Midde Ramulu
-
ఒగ్గుకళకు జీవంపోసింది మిద్దె రాములే..
అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు వేములవాడ : ఒగ్గుకళకు జీవంపోసి... దానికి నలుదిశలా చాటిచెప్పిన మహనీయుడు మిద్దె రాములు అని రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. పట్టణంలోని రవీంద్ర ఫంక్షన్‌హాలులో బుధవారం జరిగిన జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్షరజ్ఞానం లేకున్నా ఒగ్గుకథ ద్వారా ఆయన విన్యాసాలు, భాషాశైలి జనాల్ని కట్టిపడేసేవని గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాలు, పలు దేశాల్లో ఆయన ప్రదర్శనలిచ్చారన్నారు. ఒగ్గుకథలో పూర్తిస్థాయిలో తెలంగాణ యాస, భాష ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణస్థాయిలో కళాకారులను ప్రోత్సహిస్తూ తన కళా నైపుణ్యంతో ఎంతో మంది శిష్యులకు ఉపాధిబాట చూపించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సైతం తెలుగుభాష, ఒగ్గుకథకు ప్రత్యేక ప్రాధాన్యతినిస్తున్నారన్నారు. జాతీయబుక్ ఆఫ్ ట్రస్టు సంపాదకులు పత్తిపాక మోహన్ మాట్లాడుతూ స్వర్గీయ దేశ ప్రధాని ఇందిరాగాంధికి తెలుగుభాష రాకున్నా ఒగ్గుకథ కళతో అందులోని మాధ్యుర్యాన్ని పంచిపెట్టిన ఘనత మిద్దె రాములుకే దక్కిందన్నారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఇచ్చిన కళ మాత్రం సజీవంగా ఉండిపోతుందని చెప్పారు. అనంతరం కళా ప్రదర్శనల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.నగరపంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్, ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఆదిలాబాద్ రేడియో సహాయ సంచాలకులు సుమనస్పతిరెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ తీగల రవీందర్‌గౌడ్, సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, మిద్దె రాములు ట్రస్టు ఫౌండర్ మిద్దె పర్శరాములు, కళాకారుల సంక్షేమ సంఘం నాయకుడు యెల్ల పోచెట్టి పాల్గొన్నారు. రాజన్న సన్నిధిలో పూజలు వేములవాడ రాజన్నను రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవుళపల్లి ప్రభాకర్‌రావు బుధవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. -
ఒగ్గు కథకు వన్నె తెచ్చిన మిద్దె
మిద్దె రాములు జయంతికి ఏర్పాట్లు వేములవాడలో సమావేశం అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు హాజరు వేములవాడ రూరల్: తెలంగాణ ఒగ్గుకళారూపానికి వన్నె తెచ్చిన ప్రముఖ ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు 76వ జయంతి బుధవారం జరగనుంది. జయంతికి రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన అభిమానులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు హాజరవుతున్నట్లు మిద్దె రాములు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు మిద్దె పర్శరాములు తెలిపారు. మి§ð ్దరామలు 50 సంవత్సరాలకుపైగా ఒగ్గు కళాప్రదర్శనను ఇచ్చి గుర్తింపు తెచ్చారని, ఎన్నో అవార్డులు అందుకున్నారని వివరించారు. బుధవారం