Micra
-
నిస్సాన్ మైక్రాలో ఫ్యాషన్ ఎడిషన్
గుర్గావ్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ ఇండియా’ తాజా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ‘మైక్రా’లో ఫ్యాషన్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటెన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.6.09 లక్షలు. మైక్రా ఫ్యాషన్ లిమిటెడ్ ఎడిషన్‌లో మెకానికల్‌గా మార్పులేవీ లేకున్నా పలు కాస్మొటిక్ అప్‌గ్రేడ్స్ (ఎక్స్టీరియర్, ఇంటీరియర్) ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త మైక్రా ప్రధానంగా ఫ్యాషన్ బ్లాక్, ఫ్యాషన్ ఆరంజ్ రంగుల్లో లభ్యంకానుంది. -
నిస్సాన్ ‘మైక్రా’.. అప్డేటెడ్ వెర్షన్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ‘మైక్రా’లో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు(ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). పెట్రోల్ వేరియంట్ ధర రూ.5.99 లక్షలు–రూ.6.95 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ ధర రూ.6.62 లక్షలు–రూ.7.23 లక్షల శ్రేణిలో ఉందని కంపెనీ పేర్కొంది. ‘జపానీస్ టెక్నాలజీతో యూరోపియన్ స్టైలింగ్‌లో తాజా కొత్త మైక్రాను తయారుచేశాం. ఆకర్షణీయమైన ధరల్లో అందుబాటులో ఉన్న ఒక ఉత్తమమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇది’ అని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. పెట్రోల్ వేరియంట్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను, డీజిల్ వేరియంట్లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందుపరిచామని వివరించారు. కొత్త మైక్రాలో ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. -
నిస్సాన్ మైక్రా.. ఆటోమేటిక్ వేరియంట్
ముంబై: నిస్సాన్ ఇండియా తాజాగా తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ‘మైక్రా’లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. కొత్త ఇంటీరియర్స్‌తో కూడిన ఈ ఆటోమేటిక్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు. ఈ కొత్త వేరియంట్లో నిస్సాన్ ఎక్స్-ట్రానిక్ సీవీటీని అమర్చామని, ఇది మాన్యువల్ వేరియంట్ కన్నా అధిక మైలేజ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. కాగా నిస్సాన్ కంపెనీ ఈ మోడల్‌ను చెన్నై ప్లాంటులో తయారు చేస్తోంది. దేశం నుంచి ఎగుమతి అవుతోన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో మైక్రాదే అగ్రస్థానం. ప్రస్తుతం మైక్రా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మార్కెట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.