International fame
-
సంగీత సరస్వతికి ‘నూజివీడు’ నీరాజనం
విజయవాడ కల్చరల్: వీణ.. సరస్వతీదేవీ ఒడిలో సరిగమలు పలుకుతుంది.. కళాకారుల చేతిలో సప్త స్వరకుసుమాలను విరబూస్తుంది.. చిట్టిబాబు, ఈమని శంకర శాస్త్రి, వీణా శ్రీవాణి, ఘంటసాల వెంకటేశ్వరరావు, తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, పప్పు సోమేశ్వరరావు, ఆదిభట్ల నారాయణదాసు తదితరులు ఈ వీణ ద్వారా మనోహర స్వరాలు పలికించి సంగీత సరస్వతికి నీరాజనాలు అందించారు. అంతటి మహత్తర వీణ తయారీ వెనుక కఠోర శ్రమ ఉంది. తపస్సు ఉంది. కళాకారులు నిరంతర తపోదీక్షతో వీణకు ప్రాణం పోస్తున్నారు. రాష్ట్రంలో బొబ్బిలి, విజయనగరం, నూజివీడు తదితర ప్రాంతాల్లో వీణలు తయారు చేసినా నూజివీడులో షేక్ మాబూ కుటుంబం తయారు చేసిన వీణకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. దేశ విదేశాల్లో ఉన్న సంగీత విద్వాంసులు వీణ కోసం నూజివీడు కళాకారులను సంప్రదిస్తారు. శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాచందర్, నూకల చిన సత్యనారాయణ. నేదునూరి కృష్ణమూర్తి, ఈమని కల్యాణి, తంగిరాల ప్రణీత వంటి కళాకారులు నూజివీడు కళాకారులు తయారు చేసిన వీణలపైనే రాగాలు పలికించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు నూజివీడు కళాకారులను అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో దసరా మహోత్సవాల సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో నూజివీడు కళాకారులు తయారు చేసిన వీణనే ఉపయోగిస్తారు. తయారీ విధానం : వీణ తయారీకి ప్రత్యేక కలప అవసరం. సుతిమెత్తగా ఉండే పనస చెట్టు నుంచి వచ్చిన కలపను తయారీకి వినియోగిస్తారు. దీని తయారీకి సుమారు 20 రోజులు పడుతుంది. విడి భాగాలుగా తయారు చేసి.. వాటిని ఒకే రూపంలోకి తీసుకొస్తారు. ధర సుమారుగా రూ.40 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇళ్లల్లో, కార్యాలయాల్లో.. షో కేసుల్లో అలంకరించుకునే చిన్న వీణలనూ నూజివీడు కళాకారులు తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన వీణ కళా నైపుణ్యాన్ని చూసి గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు కూడా. ప్రపంచ రికార్డులు సొంతం నూజివీడు కళాకారులు తయారు చేసిన వీణ పలు రికార్డులను సాధించింది. ముఖ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలనూ సాధించింది. ఈ వృత్తినే నమ్ముకున్నాం తాతల కాలం నుంచి ఈ వృత్తినే నమ్ముకున్నాం. ఆర్డర్ చేసిన వారికి కావాల్సిన విధంగా వీణను తయారు చేసి అందిస్తాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కళాకారులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వ సహకారం ఉంటే నూజివీడులో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. మా తండ్రి షేక్ మీరాసాహెబ్ వద్ద వీణ తయారీలో శిక్షణ తీసుకున్నాను. మీరా అండ్ సన్స్ వీణా మేకర్స్ సొసైటీ ద్వారా సేవలందిస్తున్నాం. – షేక్ మాబూ -
ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాములు
ఒగ్గు కథ అంటే మిద్దె రాములు.. మిద్దె రాములు అంటేనే ఒగ్గు కథ. ఆయున గజ్జె కట్టి ఆడితే యూవత్ తెలంగాణ ఉర్రూతలూగింది. ఆ పల్లెపదాల పాటగాడి గొంతు గట్లమీదుగా సాగి పంట పొలాలను స్పృశించేది. తంగేడు పూలు తలలూపుతూ స్వాగతం పలికితే... పల్లెలు, తండాలు పరవశించిపోయేవి. ఒగ్గుకథ మూలవాసంగా నిలిచిన ‘మిద్దె’ నేటితరం కళాకారులకు చరిత్రగా మిగిలారు. అక్షరజ్ఞానం లేకున్నా.. ఆశుకవిగా ఆయన తరతరాలకు చెరగని సాంస్కృతిక సంపదగా నిలిచిపోయారు. గ్రామీణ ఒగ్గు కథకు అంతర్జాతీయు కీర్తిని ఆర్జిం చి పెట్టిన జానపద వైతాళికుడు ఆయున. బాల్యం నుంచే