Meriga Muralidhar
-
ప్రతిపక్షాలకు గూడూరు ఇంఛార్జ్ మేరీగ మురళి కౌంటర్
-
ప్రజాస్వామ్యం అపహాస్యం
నెల్లూరు, కోట: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆరోపించారు. గుంటూరు సభలో ఎనిమిది మంది ముస్లిం యువకుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ కోటలో ముస్లింలు గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు ఈ ర్యాలీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ఈ నెల 28న గుంటూరులో జరిగిన నారా హమారా.. టీడీపీ హమారా సభ ఒక నాటకమన్నారు. ముస్లింలంతా మా వైపే ఉన్నారని చెప్పుకునేందుకు చంద్రబాబు ఆడించిన నాటకమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కొందరు యువకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతుంటే సహించలేక పోలీసుల చేత అరెస్ట్ చేయించడం ఎంతవరకు సబబన్నారు. చంద్రబాబు చేష్టలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపే స్వేచ్ఛ ఎవరికైనా ఉందన్నారు. దాన్ని పెద్ద నేరంగా చూపించడం తగదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు సరిదిద్దుకుని అరెస్ట్ చేసిన యువకులను విడుదల చేయాలన్నారు. చంద్రబాబుకు జగన్ భయం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు యువత పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొబీన్‌బాషా ఆరోపించారు. రాష్ట్రంలో యువత అంతా జగన్ వెంటనే నడుస్తుందన్నారు. గుంటూరులో ముస్లిం యువకులను అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబునాయుడు పెద్ద తప్పిదమే చేశారన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అరెస్ట్‌లు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయని పక్షంలో ఉద్యమిస్తామని తెలిపారు. కోటలో ముస్లిం యువకులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి ప్రతిఒక్కరూ మద్దతు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లకూరు దశరథరామిరెడ్డి, ముస్లిం హక్కుల పోరాటసమితి జిల్లా అధ్యక్షుడు అన్వర్, ముస్లిం మైనార్టీ నాయకులు మొబీన్‌బాషా, మాజీ ఉపసర్పంచ్ ఇంతి యాజ్, ఇస్మాయిల్, కరీముల్లా, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, వజ్జా చంద్రారెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్‌రెడ్డి, పల్లెమల్లు శ్రీనివాసులురెడ్డి, గాది భాస్కర్ పాల్గొన్నారు. -
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నెల్లూరుకు రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగన్మోహన్రెడ్డి కడప నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు చేరుకుంటారని పేర్కొన్నారు. ఇక్కడ పినాకిని అతిథి గృహంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులతో సమావేశమవుతారని తెలిపారు. అనంతరం కనుపర్తిపాడుకు సమీపంలోని వీపీఆర్ కన్వెన్షన్‌లో జరిగే ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోదరుడు భద్రారెడ్డి కుమార్తె తన్మయి, చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుడు అభినయ్‌ల వివాహ వేడుకకు హాజరవుతారని పేర్కొన్నారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం రాత్రి హైదరాబాద్ వెళుతారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనంగా స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. -
వైఎస్సార్సీపీదే అధికారం
సాక్షి, నెల్లూరు : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే అధికారమని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మురళీధర్ ‘సాక్షి’తో సోమవారం మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం వీస్తోందన్నారు. మహానేత వైఎస్సార్ చేసిన సేవలు రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు. వైఎస్సార్ కుటుంబంపై రాష్ట్ర ప్రజలకు విపరీతమైన ప్రేమాభిమానాలున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గణనీయమైన సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రల వల్లే రాష్ట్ర విభజన తెరపైకి వచ్చిందన్నారు. జగన్‌ను చూసి బెదిరే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు సిద్ధమైందన్నారు. దీనికి టీడీపీ వంత పాడిందని మేరిగ విమర్శించారు. రెండు పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేవన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. వైఎస్సార్ సువర్ణ పాలన మళ్లీ వస్తుందన్నారు. జిల్లాలో రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని మేరిగ చెప్పారు. తాను అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు , నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యనేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మేరిగ చెప్పారు.