ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాములు | Father oggukatha mahudu midderamulu | Sakshi
Sakshi News home page

ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాములు

Published Tue, Nov 25 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

మిద్దె రాములు

మిద్దె రాములు

ఒగ్గు కథ అంటే మిద్దె రాములు.. మిద్దె రాములు అంటేనే ఒగ్గు కథ. ఆయున గజ్జె కట్టి ఆడితే యూవత్ తెలంగాణ ఉర్రూతలూగింది. ఆ పల్లెపదాల పాటగాడి గొంతు గట్లమీదుగా సాగి పంట పొలాలను స్పృశించేది. తంగేడు పూలు తలలూపుతూ స్వాగతం పలికితే... పల్లెలు, తండాలు పరవశించిపోయేవి. ఒగ్గుకథ మూలవాసంగా నిలిచిన ‘మిద్దె’ నేటితరం కళాకారులకు చరిత్రగా మిగిలారు. అక్షరజ్ఞానం లేకున్నా.. ఆశుకవిగా ఆయన తరతరాలకు చెరగని సాంస్కృతిక సంపదగా నిలిచిపోయారు. గ్రామీణ ఒగ్గు కథకు అంతర్జాతీయు కీర్తిని ఆర్జిం చి పెట్టిన జానపద వైతాళికుడు ఆయున.
 
బాల్యం నుంచే పాట...

1942లో కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేట గ్రామంలో జన్మించిన మిద్దె రాములు ఐదుగురు సోదరుల్లో చిన్నవాడు.  చిన్ననాటి నుంచే ఒగ్గు కథపై మమకారం పెంచుకున్న రాములు స్వయుంకృషితో ఆ ప్రక్రియను ఆకళింపు చేసుకుని ప్రదర్శనలిచ్చేవారు. సామాన్య గీతకార్మిక కుటుంబంలో పుట్టిన రాములు దేశవ్యాప్తంగా ప్రదర్శనలివ్వడమేకాక విదేశాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
 
నాలుగు దశాబ్దాలపాటు సాగిన రాములు ఒగ్గు కథా ప్రయూణం పల్లెపదాలే ఇతివృత్తంగా సాగింది.
 తెలంగాణ వాడుక భాషలో ఆయున చెప్పిన ఎల్లవ్ము, వుల్లవ్ము, సారంగధర, ఐదు వుల్లెపూలు, గంగా-గౌరీ సంవాదం లాంటి కథలు సావూన్య ప్రజానీకానికి సైతం సులభంగా అర్థవుయ్యే రీతిలో సాగేవి. కథ వుధ్యలో జానపద గేయూల్ని ఆలపిస్తూ రాగరంజకంగా కార్యక్రవూన్ని రక్తికట్టించడం ఆయునకే చెల్లింది. నిరక్షరాస్యుడైన రాములుకు తెలంగాణ భాష, పౌరాణిక గాథలు తదితర అంశాలపై గట్టిపట్టుండేది. ఎవరూ చెప్పలేనన్ని, ఎప్పుడూ వినని పక్షులు, చెట్లు, జంతువుల పేర్లతో సహా ఆయున ఒగ్గు కథలు జీవం పోసుకునేవి. ప్రాచీన పురాణాలు, చారిత్రక గాధ లే కాకుండా తన కథ ద్వారా సావూజిక చైతన్యాన్ని రేకెత్తించారాయున.
 
ఒగ్గుకథ పితామహుడు

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం గ్రామ దేవతలకు సమర్పించే బోనం. నెత్తిన బోనమెత్తుకుని వడి వడిగా నడవగలగడం నిజంగా నేర్పుతో కూడిన ఘట్టం. ఈ ప్రక్రియను తన జానప ద కళారూపంగా మలచుకున్నాడు మిద్దెరాములు. ఆశువుగా పలికే ఆయన ఒగ్గుకథ శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేస్తే... అలవోకగా ప్రదర్శించే బోనం ప్రక్రియ అందరినీ తన్మయత్వానికి లోనుచేసేది. నెత్తిన ఎత్తిన బోనంపై నిలిపిన జ్యోతి ఆరకుండా ఎత్తిన బోనం సహా నేలపై పడుకుని రూపాయి నాణా న్ని నోటితో తీసే ఆ ప్రదర్శన అపురూపం.
 
ధూం.. ధాం... ఉద్యమ బోనం

తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట రూపా లు భాగమయ్యాయి. అందులో సాంస్కృతిక ఉద్యమంగా సాగిన ధూం...ధాం... ప్రధాన భూమికను పోషించింది. ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు దోహదపడిన అనేక రూపాలను ప్రదర్శించిన ఆ వేదిక మిద్దెరాములు బోనం ప్రదర్శనకు పబ్బతి పట్టింది. హైదరాబాద్ బాగమతీ మైదానంలో జరిగిన తొలి ధూం... ధాం కార్యక్రమంలో ఒగ్గుకథ పితామహుడు మిద్దెరాములు ఎత్తిన ఉద్యమ బోనం... ఆయన ఊపిరున్నంతవరకూ అన్ని ధూం... దాం వేదికలపైనా శివాలెత్తింది. ఉర్రూతలూగించి ఉద్య మ కెరటమై నిలిచింది. చూస్తున్న వాళ్ళందరి నరాల్లోనూ ఉత్కంఠరేపే బోనం ప్రక్రియ తెలంగాణ ధూం.. ధాం... వేదికలపై అనేకసార్లు మన్ననలను పొందింది. తిలకించిన ప్రతీ ప్రేక్షకుడిపై తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల చెరగని ముద్రగా నిలిచిపోయింది.
 
బడి తెరవకుండానే నిష్ర్కమణ...

ఈ సంప్రదాయాన్ని పోనియ్య... తరతరాలకు నిల్సేట్లుగ జేస్త... తెలంగాణచ్చినంక ఒగ్గుకథకు బడివెడ్తా... కొత్త పిలగాండ్లకు నేర్పిస్త... అనారోగ్యం బారిన పడిన రాములు బసవతారకం ఆసుపత్రిలో తనను పరామర్శించేందుకు వచ్చి న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఈటెల రాజేందర్‌లతో చెప్పిన మాటలివి. అయితే ఒగ్గుకథ పాఠాలు నేర్పే బడి తెరవాలన్న ఆయన కల సాకరమవలేదు. తాను తలపోసిన ఆకాంక్ష నెరవేరకుండానే అనారోగ్యం ఆయన్ను బలిగొంది. 25 నవంబర్ 2010న ఆయన నిష్ర్కమించారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ చరిత్ర పుటల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు.
 (నేడు మిద్దె రాములు 4వ వర్ధంతి)
 ఎ.కృష్ణా యాదవ్  వేములవాడ, కరీంనగర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement