Mental affliction
-
ఓ మదీ మేలుకో..!
గుంటూరు మెడికల్: ఇంట్లో పిల్లలు అదే పనిగా వీడియోగేమ్స్ ఆడుతూ మిగతా పనులను పక్కన పెట్టేస్తున్నారా.. తదేకంగా గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయి ఉంటున్నారా.. అయితే వారిని ఓ కంట కనిపెట్టి ఉండాల్సిందే. లేకుంటే చిన్నవయస్సులోనే వారు మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని మానసిక వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చుని చాటింగ్‌లు చేయటం, ఫేస్బుక్లో తలమునకలవుతూ ఉండటం మానసిక వ్యాధులకు కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.సెల్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వినియోగం బాగా పెరగడం వల్ల మానసిక జబ్బులు ఎక్కువయ్యాయని ఈ–ఎడిక్షన్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. మానసిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా మే నెలను ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా 35 మంది మానసిక వైద్యనిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ 20 మంది వరకు వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడే వారు వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో రోజూ 100 నుంచి 130 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్నారు. మానసికవ్యాధి లక్షణాలు... చికాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పై బడి ఉంటే వారు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా తనొక్కడే ఉండి నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనిని పదేపదే చేయాలనుకోవటం, అనవసరమైన ఆలోచల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలోపం, బరువుపెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తనమీద ఆధారపడే వారందరిని ఇబ్బందికి గురిచేస్తూ తానూ ఇబ్బందులకు గురికావడం, ఎక్కువ సమయం పనిమీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేసే ధోరణిలో ఉండటం, తనకు హాని చేస్తున్నట్లు ఊహించుకుని తగాదాల వరకు వెళ్ళటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే యత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. హార్మోన్ల లోపమే కారణం ఒత్తిడి, వ్యసనాలు, మితిమీరిన సెల్‌ఫోన్, ఎల్రక్టానిక్ పరికరాల వినియోగం వల్ల ప్రస్తుతం మానసిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ జబ్బులు వంశపారంపర్యంగానూ అధికంగా వస్తుంటాయి. మెదడులో రసాయనాలు ఊరటంలో మార్పు, మెదడులో గడ్డలు ఏర్పటం, మెదడులో ‘డోపమిన్’ హార్మోన్ లోపం, హార్మోన్ అసమతుల్యం, అసమానత్వం, పుట్టుకతో మెదడు సరిగ్గా ఎదగకపోవటం, ఫిట్స్, నిద్రలేమి వల్ల కూడా మనో వ్యాధులు వస్తాయి. మానసిక వ్యాధులతో ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా బాధపడుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళనకు గురిచేసే విషయాలను పట్టించుకోకూడదు. మద్యం, పొగతాగటం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆరు నుంచి తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలి. కుటుంబ సభ్యులందరితో సమయం