మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్@ రూ.1.57 కోట్లు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్లో లేటెస్ట్ వెర్షన్, ఎస్-క్లాస్ ఎస్ 500ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. గతేడాది అక్టోబర్లోనే ఈ కారును అంతర్జాతీయంగా విడుదల చేశామని, మూడు నెలల తర్వాత భారత్లోకి తెస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబెర్హర్డ్ కెర్న్ చెప్పారు. ఈ కారు ధర రూ. 1.57 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). గతేడాది 8 కొత్త కార్లను భారత్లో అందించామని పేర్కొన్నారు. ఈ కారులో 4.6 లీటర్ వీ8 ఇంజిన్, 12 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, ప్రయాణాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ కోసం వైఫై హాట్స్పాట్, 8 ఎయిర్బ్యాగ్స్ వంటి ప్రత్యేకతలున్నాయి.