ఎల్ఐసీ నుంచి మైక్రో ఇన్సూరెన్స్ పథకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎల్ఐసీ అల్పాదాయ వర్గాల వారి కోసం సూక్ష్మ బీమా పథకం ‘భాగ్యలక్ష్మి’ ప్రవేశపెట్టింది. పాలసీ కాలపరిమితి కంటే రెండు సంవత్సరాలు తక్కువ ప్రీమియం చెల్లించడం ఈ పాలసీలోని ప్రధాన ఆకర్షణ. ఏడు నుంచి 15 ఏళ్ల కాలపరిమితిలో భాగ్యలక్ష్మి పథకం లభిస్తోంది.
18 నుంచి 55 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు. కనీస బీమా రక్షణ మొత్తం రూ. 20,000, గరిష్ట బీమా మొత్తం రూ. 50,000గా నిర్ణయించడం జరిగింది. పాలసీ కాలపరిమితి తర్వాత చెల్లించిన ప్రీమియానికి 110 శాతం గ్యారంటీగా ఇవ్వనున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.