గడపాలి. రోజూ వ్యాయామం చేయాలి. మానసిక వ్యాధులకు అనేక ఆధునిక మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఇవటూరి శరత్చంద్ర, మానసిక వైద్య నిపుణులు సంఘం రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు పిల్లలు, పెద్దలు తేడా లేదు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ప్రస్తుతం మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్రమశిక్షణ లేని ఆధునిక జీవనశైలే దీనికి కారణం. ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే త్వరగా నయం చేసేందుకు అవకాశం ఉంది. మందులతోపాటుగా రోగులకు కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. వ్యాధి గ్రస్తులను కుటుంబ సభ్యుల పర్యవేక్షిస్తూ మందులు సక్రమంగా మింగేలా చేస్తే వ్యాధి నుంచి త్వరితగతిన బయటపడతారు. –డాక్టర్ ఐవీఎల్ నరసింహారావు, మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గుంటూరు నాలుగేళ్లుగా జీజీహెచ్‌లో మానసిక సమస్యలతో చికిత్స తీసుకున్న వారు ఇలా.. సంవత్సరం రోగుల సంఖ్య 2020 16,529 2021 22,726 2022 28,579 2023 29,371 2024 2,505జీజీహెచ్‌లో ఉచిత వైద్యం మానసిక వ్యాధులకు జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలను అందించటంతోపాటుగా మందులూ పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ 21 నబర్ ఓపీలో వైద్య సేవలు లభిస్తాయి. -
మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు
సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక రోగం. నిజమైన బయటకు చెప్పుకోలేం కానీ.. చుట్టున్న ప్రపంచంలో ఎంతో మంది మానసిక రోగులు... నాతో సహ. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సమస్య ఉంది. కొందరు నియంత్రించుకోవచ్చు. మరికొందరు సమస్యలో పీకల్లోతులో ఇరుక్కుపోవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా బయటపడాలి? మన చుట్టున్న ప్రపంచంలో భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కోలా కనిపిస్తారు. కొందరు ఎత్తుంటారు, మరికొందరు చిన్నగా ఉంటారు. కొందరు అందంగా కనిపిస్తారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ఆరాటపడతారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా చాలా తేడాలుంటాయి. భౌతికంగా గొప్పగా కనిపించడం వేరు, మానసికంగా వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉండడం వేరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఎంతో శక్తి కావాలి. కానీ మన చుట్టున్న వారిలో కొందరు ఈ పోటీని తట్టుకోలేక ఒత్తిడికి గురయి మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అసలు సైకాలజికల్‌గా సమస్యలేంటాయి? ఎన్ని స్థాయిలు ఉన్నాయి? లెవల్ - 1 - (అయోమయం, గందరగోళం) మనం ఈ పోటీ ప్రపంచంలో గెలవాలన్న ఆరాటం ఈ పోటీలో ఏమవుతుందో అన్న భయం, ఆందోళన సరైన దారిలో గెలవలేం కాబట్టి ప్రత్యామ్నయాల కోసం వెతుకులాట పక్కదారులు పట్టే ఆలోచనలు, అదుపు తప్పే మనసు చెడు అలవాట్లకు బానిస (డ్రగ్స్, మద్యం, పోర్నో, మొబైల్ అడిక్షన్) ఇతరులను విమర్శించడం, నేనే కరెక్ట్ అనుకోవడం నచ్చజెప్పడానికి ఎవరు (అమ్మ, నాన్నతో సహా) ప్రయత్నించినా.. వారు చెప్పేదంతా తప్పు అనుకోవడం వాదించడం, గొడవ పడడం, వక్రమార్గంలోనైనా గెలవాలని తాపత్రయపడడం Reminder pic.twitter.com/YVVFXJS135— Wise Chimp (@wise_chimp) August 5, 2023 లెవల్ - 1(అయోమయం, గందరగోళం)లో పరిశీలనలు ఎలాంటి పాజిటివిటీ ఉండదు వీళ్లంతట వీళ్లే సమస్య నుంచి ఎప్పటికీ బయటకు రాలేదు ఏదో ఒక ప్రయత్నం చేస్తే తప్ప మార్పు రాదు ఎవరో ఒకరు వీళ్లను బయటకు తీసుకురాగలిగితే తప్ప ఇలాంటి వాళ్లు సమస్య నుంచి బయటకు రాలేరు లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - లక్షణాలు ఏం నేర్చుకోవాలి? ఎలా సాధించాలి? ఎలాంటి కఠిన పరిస్థితులకయినా అలవాటు పడే, సర్దుకునే నైజం నేను గెలవాలి, నాకున్న నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? మరింత ముందుకు వెళ్లాలంటే ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? చుట్టున్న సమాజాన్ని ఎలా మంచి కోసం వినియోగించుకోవాలి? అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేలా నేనేం చేయాలి? నేను గెలుస్తాను సరే, మరికొంతమందికి ఎలా సాయ పడగలను? May you always fly high like your helicopter shots. Happy birthday, MS! pic.twitter.com/f9aqiY6HV0 — Sachin Tendulkar (@sachin_rt) July 7, 2023 లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - పరిశీలనలు మన చుట్టున్న విజేతల్లో ఇదే మీరు చూస్తారు. మన మధ్యనే ఉంటారు, మనం ఊహించలేనంత ముందుకు వెళతారు. సమాజాన్ని ఔపాసన పట్టేస్తారు, మనకు కనిపించని అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఎంచుకున్న మార్గంలో అత్యున్నత దశకు చేరుకుంటారు నలుగురికి మేలు చేసే ఎంటర్ప్రెన్యూర్లుగా మారతారు సంపద సృష్టిస్తారు, తాము గెలిచి మరొకరికి మార్గదర్శకంగా మారతారు ఎంతో మంది సక్సెస్ ఫుల్ లీడర్లలో కనిపించే సీక్రెట్ ఇంతటితోనే ముగుస్తుందా? ఇంతకంటే అత్యున్నత దశ ఏమి లేదా? కచ్చితంగా ఉంది. సంపదతోనే అంతా ముగియదు. ఆ తర్వాత ఇంకేదైనా చేయాలని కలిగే అనుభూతే అత్యున్నత దశ. మూడో లెవల్ - మహాత్ములు - లక్షణాలు నేను ఏంటీ అన్నది పక్కనబెడతారు నా సమస్య అంటూ ఏదీ ఉండదు నేను ఈ సమాజానికి ఏం చేయగలను అన్నది మాత్రమే భావన ప్రతీ ఆలోచనలో తన నుంచి ఏదో ఒక సందేశం ఇతరులకు చేరాలన్న తాపత్రయం మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇదేమీ వైరాగ్యం కాదు, ఇదొక అద్భుతమైన స్థాయి. రమణ మహర్షినే చూడండి, ఆయనకు ఏ ఆస్తులు లేకపోవచ్చు, కానీ ప్రపంచమే ఆయనది. మనసును నియంత్రించుకోగల శక్తిని, ఆలోచనలను పెంచుకోగల యుక్తిని తెలుసుకున్నారు. Compassion is concern for others - sincere concern for others' well-being founded on awareness of our own experience. Since it makes us happy when others show us affection and offer us help, if we show others affection and readiness to help they too will feel joy. — Dalai Lama (@DalaiLama) August 4, 2023 మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇలాంటి వారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు, చదువుతారు. ధ్యానం, వ్యాయామం, యోగ ముద్రతో మనస్సును శాంతంగా