జరిగే జయంతి ఉత్సవాల్లో భాగంగా తిప్పాపురం తెలంగాణ విగ్రహం నుంచి కళాకారులతో ర్యాలీగా బయలుదేరి వేములవాడ గాంధీనగర్‌లోగల రవీంద్ర ఫంక్షన్‌హాల్ వరకు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం ఫంక్షన్హాల్లో కళాకారులతో కళాప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కళాప్రదర్శనలో పాల్గొన్న కళాకారులకు బహుమతులను అందించనున్నట్లు తెలిపారు. డీపీఆర్వో ప్రసాద్, ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, పత్తిపాక మోహన్, వేములవాడ ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఎంపీపీ రంగు వెంకటేశంగౌడ్, నగర పంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, జెడ్పీటీసీ గుడిసె శ్రీకాంత్, తదితరులు హాజరవుతున్నట్లు చెప్పారు. -
మిద్దె రాములు పురస్కారాల ఏర్పాటుకు కృషి
కరీంనగర్ : ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు కరీంనగర్ జిల్లాకు చెందిన మిద్దె రాములు పేరిట స్మారక కళా పురస్కారాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి అన్నారు. మిద్దె రాములు నాలుగో వర్ధంతి సభ కరీంనగర్లో మంగళవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులు భగవత్ స్వరూపాలని కొనియాడారు. మిద్దెరాములు గురించి చెప్పడమంటే కొండను అద్దంలో చూపించడమే అవుతుందన్నారు. 2013 సంవత్సరానికి ప్రతిభా పురస్కార్‌ను ఒగ్గుకథ కళాకారుడు రాజీవ్‌కు, హంస అవార్డు గ్రహీత చుక్క సత్తయ్య అవార్డును ఆయన తనయుడు అంజనేయులుకు, 2014 సంవత్సరానికి మిద్దె రాములు పురస్కారాన్ని జానపద కళాకారుడు ఎస్.ప్రభాకర్‌కు అందజేసి సత్కరించారు. -
ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాములు
ఒగ్గు కథ అంటే మిద్దె రాములు.. మిద్దె రాములు అంటేనే ఒగ్గు కథ. ఆయున గజ్జె కట్టి ఆడితే యూవత్ తెలంగాణ ఉర్రూతలూగింది. ఆ పల్లెపదాల పాటగాడి గొంతు గట్లమీదుగా సాగి పంట పొలాలను స్పృశించేది. తంగేడు పూలు తలలూపుతూ స్వాగతం పలికితే... పల్లెలు, తండాలు పరవశించిపోయేవి. ఒగ్గుకథ మూలవాసంగా నిలిచిన ‘మిద్దె’ నేటితరం కళాకారులకు చరిత్రగా మిగిలారు. అక్షరజ్ఞానం లేకున్నా.. ఆశుకవిగా ఆయన తరతరాలకు చెరగని సాంస్కృతిక సంపదగా నిలిచిపోయారు. గ్రామీణ ఒగ్గు కథకు అంతర్జాతీయు కీర్తిని ఆర్జిం చి పెట్టిన జానపద వైతాళికుడు ఆయున. బాల్యం నుంచే పాట... 1942లో కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేట గ్రామంలో జన్మించిన మిద్దె రాములు ఐదుగురు సోదరుల్లో చిన్నవాడు. చిన్ననాటి నుంచే ఒగ్గు కథపై మమకారం పెంచుకున్న రాములు స్వయుంకృషితో ఆ ప్రక్రియను ఆకళింపు చేసుకుని ప్రదర్శనలిచ్చేవారు. సామాన్య గీతకార్మిక కుటుంబంలో పుట్టిన రాములు దేశవ్యాప్తంగా ప్రదర్శనలివ్వడమేకాక విదేశాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. నాలుగు దశాబ్దాలపాటు సాగిన రాములు ఒగ్గు కథా ప్రయూణం పల్లెపదాలే ఇతివృత్తంగా సాగింది. తెలంగాణ వాడుక భాషలో ఆయున చెప్పిన ఎల్లవ్ము, వుల్లవ్ము, సారంగధర, ఐదు