పాట... 1942లో కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేట గ్రామంలో జన్మించిన మిద్దె రాములు ఐదుగురు సోదరుల్లో చిన్నవాడు. చిన్ననాటి నుంచే ఒగ్గు కథపై మమకారం పెంచుకున్న రాములు స్వయుంకృషితో ఆ ప్రక్రియను ఆకళింపు చేసుకుని ప్రదర్శనలిచ్చేవారు. సామాన్య గీతకార్మిక కుటుంబంలో పుట్టిన రాములు దేశవ్యాప్తంగా ప్రదర్శనలివ్వడమేకాక విదేశాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. నాలుగు దశాబ్దాలపాటు సాగిన రాములు ఒగ్గు కథా ప్రయూణం పల్లెపదాలే ఇతివృత్తంగా సాగింది. తెలంగాణ వాడుక భాషలో ఆయున చెప్పిన ఎల్లవ్ము, వుల్లవ్ము, సారంగధర, ఐదు వుల్లెపూలు, గంగా-గౌరీ సంవాదం లాంటి కథలు సావూన్య ప్రజానీకానికి సైతం సులభంగా అర్థవుయ్యే రీతిలో సాగేవి. కథ వుధ్యలో జానపద గేయూల్ని ఆలపిస్తూ రాగరంజకంగా కార్యక్రవూన్ని రక్తికట్టించడం ఆయునకే చెల్లింది. నిరక్షరాస్యుడైన రాములుకు తెలంగాణ భాష, పౌరాణిక గాథలు తదితర అంశాలపై గట్టిపట్టుండేది. ఎవరూ చెప్పలేనన్ని, ఎప్పుడూ వినని పక్షులు, చెట్లు, జంతువుల పేర్లతో సహా ఆయున ఒగ్గు కథలు జీవం పోసుకునేవి. ప్రాచీన పురాణాలు, చారిత్రక గాధ లే కాకుండా తన కథ ద్వారా సావూజిక చైతన్యాన్ని రేకెత్తించారాయున. ఒగ్గుకథ పితామహుడు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం గ్రామ దేవతలకు సమర్పించే బోనం. నెత్తిన బోనమెత్తుకుని వడి వడిగా నడవగలగడం నిజంగా నేర్పుతో కూడిన ఘట్టం. ఈ ప్రక్రియను తన జానప ద కళారూపంగా మలచుకున్నాడు మిద్దెరాములు. ఆశువుగా పలికే ఆయన ఒగ్గుకథ శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేస్తే... అలవోకగా ప్రదర్శించే బోనం ప్రక్రియ అందరినీ తన్మయత్వానికి లోనుచేసేది. నెత్తిన ఎత్తిన బోనంపై నిలిపిన జ్యోతి ఆరకుండా ఎత్తిన బోనం సహా నేలపై పడుకుని రూపాయి నాణా న్ని నోటితో తీసే ఆ ప్రదర్శన అపురూపం. ధూం.. ధాం... ఉద్యమ బోనం తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట రూపా లు భాగమయ్యాయి. అందులో సాంస్కృతిక ఉద్యమంగా సాగిన ధూం...ధాం... ప్రధాన భూమికను పోషించింది. ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు దోహదపడిన అనేక రూపాలను ప్రదర్శించిన ఆ వేదిక మిద్దెరాములు బోనం ప్రదర్శనకు పబ్బతి పట్టింది. హైదరాబాద్ బాగమతీ మైదానంలో జరిగిన తొలి ధూం... ధాం కార్యక్రమంలో ఒగ్గుకథ పితామహుడు మిద్దెరాములు ఎత్తిన ఉద్యమ బోనం... ఆయన ఊపిరున్నంతవరకూ అన్ని ధూం... దాం వేదికలపైనా శివాలెత్తింది. ఉర్రూతలూగించి ఉద్య మ కెరటమై నిలిచింది. చూస్తున్న వాళ్ళందరి నరాల్లోనూ ఉత్కంఠరేపే బోనం ప్రక్రియ తెలంగాణ ధూం.. ధాం... వేదికలపై అనేకసార్లు మన్ననలను పొందింది. తిలకించిన ప్రతీ ప్రేక్షకుడిపై తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల చెరగని ముద్రగా నిలిచిపోయింది. బడి తెరవకుండానే నిష్ర్కమణ... ఈ సంప్రదాయాన్ని పోనియ్య... తరతరాలకు నిల్సేట్లుగ జేస్త... తెలంగాణచ్చినంక ఒగ్గుకథకు బడివెడ్తా... కొత్త పిలగాండ్లకు నేర్పిస్త... అనారోగ్యం బారిన పడిన రాములు బసవతారకం ఆసుపత్రిలో తనను పరామర్శించేందుకు వచ్చి న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఈటెల రాజేందర్‌లతో చెప్పిన మాటలివి. అయితే ఒగ్గుకథ పాఠాలు నేర్పే బడి తెరవాలన్న ఆయన కల సాకరమవలేదు. తాను తలపోసిన ఆకాంక్ష నెరవేరకుండానే అనారోగ్యం ఆయన్ను బలిగొంది. 25 నవంబర్ 2010న ఆయన నిష్ర్కమించారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ చరిత్ర పుటల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. (నేడు మిద్దె రాములు 4వ వర్ధంతి) ఎ.కృష్ణా యాదవ్ వేములవాడ, కరీంనగర్