మరియు స్థిరంగా ఉంచుకుంటారు ప్రతి రోజు.. వర్తమానంలో జీవిస్తుంటారు నిజమైన ఆలోచనల మధ్య అన్ని భ్రమలను వీడి పూర్తి పాజిటివిటీతో జీవిస్తుంటారు ఎలాంటి ఆడంబరాలుండవు, ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటారు ఏం ఆశించకుండా ఇంకొకరికి సాయం చేస్తారు, అయితే ఇక్కడ సంపద అనేది మానసిక సాయం సలహాలు, మార్గనిర్దేశనం, పాజిటివిటీని పెంపొందించే మాటల రూపంలో ఉంటుంది. ఈ స్థాయిలోకి అందరూ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే ప్రతీ ఒక్కరు రెండో స్థాయిలోకి రావొచ్చు. మీరు మారండి. మారను అనుకోవడమే కష్టం. ఎలా మారాలి? ఎందుకు మారాలి? ఎంత వరకు మారాలి? ఈ ప్రశ్నలన్నింటికీ మీలోనే సమాధానాలున్నాయి. మార్పు ఎలా ఉంటుందన్నది మీ ఇష్టం. (డాక్టర్ మృదుల, ప్రముఖ సైకాలజిస్టు, లైఫ్ కోచ్, సర్టిఫైడ్ కౌన్సిలర్ (నేషనల్ కెరియర్ సర్వీస్, కార్మిక ఉపాధి శాఖ), NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ లర్నింగ్ & డెవలప్మెంట్ మేనేజర్, సర్టిఫైడ్ ఇన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ ఇన్ ఎమోషనల్ ఇంటలిజెన్స్, సైకాలజీలో పీహెచ్డీ చేశారు, ఈ రంగంలో 20 ఏళ్లుగా ఉన్నారు. మానసిక శాస్త్రంలో ఎంతో మంది ఆలోచనలను ప్రభావితం చేసిన వ్యక్తి) -
తెల్లబోయిన సమాజం
చామన ఛాయ అమ్మాయిని ఎందుకు చేసుకోరు? ఈ ప్రశ్నకు సమాధానం అడిగితే చాలామంది తెల్లమొహం వేస్తారు. వివాహ ప్రకటనలు ఏవి చూసినా అందులో ఎక్కువ శాతం అమ్మాయి ‘ఫెయిర్‌గా’... అంటే తెల్లగా ఉండాలని ఉంటుంది. ఎంత ‘అన్‌ఫెయిర్’ కోరిక అది. తెల్ల దొరలను తరిమికొట్టిన గొప్ప చరిత్ర మనది. ఏం లాభం ఇంకా తెల్ల దయ్యం వదల్లేదు. పోనీ కాకిపిల్ల కాకికి ముద్దు అని సరిపెట్టుకుందామంటే... పేరెంట్స్ కూడా అమ్మాయిలను మానసిక వ్యథకు గురిచేస్తున్నారు. మనస్సు రంగు చూసేవారు కరువైన ఈ నల్లటి సమాజానికి నిజంగా సిగ్గులేదు. సినిమాల్లో, టీవీ సీరియళ్లలో, ఎయిర్హోస్టెస్లలో, రిసెప్షనిస్ట్లలో... ఎక్కడా నల్లబంగారాలు కనబడరు. వాల్యూస్ తగలడ్డాయి. మానవత్వం వైట్‌వాష్ అయిపోయింది. సమాజం తెల్లబోయింది. సమాజం గొడవ దేవుడెరుగు, పాపం మన అమ్మాయిల మనస్సులు ఎంతగా ఛిద్రమైపోతున్నాయో! మారదాం... మార్చుదాం... రంగు కాదు... మనస్సు! సుశీలకు ఇద్దరు పిల్లలు. బాబు తెల్లగా పుట్టాడు. పాప నలుపు. సుశీల దిగులు పిల్లలతో పాటే పెరుగుతోంది. నలుగురిలో కూర్చున్నప్పుడు ఆమె తరచూ అనే మాట- ‘మా బాబు రంగు పాపకు వచ్చి, పాప రంగు బాబుకు వస్తే బాగుండేది’ అని. కానీ... ఆ కూతురు చదువుల తల్లిలా మారితేనో, పెద్ద ఉద్యోగాలు పొందితేనో, సెరినాలా ఏదైనా సాధిస్తేనో, కల్పనాచావ్లా, సునీత విలియమ్స్లలా రోదసీ రహస్యాలను శోధిస్తూ పోతేనో... కోరి కోరి వరుడు ఆమె ప్రేమనే వరమడగవచ్చేమో అన్న భావన ఆ అమాయక తల్లిలో లేదు. సమాజంలో ఆ భావన ఎప్పటికొస్తుంది?! రాణి పెళ్లీడుకు వచ్చింది. ఈ మధ్య బ్యూటీ టిప్స్ చదవడం ఎక్కువ చేసింది. ఉద్యోగానికి సెలవు పెట్టేసింది. ఒకరోజు పుదీనా ప్యాక్ ముఖానికి రాసుకుంటుంది. మరో రోజు టొమాటో, కీరా గుజ్జును చెంపలకు అప్లై చేస్తుంది. ఇంకో రోజు నారింజ పండ్ల రసాన్ని నుదురంతా రుద్దుకుంటుంది. బ్యూటీపార్లర్లకు ఆమె రాకపోకలు అన్నీ ఇన్నీ కావు. చివరకు రాణి ఎంత దూరం వెళ్లిందంటే లేజర్ ట్రీట్మెంట్ను కూడా తీసుకోవాలనుకుంది. ఇదంతా ఎందుకు? ప్రతి పెళ్లికొడుకూ అమ్మాయి తెల్లగా ఉండాలంటున్నాడు. అదేమంటే పుట్టబోయే పిల్లలు తెల్లగా ఉండాలట. కనుక తను న్యూనతకు లోనవుతూ ఈ హింసను తెచ్చి పెట్టుకుంది. నల్లగా ఉందన్న కారణంతో నిశ్చితార్థం రోజున పెరగబోయే కట్నానికి భయపడుతూనే ఉండాలా?! సుకన్య రంగు చామనచాయ కన్నా కాస్త తక్కువే. చదువుకు తగిన ఉద్యోగం కోసమని ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు ఫలితం ఏమవుతుందో అని సుకన్యే కాదు, ఆమె తల్లిదండ్రులూ కొన్ని రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపారు. ఒక నల్లటి పిల్లపైన సమాజం పెట్టే ఒత్తిడి తగ్గేదెప్పుడు?! మేట్రిమోని కాలమ్ తెరవాలంటే చాలామంది ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులూ జంకుతున్నారు. ఏ అబ్బాయి యాడ్ చూసినా ‘ఫెయిర్’గా ఉండే అమ్మాయి కావాలనే కోరికే. ‘రంగు పట్టింపు లేదు’ అనే మాట చూద్దామన్నా కనపడటం లేదు. అమ్మాయి తెల్లగా ఉంటే కట్నం అక్కర్లేదు అంటూ ఆ రంగుకు నజరానా ప్రకటిస్తున్నారు. పిల్లలు, పిల్లల పిల్లలూ తెల్లగా మారిపోయి వంశం మొత్తమూ తరాల పాటు తెల్లగా మారిపోవాలనే ఆలోచనలో నలుపు స్థానం ఎక్కడ?! దక్షిణాది స్పెషల్ దక్షిణాది సౌందర్యానికి నలుపే అసలైన చిహ్నం. కాటుక కళ్లు, నీలాల కురులు, చామనఛాయ... ఇవి ప్రబంధాలలో నాయికలకు సౌందర్య కారకాలయ్యాయి. స్త్రీ గుణగణాలకు ఉన్న విలువ... రంగుకు ఉండేది కాదు. అతిలోక సుందరి అంటే చక్కటి రూపు, పొందికైన ఆకారం గురించే చెప్పారు తప్ప ఆమె వర్ణం తెలుపు అయి ఉండాలని ఎక్కడా చెప్పలేదు. రాను రాను తెలుపు పై చేయి తీసుకుంది. నలుపును కింద పడేసింది. పుట్టుక నుంచే రంగు మీద మారు పేర్లు పెట్టడం! మొత్తంగా బాల్యం నుంచే ఆత్మవిశ్వాసాన్ని ధ్వంసం చేసే ప్రక్రియ! అసలు ఈ ధోరణి ఇది ఎలా మొదలయ్యింది? ‘తెల్ల’దొరల చలవే (నా)! బ్రిటిష్‌వారు మన దేశాన్ని అనేక విధాలుగా దివాలా తీయించారు. చివరకు మన ఆలోచనా తీరును కూడా. నాలుగు వందల ఏళ్ల పాటు మన మీద పెత్తనం చేసిన తెల్లవాళ్లు క్రమంగా తెలుపును ఒక మేలిమి అర్హతగా మన మెదళ్లలోకి ఎక్కించగలిగారు. ‘వైట్ ఈజ్ దెయిర్స్’ అన్నారు మన వాళ్లు. కనుక తెల్లరంగు బ్రిటిష్ వాళ్లది అయ్యింది. నల్లరంగు భారతీయులది అయ్యింది. అంటే నలుపు పరోక్షంగా బానిస రంగు అనే భావన స్థిరపడింది. ఈ ప్రభావం ఎంతగా బలపడిందంటే చామన ఛాయ ఉండే కేరళ ప్రాంతం నుంచి తయారైన గొప్ప చిత్రకారుడు రాజా రవివర్మ తాను రూపం ఇచ్చిన దేవతామూర్తులందరి ఒంటి రంగు తెలుపు చేశాడు. కాలక్రమంలో తెలుపు... దేవతల వర్ణంగా, నలుపు దానవుల వర్ణంగా అవతరించింది. నలుపు మీద అయిష్టత మొదలైంది. సినిమాల్లోనూ తెలుపుదే పైచేయి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. ఏ ఉడ్లోనైనా హీరోయిన్లు తెల్లనివాళ్లే. నర్గిస్, వహిదా రెహమాన్, ఆశా పరేఖ్, ముంతాజ్, మధుబాల, హేమమాలిని... అంతెందుకు ఇవాళ్టి కరీనా కపూర్, కత్రీనా కైఫ్, కంగనా రనౌత్ వరకూ కూడా తెల్లగా ఉన్నవాళ్లే స్టార్లుగా చలామణి అయ్యారు. వీరి మధ్య కాజల్ వంటి వారు కేవలం మినహాయింపుగా