Mike Gatting
-
బాల్ ఆఫ్ ద సెంచరీ.. బ్యాటర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
క్రికెట్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో ఓ స్పిన్ బౌలర్ నమ్మశక్యంకాని రీతిలో బంతిని స్పిన్ చేసి బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కువైట్ పేరు గల జెర్సీతో కనిపించిన సదరు బౌలర్ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ శైలిలో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. pic.twitter.com/TipPaTbbOS — Out Of Context Cricket (@GemsOfCricket) February 12, 2024 ఆఫ్ స్టంప్ ఆవల పడిన ఫుల్‌టాస్ బంతి నమ్మశక్యంకాని రీతిలో లెగ్ స్టంప్‌ను గిరాటు వేసింది. బంతి స్పిన్ అయిన విధానం చూసి బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎలా స్పందించాలో తెలియక గమ్మున పెవిలియన్ బాటపట్టాడు. ఈ వీడియోని చూసిన వారంతా షేన్ వార్న్ బాల్ ఆఫ్ ద సెంచరీని మించిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను బట్టి చూస్తే ఈ మ్యాచ్ ఏదో దేశవాలీ టోర్నీలో జరిగనట్లుగా తెలుస్తుంది. Rest in Peace to the man who gave us the Ball of the Century. There will never be another like Shane Warne. pic.twitter.com/ddFaUoiTGD — Derek Alberts (@derekalberts1) March 4, 2022 కాగా, 1993లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో షేన్ వార్న్.. మైక్ గ్యాటింగ్‌ను నమ్మశక్యంకాని రీతిలో క్లీన్ బౌల్డ్ చేశాడు. వార్న్ వేసిన లెగ్ స్పిన్ బంతిని అంచనా వేయలేక గ్యాటింగ్ తికమకపడిపోయాడు. ఎక్కడో లెగ్ స్టంప్ అవతల పడిన బంతి గింగిరాలు తిరుగుతూ గ్యాటింగ్ డిఫెన్స్‌ను తప్పించుకుని ఆఫ్ స్టంప్‌ను తాకింది. ఈ బంతిని బాల్ ఆఫ్ ద సెంచరీగా పిలుస్తారు. ఇదిలా ఉంటే, దివంగత షేన్ వార్న్ ఇలాంటి బంతులను చాలా సందర్భాల్లో సంధించిన విషయం తెలిసిందే. 90వ దశకంలో షేన్ వార్న్ స్పిన్ మాయాజాలానికి బ్యాటర్లు బెంబేలెత్తిపోయేవారు. వార్న్ సంధించే బంతులను ఎలా ఆడాలో తెలియక తికమకపడిపోయేవారు. ఏ బంతి ఎక్కడ ల్యాండై ఎలా టర్న్ అవుతుందో అర్ధంకాక జట్టు పీక్కునేవారు. వార్న్ టెస్ట్ క్రికెట్లో రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా ఉన్నాడు. వార్న్ 2022లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. -
Shane Warne: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది!
Ball Of The Century : ‘‘1993.. సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం షేన్ వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీని చూసింది’’ అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్, దివంగత షేన్ వార్న్‌ను గుర్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా 1993 యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఈ క్రమంలో మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా జూన్ 3 తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 289 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ గ్రాహమ్ గూచ్ శుభారంభం అందించాడు. 65 పరుగులతో జోరు మీదున్న సమయంలో వార్న్ అతడిని పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రెండో రోజు(జూన్ 4) వన్‌డౌన్‌లో వచ్చిన మైక్ గాటింగ్‌ను అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. బాల్‌ను నేరుగా గాటింగ్ కాళ్ల ముందు వేసి.. ఆఫ్ వికెట్‌ను ఎగురగొట్టాడు. అసలు బంతి ఎక్కడ పడుతుందో బ్యాటర్ అంచనా వేసే లోపే ఈ విధంగా అద్భుతం చేశాడు వార్న్. దీంతో గాటింగ్ సమా అంపైర్ కూడా బిక్కమొహం వేశారంటే ఈ స్పిన్ మాంత్రికుడి మాయాజాలం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనిని బాల్ ఆఫ్ ది సెంచరీగా పేర్కొంటూ వార్న్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 8 వికెట్లు పడగొట్టిన వార్న్.. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో నాటి మొదటి టెస్టులో ఆసీస్ 179 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే విధంగా ఆరు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌ను గెలిచి ప్రతిష్టాత్మక యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. కాగా ఈ ఏడాది మార్చి 4న షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. థాయ్‌లాండ్‌లోని విల్లాలో విగతజీవిగా కనిపించాడు. 1993 యాషెస్ సిరీస్: ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్టు స్కోర్లు ఆస్ట్రేలియా: 289 & 432/5 డిక్లేర్డ్ ఇంగ్లండ్: 210 & 332. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షేన్ వార్న్ చదవండి: T20 WC 2022: అస్సలు బాలేదు.. కోహ్లి, రోహిత్ తమ మార్కు చూపించాలి.. లేదంటే కష్టమే! On this day in 1993, the world witnessed Shane Warne's 'Ball of the Century' 🔥 pic.twitter.com/E47RM3BpwA — ICC (@ICC) June 4, 2022 -
చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'
ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. లెగ్ స్పిన్నర్‌గా ఆటకు వన్నె తెచ్చిన వార్న్ లెక్కలేనన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్(708 వికెట్లు) ఇప్పటికీ రెండో స్థానంలో కొనసాగడం విశేషం. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో బ్యాట్స్మెన్లను హడలెత్తించడమే కాకుండా ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా నిలిచేవాడు. మరి అలాంటి వార్న్ కెరీర్లో ఒక బంతి బాల్ ఆఫ్ ది సెంచరీగా నిలిచిపోయింది. 1993లో యాషెస్ సిరీస్‌లో భాగంగా మైక్ గాటింగ్‌ను వార్న్ ఔట్ చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. వార్న్ మృతికి సంతాపంగా మరోసారి ఆ సంఘటనను గుర్తుచేసుకుందాం. సరిగ్గా 27 ఏళ్ల క్రితం 1993లో ఇంగ్లండ్‌తో వారి దేశంలో జరిగిన యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో వార్న్ ఒక అద్భుతమైన బంతిని సంధించాడు. ఆ టెస్టు మ్యాచ్ జూన్ 3వ తేదీన ఆరంభం కాగా, రెండో రోజు ఆట(జూన్ 4వ తేదీన)లో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు మైక్ గాటింగ్‌ను బోల్తా కొట్టించిన తీరు వార్న్ కెరీర్‌ను మలుపు తిప్పింది. బంతిని నేరుగా గాటింగ్ కాళ్లకు ముందు అవుట్‌సైడ్ లెగ్‌స్టంప్‌పై వేసి ఆఫ్ వికెట్‌ను ఎగరుగొట్టిన తీరు ఇప్పటికీ చిరస్మరణీయమే. అసలు బంతి ఎక్కడ పడుతుందా అని గాటింగ్ అంచనా వేసే లోపే ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఆ బంతికి గాటింగ్ షాక్ కాగా, ఫీల్డ్‌లో ఉన్న అంపైర్‌కు కూడా కాసేపు ఏమీ అర్థం కాలేదంటే అది ఎంతలా స్పిన్ అయ్యి ఉంటుందో( ఎంతలా స్పిన్ చేశాడో) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో వార్న్‌దే కీలక పాత్ర. ప్రతీ ఇన్నింగ్స్‌లోనూ నాలుగేసి వికెట్లు సాధించి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు. వార్న్ కెరీర్‌కు పునాది పడిన సందర్భం కచ్చితంగా అదే టెస్టు మ్యాచ్. 1992లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన వార్న్.. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ దిగ్గజాల సరసన నిలిచిపోయాడు. చదవండి: Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం Shane Warne: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'