Michigan State
-
మిచిగాన్‌ను ముంచెత్తిన వరద: అత్యవసర పరిస్థితి
వాషింగ్టన్: ఇప్పటికే కరోనా వైరస్ సంక్షోభంతో విలవిల్లాడుతున్న అమెరికాలోని మిచిగాన్ మరో తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మిచిగాన్‌ను అసాధారణమైన వరద ముంచెత్తింది. వరద ఉధృతికి ఈడెన్‌విల్లే, శాన్ఫోర్డ్ ఆనకట్టలు తెగిపోయాయి. దీంతో రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వేగంగా పెరుగుతున్న నీరు ఆనకట్టలను ముంచెత్తింది. రికార్డు స్థాయిలో వరదనీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాలన్నీ జల దిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ఈడెన్ విల్లే, శాన్ఫోర్డ్, మిడ్ ల్యాండ్ నగరాలను ఖాళీ చేయించారు. సుమారు 10,000 మందిని సురక్షిత ప్రారంతాలకు తరలించారు. అటు నేషనల్ వెదర్ సర్వీస్ కూడా దీన్ని ‘ప్రాణాంతక పరిస్థితి’ గా పేర్కొంది. DAM BURST: Residents who live along two lakes and a river in Michigan urged to evacuate after dam fails following days of heavy flooding across parts of the Midwest. https://t.co/EwlVQl6Fdm pic.twitter.com/HfDKWkulDz — ABC News (@ABC) May 20, 2020 రాబోయే 12 నుండి 15 గంటలలో, మిడ్‌లాండ్ దిగువప్రాంతం సుమారు 9 అడుగుల లోతు నీటిలో చిక్కుకోవచ్చని మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ మంగళవారం చెప్పారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎపుడూ చూడలేదనీ, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఖాళీ చేయాలని ప్రజలను ఆమె కోరారు. అటు మిడ్‌ల్యాండ్ ప్రధాన కార్యాలయం ఖాళీ చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి అవసరమైన సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్నారు. మరోవైపు 500 సంవత్సరాల తరువాత 1986లో ఏర్పడిన వరద పరిస్థితి రానుందని, టిట్టాబావాస్సీ నది నీటి మట్టం 38 అడుగుల రికార్డు ఎత్తుకు పెరగనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
అమెరికాలో తెలుగువిద్యార్థిపై కాల్పులు
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో మరో తెలుగువిద్యార్థిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మహబూబాబాద్‌కు చెందిన పూస సాయికృష్ణ మిచిగాన్ రాష్ట్రంలోని లారెన్స్ టెక్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. స్థానిక రెస్టారెంట్లో ఆహార పదార్థాలు తీసుకొని వస్తుండగా సాయికృష్ణపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సాయికృష్ణ కుడిచేతి, మెడపై బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కాల్పుల అనంతరం సాయికృష్ణ వద్ద ఉన్న నగదు, కారు, గుర్తింపు పత్రాలను దుండగులు దోచుకెళ్లారు. ఈ ఘటన ఈనెల 3న జరిగినట్టు తెలుస్తోంది. -
అమెరికాలో తెలుగువిద్యార్థిపై కాల్పులు
-
భయానక యాక్సిడెంట్ వీడియో..
న్యూయార్క్ : అది అమెరికా. మిచిగాన్‌లోని ఓ ప్రధాన రహదారి. వాయు వేగంతో వాహనాలు దూసుకుపోతున్నాయి. వాతావరణంలో తీవ్ర మార్పుల కారణంగా ప్రస్తుతం అక్కడ మంచు కూడా విపరీతంగా పడుతోంది. రోడ్లపైన అక్కడక్కడా పేరుకుపోయింది. ఇది గమనించకుండానే వేగంగా వెళుతున్న వాహనాలు అక్కడక్కడా ప్రమాదానికి గురవుతున్నాయి. ఆ క్రమంలోనే మిచిగాన్‌లోని రహదారిలో పేరుకు పోయిన మంచుకారణంగా ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురికాగా దానిని తొలగించే వాహనంతో ఓ డ్రైవర్ అక్కడికి చేరుకున్నాడు. ప్రమాదానికి గురైన కారు దగ్గరకు వెళ్లి దానిని పరిశీలిస్తుండగానే బుల్లెట్కంటే వేగంగా తనవైపు మరో కారు దూసుకొచ్చింది. కళ్లుమూసి తెరిచేలోపే వేగంగా వచ్చి అప్పటికే ప్రమాదానికి గురైన కారును, అక్కడే ఉన్న తన ట్రక్కును బలంగా ఢీకొట్టడమే కాకుండా ఆ ట్రక్కుపైకి ఎక్కింది. రెప్పపాటులో అక్కడ పరిశీలనలో ఉన్న రిలీఫ్ ట్రక్కు డ్రైవర్ చావునుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరీ! -
భయానక యాక్సిడెంట్ వీడియో..
-
మూడేళ్ల బాలుడిని కాల్చేసిన పదకొండేళ్ల కుర్రాడు
న్యూయార్క్: మూడేళ్ల బాలుడిని పదకొండేళ్ల కుర్రాడు కాల్చిచంపిన ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. డెట్రాయిట్‌లోని తన తండ్రి నివాసానికి పదకొండేళ్ల బాలుడు వచ్చాడు. సోమవారం తండ్రి ఇంట్లో లేని సమయంలో బెడ్రూమ్లో ఉన్న హ్యాండ్‌గన్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటి వెనుక వైపు ఉన్న కారులో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు ఎలిజా వాకర్ వద్దకు వెళ్లి అతనిపై పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపాడు. దీంతో వాకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై వేన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కిమ్ వర్తి మాట్లాడుతూ.. ఎటువంటి కారణం లేకుండా నిందితుడు కాల్పులు జరిపాడని, ఇది కావాలని చేసిందేనని భావించి నిందితునిపై హత్య అభియోగాలు నమోదు చేసినట్టు చెప్పారు. అయితే 11 ఏళ్ల వయసులోనే ఇంత తీవ్రమైన నేరం ఎందుకు చేశాడన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడంలేదు. ఆడుకునే బొమ్మ తుపాకి అనుకుని కాల్చి ఉంటాడా అని భావిస్తున్నారు.