వుల్లెపూలు, గంగా-గౌరీ సంవాదం లాంటి కథలు సావూన్య ప్రజానీకానికి సైతం సులభంగా అర్థవుయ్యే రీతిలో సాగేవి. కథ వుధ్యలో జానపద గేయూల్ని ఆలపిస్తూ రాగరంజకంగా కార్యక్రవూన్ని రక్తికట్టించడం ఆయునకే చెల్లింది. నిరక్షరాస్యుడైన రాములుకు తెలంగాణ భాష, పౌరాణిక గాథలు తదితర అంశాలపై గట్టిపట్టుండేది. ఎవరూ చెప్పలేనన్ని, ఎప్పుడూ వినని పక్షులు, చెట్లు, జంతువుల పేర్లతో సహా ఆయున ఒగ్గు కథలు జీవం పోసుకునేవి. ప్రాచీన పురాణాలు, చారిత్రక గాధ లే కాకుండా తన కథ ద్వారా సావూజిక చైతన్యాన్ని రేకెత్తించారాయున. ఒగ్గుకథ పితామహుడు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం గ్రామ దేవతలకు సమర్పించే బోనం. నెత్తిన బోనమెత్తుకుని వడి వడిగా నడవగలగడం నిజంగా నేర్పుతో కూడిన ఘట్టం. ఈ ప్రక్రియను తన జానప ద కళారూపంగా మలచుకున్నాడు మిద్దెరాములు. ఆశువుగా పలికే ఆయన ఒగ్గుకథ శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేస్తే... అలవోకగా ప్రదర్శించే బోనం ప్రక్రియ అందరినీ తన్మయత్వానికి లోనుచేసేది. నెత్తిన ఎత్తిన బోనంపై నిలిపిన జ్యోతి ఆరకుండా ఎత్తిన బోనం సహా నేలపై పడుకుని రూపాయి నాణా న్ని నోటితో తీసే ఆ ప్రదర్శన అపురూపం. ధూం.. ధాం... ఉద్యమ బోనం తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట రూపా లు భాగమయ్యాయి. అందులో సాంస్కృతిక ఉద్యమంగా సాగిన ధూం...ధాం... ప్రధాన భూమికను పోషించింది. ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు దోహదపడిన అనేక రూపాలను ప్రదర్శించిన ఆ వేదిక మిద్దెరాములు బోనం ప్రదర్శనకు పబ్బతి పట్టింది. హైదరాబాద్ బాగమతీ మైదానంలో జరిగిన తొలి ధూం... ధాం కార్యక్రమంలో ఒగ్గుకథ పితామహుడు మిద్దెరాములు ఎత్తిన ఉద్యమ బోనం... ఆయన ఊపిరున్నంతవరకూ అన్ని ధూం... దాం వేదికలపైనా శివాలెత్తింది. ఉర్రూతలూగించి ఉద్య మ కెరటమై నిలిచింది. చూస్తున్న వాళ్ళందరి నరాల్లోనూ ఉత్కంఠరేపే బోనం ప్రక్రియ తెలంగాణ ధూం.. ధాం... వేదికలపై అనేకసార్లు మన్ననలను పొందింది. తిలకించిన ప్రతీ ప్రేక్షకుడిపై తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల చెరగని ముద్రగా నిలిచిపోయింది. బడి తెరవకుండానే నిష్ర్కమణ... ఈ సంప్రదాయాన్ని పోనియ్య... తరతరాలకు నిల్సేట్లుగ జేస్త... తెలంగాణచ్చినంక ఒగ్గుకథకు బడివెడ్తా... కొత్త పిలగాండ్లకు నేర్పిస్త... అనారోగ్యం బారిన పడిన రాములు బసవతారకం ఆసుపత్రిలో తనను పరామర్శించేందుకు వచ్చి న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఈటెల రాజేందర్‌లతో చెప్పిన మాటలివి. అయితే ఒగ్గుకథ పాఠాలు నేర్పే బడి తెరవాలన్న ఆయన కల సాకరమవలేదు. తాను తలపోసిన ఆకాంక్ష నెరవేరకుండానే అనారోగ్యం ఆయన్ను బలిగొంది. 25 నవంబర్ 2010న ఆయన నిష్ర్కమించారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ చరిత్ర పుటల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. (నేడు మిద్దె రాములు 4వ వర్ధంతి) ఎ.కృష్ణా యాదవ్ వేములవాడ, కరీంనగర్