మెయ్యప్పన్‌గా కమల్‌హాసన్
శభాష్‌నాయుడు తరువాత విశ్వనాయకుడు మెయ్యప్పన్‌గా మారనున్నారన్నది తాజా వార్త. నటనకు నవరసాలను ప్రాతిపదికగా చెబుతుంటారు. అరుుతే నటుడు కమలహాసన్‌ను వాటికి పరిమితం చేయలేం. నవరసాల్లోనే మరిన్ని రసాలను పండించగల దిట్ట ఆయన. ఒక్క హాస్యంలోనే ఎన్నో కోణాల్లో అభినరుుంచగల నట మేధావి కమల్. ఒకే చిత్రంలో పది పాత్రల్లో నటించి మెప్పించిన ఏకై క భారతీయ నట దిగ్గజం కమల్. తాజాగా దశావతారం చిత్రంలోని పది పాత్రల్లో ఒకటైన బలరామ్ నాయుడు పాత్రను లీడ్‌గా తీసుకుని మరో సారి శభాష్‌నాయుడు అంటూ తెరపైకి రానున్నారన్న విషయం తెలిసిందే. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కమలహాసన్ కూతురు శ్రుతిహసన్ తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారు.
ఇక ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, గౌరవ్శుక్లా, బ్రహ్మానందం నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స సమర్పణలో కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ అమెరికాలో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ షెడ్యూల్ ముగించుకుని వచ్చిన కమల్ తన కార్యాలయంలో మెట్ల మీద నుంచి కిందపడి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్సానంతరం పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరి ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. శభాష్‌నాయుడు చిత్ర తదుపరి షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ చిత్రం తరువాత విశ్వనాయకుడు సీనియర్ దర్శకుడు మౌళితో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం.
దీనికి మెయ్యప్పన్ అనే టైటిల్‌ను నిర్ణరుుంచినట్లు తెలిసింది. మెయ్యప్పన్ అన్నది ప్రఖ్యాత దివంగత నిర్మాత, ఏవీఎం స్టూడియో అధినేత పేరు కావడంతో ఆ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందనే అపోహ సినీ వర్గాల్లో నెలకొంది. అరుుతే అది నిజం కాదని, శభాష్‌నాయుడు చిత్రం పూర్తి కాగానే ప్రారంభం అయ్యే మెయ్యప్పన్ చిత్రానికి నిర్మాత ఎవరన్నది త్వరలోనే వెల్లడికానుందని సమాచారం. ఇది కూడా పూర్తి వినోదభరిత కథా చిత్రమేనని తెలిసింది.