రాజధాని కోసం ఇక్కడ భూమి పూజ చేశారు. అది జరిగి ఏడాది పూర్తయింది. మరో దసరా వచ్చింది. భవనాలు కాదు కదా వాటి కోసం కనీసం పునాదులు కూడా తవ్వలేదు.
రాజధాని కోసం సమీకరించిన వేలాది ఎకరాల పంటభూములు బీళ్లుగా మారిపోగా.. వాటి మధ్యలో ఈ శిలాఫలకం, దాని పక్కన ఓ మూడు షెడ్లు మాత్రం నిటారుగా నిలిచి కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారిగా ఎంపిక చేసిన మార్గం కూడా డిజైన్ దశను దాటలేదు. మౌలిక సదుపాయాలేవీ అడుగు ముందుకు పడలేదు. చండీగఢ్ అసెంబ్లీని పోలి ఉండడంతో జపాన్ సంస్థ ఇచ్చిన ప్రభుత్వకాంప్లెక్స్ డిజైన్‌ను రద్దు చేసి మళ్లీ డిజైన్ల వేటలో పడ్డారు. రాజధాని కోసం ఇటుకలు, విరాళాలు ఇచ్చిన వారు మాత్రం అప్పుడప్పుడు వచ్చి ఇలా చూసిపోతున్నారు. కొందరు ఫొటోలు దిగుతున్నారు.
- సాక్షి, అమరావతి