నిలబడ్డారు. తెలుగు సినిమాల్లో నల్లటి లేదా చామచాయ లేనివారు లేరని కాదు. వాణిశ్రీ, శారద, సరిత, భానుప్రియ, రోజా వంటి వారు ఉన్నా, వారిని తెల్లగా చూపించడానికి విపరీతంగా మేకప్ చేసేవారు. నందితా దాస్, ఉషా జాధవ్ వంటి వాళ్లు ఇందుకు మినహాయింపు. వాళ్లు నల్లగానే తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మార్కెట్ వలచిందీ తెలుపునే! తెల్లగా ఉండటాన్ని ఒక నాగరిక విలువగా ప్రతిపాదించడమే కాక దానిని మెల్లగా బుర్రలకు ఎక్కించింది ప్రధానంగా మార్కెట్. నీళ్లు, నదులు విస్తారంగా ఉండే దక్షిణాది ప్రాంతంలో ప్రవాహంలో నాలుగు మునకలు వేయడం లేదా బావి వద్ద నిలుచుని నాలుగు చేదలు గుమ్మరించుకోవడమే స్నానం అయినప్పుడు సబ్బును అలవాటు చేయడానికి మేని రంగును ఒక ఆయుధంగా వాడింది మార్కెట్. అంతేకాదు, తెల్లరంగు ఉంటే సమాజంలో అనేక కష్టాలను దాటొచ్చు అనేంత భరోసాను కల్పించింది. పొద్దున లేవగానే టీవీలో ఓ ప్రకటన కనిపిస్తుంది. ‘ఇవ్వాళ బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్తున్నా’ అంటుంది ఓ అమ్మాయి. ‘ఈ క్రీమ్ పూసుకోవా?’ అని నిలదీస్తుంది వెనకనుంచి ఓ గొంతు. ఐదు నిమిషాలలో తెల్లగా అయ్యే క్రీమ్ పూసుకొని పోవాలట. ఏం... బాయ్‌ఫ్రెండ్‌కు తెల్లగా కనిపించే తీరాలా? మేని రంగు కంటే ఉజ్వలమైన మనసు రంగును చూడవచ్చు గదా? ఇదీ మహిళలు తెలుసుకోవాల్సిన మాటే కానీ, ముఖ్యంగా తెలుసుకోవాల్సిందే మగవాళ్లే. వివక్ష దూరం కాదా? పెళ్లి అనగానే అబ్బాయి అయినా, వారి తల్లిదండ్రులైనా మొదటగా తెల్లటి అమ్మాయి కోసమే చూస్తారు. నల్లగా ఉన్న ఎంతోమంది మోడల్స్, హీరోయిన్స్ మన కళ్ల ముందే ఉన్నా ఈ వివక్ష పోవడం లేదంటే అది మన దురదృష్టం. - వీరజారావ్, సైకాలజిస్ట్ తెలుపే అడుగుతుంటారు పద్నాలుగేళ్ల నుంచీ మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నాను. అప్పటికీ ఇప్పటికీ శరీర రంగు పై ఉన్న అభిప్రాయాలు మారలేదు. తెలుపంటేనే అందం అన్న భావన పోలేదు. నలుపును అంగీకరించే వాళ్లు చాలా తక్కువ. ఏ అబ్బాయి తరఫువారు వచ్చినా ముందు తెల్లటి అమ్మాయి కావాలనే అడుగుతున్నారు. అమ్మాయి తెల్లగా ఉంటే ఆమెకు చదువు, ఉద్యోగం, ఆస్తిలాంటివి పెద్దగా లేకున్నా పట్టించుకోరు. - కె.సి.రెడ్డి, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు నల్లగా ఉన్నానని.. ఎమ్‌టెక్ చేశాను. టీసీఎస్‌లో ఉద్యోగం. ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఉంటాను. అయినా ఓ ఇరవై సంబంధాల వరకు రిజెక్ట్ అయ్యాయి. రీజన్.. నల్లగా ఉన్నానని. అందాన్ని నలుపు, తెలుపులతో తూకం వేస్తున్న వాళ్ల వల్లే నలుపంటే చిరాకు పుడుతోంది. అఫ్కోర్స్ అలా తూకమేస్తున్న వాళ్ల మీద సింపతీ కూడా ఉందనుకోండి. - శ్రావణి, అమీర్‌పేట, హైదరాబాద్ పిల్లలు తెల్లగా పుడతారని.. నాకు ఒక్కడే కొడుకు. వాడిది మంచి రంగు. అంతే తెలుపుతో నా కొడుక్కి తగ్గ కోడలు రావాలని చాలా సంబంధాలే చూశాం. లాస్ట్‌కి మహారాష్ట్ర అమ్మాయిని చేసుకున్నాం... కట్నం లేకుండా. తెల్లటి రంగు మీద ఎందుకంత పట్టుదలతో ఉన్నామంటే అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ తెల్లగా ఉంటే పుట్టే పిల్లలూ తెల్లగా పుడ్తారని! - శశికళ, గృహిణి,రామంతాపూర్