ఆ క్రెడిట్‌పై బీజేపీ, ఎస్పీల పోస్టర్ వార్!
కాన్పూర్ : కాన్పూర్ మెట్రో ప్రాజెక్టు క్రెడిట్ తమదంటే తమదని బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య పోస్టర్ వార్ ప్రారంభమైంది. అక్టోబర్ 4న శంకుస్థాపన చేయబోతున్న ఈ మెట్రో ప్రాజెక్టుపై ఇరు పార్టీలు పోస్టర్లను అంటిచేస్తున్నాయి. సమాజ్ వాద్ పార్టీ పోస్టర్లలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండగా.. బీజేపీ వర్కర్లు తమ పోస్టర్స్‌లో సీనియర్ నేత మురళి మనోహర్ జోషిని అభినందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు క్రెడిట్ అంతా జోషికే దక్కుతుందని పోస్టర్లలో బీజేపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.
అక్టోబర్ 4న శంకుస్థాపన చేయబోయే ఈ ప్రాజెక్టు వేడుకల్లో ఆ రాష్ట్ర సీఎం అఖిలేష్ యాదవ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయడు, స్థానిక ఎంపీ మురళీ మనోహర్ జోషి హాజరుకానున్నట్టు కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు.ఈ వేడుక సందర్భంగా కాన్పూర్‌కు విచ్చేస్తున్న అఖిలేష్ ఇతర ప్రాజెక్టులను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ శంకుస్థాపన వేడుకలకు ఇప్పటికే స్థానిక పాలిక స్టేడియం అట్టహాసంగా ముస్తాభవుతోంది. అన్ని పన్నులు ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా చేపట్టబోతున్నాయి. అధికారిక వర్గాల ప్రకారం ఐఐటీ నుంచి నౌబస్తా వరకు అనుసంధానమయ్యే ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.5000 కోట్లు.