Michigan court
-
అమెరికా: మరో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం
వాషింగ్టన్: అమెరికాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత సంతతి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న అధ్యక్షుడు జో బైడెన్.. మరో ఇండియన్ అమెరికన్ మహిళకు అరుదైన గౌరవం ఇచ్చారు. సర్య్కూట్ కోర్ట్ చీఫ్ జస్టిస్‌గా విధులు నిర్వహిస్తున్న భారత సంతతి మహిళ షాలినా డీ కుమార్‌ను మిచిగాన్ తూర్పు ప్రాంత ఫెడరల్ కోర్టు చీఫ్ జస్టిస్‌గా జో బైడెన్ నియమించారు. ఆమె 2007 సంవత్సరం నుంచి ఓక్లాండ్ కౌంటీ ఆరవ కోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. 2018లో సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా ఆమెను మిచిగన్ సుప్రీం కోర్టు నియమించింది. మిచిగాన్‌లో దక్షిణాసియా సంతతికి చెందిన మొదటి ఫెడరల్ న్యాయమూర్తి షాలినా అని వైట్ హౌస్ తెలిపింది. షాలినా ప్రధాన న్యామూర్తి విధుతో పాటు సివిల్, క్రిమినల్ విషయాలను కూడా పరిశీలిస్తారని వైట్ హైస్ తెలిపింది. షాలినా 1993లో మిచిగాన్ విశ్వవిద్యాలయం, 1996లో డెట్రాయిట్ మెర్సీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయమూర్తి జీన్ష్నెల్జ్ పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి మిచిగాన్‌లోని ఓక్లాండ్ కౌంటీలోని 6వ సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా 2007లో షాలినా నియమితులయ్యారు. చదవండి: బైడెన్ టీమ్ మరో భారతీయ మహిళా కిరణం -
ఆ ఎనిమిది మంది డిటెన్షన్‌పై విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మంది మధ్యవర్తుల విచారణ ప్రారంభమైంది. అమెరికా కాలమానం ప్రకారం మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో సోమవారం విచారణ మొదలైంది. యూఎస్ పోలీసుల అదుపులో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల తరఫున వాదనలు వినిపించేందుకు గాను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అటార్నీ ఎడ్వర్డ్ బజూకా తొలిరోజు వాదనలు వినిపించారు. విచారణ పూర్తయ్యేంతవరకు ఆ ఎనిమిది మందిని ఫెడరల్ కస్టడీలోనే ఉంచాలని, వారు బెయిల్‌పై బయటకు వస్తే యూఎస్ ఐసీఈ (స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్) అధికారులు వారిని అరెస్టు చేసే అవకాశముందని బజూకా కోర్టుకు విన్నవించారు. యూఎస్ ఐసీఈ కస్టడీలో ఉంటే అది శిక్షగా పరిగణనలోకి తీసుకోరని, ఫెడరల్ కస్టడీలో ఉంటేనే శిక్షాకాలం కింద పరిగణనలోకి తీసుకుంటారని, ఈ కారణంతోనే అలా కోర్టుకు విన్నవించారని సమాచారం. అటార్నీ విన్నపాన్ని కోర్టు సానుకూలంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఈ3 (డిఫెండెంట్) ఫణీంద్ర కర్ణాటికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కానీ అతను ఏ1 వీసా కలిగి ఉండటంతో యూఎస్ ఐసీఈ అదుపులోకి తీసుకోలేదని తెలుగు అసోసియేషన్లు వెల్లడించాయి. గతంలో ఈ కేసులో 156 మంది విద్యార్థులను అరెస్టు చేసిన సమయంలో సేకరించిన ఫైళ్లు, ఫోన్ కాల్ డేటా వివరాలను కూడా పరిశీలించేందుకు కోర్టుకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో చాలా విశ్వసనీయ విషయాలు వెల్లడవుతున్నాయని తెలుస్తోంది. తదుపరి విచారణ ఎప్పుడనేది కూడా న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఉంటుందని, అది వచ్చే వారం ఉండే అవకాశముం దని సమాచారం. కాగా, ఈ ఎనిమిది మంది మధ్యవర్తుల ట్రయల్ పూర్తయిన తర్వాతే అరెస్టయిన 156 మంది విషయంలో కోర్టు విచారణ చేపట్టనుంది. త్వరగా విడుదలయ్యేలా కృషి.. ‘డిటెన్షన్ సెంటర్లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం చేస్తున్నాం. మా సంస్థ తరపున ఎడ్వర్డ్ బజూకా నేతృత్వంలోని బృందాన్ని అటార్నీగా నియమించాం. మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. ఫణీంద్రకు బెయిల్ రావడం శుభసూచకం. వచ్చే వారం సెకండ్ ట్రయల్ ఉంటుంది. ఫణీంద్ర తరహాలోనే సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు విద్యార్థులకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు మా సంస్థ తరఫున అందిస్తాం..’ –వెంకట్ మంతెన, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి అది తప్పని వారికి తెలుసు వాషింగ్టన్: నకిలీ యూనివర్సిటీలో పేరు నమోదుచేసుకుని దొరికిపోయిన 130 మంది విద్యార్థులకు తాము చేసింది తప్పని తెలుసని అమెరికా హోం శాఖ పేర్కొంది. ఎలాగైనా అమెరికాలో నివసించాలనే వారు ఈ అక్రమానికి పాల్పడ్డారని తెలిపింది. ఫార్మింగ్టన్ వర్సిటీ కార్యకలాపాలపై విద్యార్థులకు ఎలాంటి అవగాహన లేదని, అందుకే వారు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా హోం శాఖ ప్రకటన భిన్నంగా రావడం గమనార్హం. ‘ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో తరగతులు, ఉపాధ్యాయులు లేరన్న సంగతి ఆ విద్యార్థులకు తెలుసు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండేందుకు అక్రమాలకు పాల్పడుతున్న సంగతి వారికి తెలుసు’హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఫార్మింగ్టన్ వర్సిటీ బాధితుల్లో ఎక్కువ మంది తెలుగువారు ఉండటం పట్ల నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) విచారం వ్యక్తం చేసింది. 117 మందికి సాయం.. ఫార్మింగ్టన్ వర్సిటీ కేసులో అరెస్టయిన 129 మంది భారత విద్యార్థుల్లో 117 మందికి దౌత్య, న్యాయపర సాయం చేసేందుకు అనుమతి లభించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. విద్యార్థుల నిర్బంధం పై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అమెరికా వ్యాప్తంగా 36 జైళ్లను సందర్శించి 117 మంది విద్యార్థులకు దౌత్యసాయం చేసేందుకు అనుమతులు సంపాదించామని, మిగిలిన 12 మంది కూడా సాయం చేసేందుకు ప్రయత్నాలు కొన సాగుతున్నాయని చెప్పింది. -
ఉయ్యూరు వాసి దోషి
భార్యాపిల్లల్ని హతమార్చిన కేసులో అమెరికా కోర్టు నిర్ధారణ 3న జీవితఖైదు విధించనున్న జ్యూరీ చికాగో/ఉయ్యూరు : భార్యతో పాటు తన ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా గొంతు కోసి దారుణంగా హతమార్చిన కేసులో.. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం, గండిగుంట గ్రామానికి చెందిన చెందిన కంప్యూటర్ సైంటిస్టు లక్ష్మీనివాసరావు నెరుసును మిచిగాన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. సంతోషం కొరవడిన వైవాహిక జీవితం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నలభై ఆరేళ్ల లక్ష్మీనివాసరావు 2008 అక్టోబర్ 13న మిచిగాన్‌లోని తన ఇంట్లో ఈ దారుణానికి తెగబడ్డాడు. మృతదేహాలను ఇంట్లోనే ఉంచి మరుసటి రోజే హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాడు. తన సోదరుడి కుటుంబ సమాచారం తెలియటం లేదని లక్ష్మీనివాస్ సోదరుడు అక్కడి పోలీసులకు పిర్యాదు చేయడంతో హత్య జరిగిన రెండు వారాలకు అసలు విషయం వెలుగుచూసింది. ఎఫ్‌బీఐ కేసు దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడు స్వదేశానికి వెళ్లినట్టు నిర్ధారించుకుని సీబీఐని సంప్రదించారు. ఇంటర్‌పోల్ సైతం ఎఫ్‌బీఐ జారీ చేసింది. అప్పట్నుంచీ మారువేషాల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని 2013లో హైదరాబాద్ శివార్లలో పోలీసులు అరెస్టు చేశారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద హత్యాభియోగాల విచారణ కోసం అతన్ని మిచిగాన్కు పంపారు. కాగా గురువారం కేవలం రెండు గంటల్లోపు ముగిసిన సమాలోచనల అనంతరం ఏడుగురు మహిళలు, నలుగురు పురుష న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం (జ్యూరీ) లక్ష్మీనివాస్‌ను నేరస్తుడిగా నిర్ధారించినట్టు డెట్రారుుట్ ఫ్రీ ప్రెస్ వెల్లడించింది. అంతకుముందు వారం రోజుల పాటు కొనసాగిన విచారణ అనంతరం జ్యూరీ ఈ తీర్పు వెలువరించింది.విచారణ సంద ర్భంగా.. కుటుంబసభ్యులను హతమార్చడాన్ని లక్ష్మీనివాస్ ఖండించలేదు. ఎలాంటి భావోద్వేగాన్నీ వ్యక్తం చేయలేదు. హత్యలకు పాల్పడినట్టుగా అంగీకరించిన లక్ష్మీనివాస్.. నాటి ఘటనలకు సంబంధించిన వివరాలను మాత్రం గుర్తుకు తెచ్చుకోలేక పోతున్నానని చెప్పాడు. ఆ సమయంలో అతని మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని డిఫెన్సు అటార్నీ వాదించినప్పటికీ న్యాయమూర్తులు దాన్నెంత మాత్రమూ విశ్వసించలేదు. వచ్చే నెల 3న కోర్టు అతనికి పెరోల్‌కు అవకాశం లేని జీవితఖైదును విధించనుంది. భార్యాపిల్లల్ని వరుసగా..: ఆ రోజు ఉదయం లక్ష్మీనివాస్ భార్య జయలక్ష్మి (37)తో గొడవపడ్డాడు. ఆమెపై దాడి చేసి వంటగదిలో వాడే కత్తితో పలుమార్లు పొడిచి అనంతరం ఆమె గొంతు కోసేశాడు. తర్వాత పాఠశాల నుంచి ఇంటికి తిరిగివచ్చే కూతురు తేజస్వి (14) కోసం మాటేసి ఆమె లోపలికి వచ్చిన వెంటనే హతమార్చాడు. ఆ తర్వాత 40 నిమిషాలకు ఇంటికి వచ్చిన కుమారుడు శివకుమార్ (12)నూ అదే విధంగా చంపేశాడు. లక్ష్మీనివాస్‌కు జయలక్ష్మి సొంత మేనత్త కూతురు. లక్ష్మీనివాస్ వివాహేతర సంబంధమే ఈ దారుణానికి పురిగొల్పిందనేది జయలక్ష్మి బంధువుల వాదన.