భూమి గుండ్రంగా లేదని నిరూపిస్తా..
కాలిఫోర్నియా : భూమి గుండ్రంగా లేదని తాను నిరూపిస్తానని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి శాస్త్రవేత్తలకు సవాలు విసిరాడు. అంతేకాదు పాత సామగ్రితో సొంతంగా రాకెట్‌ను తయారు చేసిన 61 ఏళ్ల మైక్ హగ్స్ తనను తాను భూమి నుంచి 1,800 అడుగుల ఎత్తుకు ప్రయోగించుకోనున్నట్లు చెప్పాడు.
ఒక మైలు దూరం ప్రయాణించే ఈ రాకెట్లో అత్యధిక ఎత్తుకు చేరుకున్న తర్వాత ఓ ఫొటోలు తీసి భూమి ఫ్లాట్‌గా ఉందని నిరూపిస్తానని అమెరికన్ మీడియాతో చెప్పుకొచ్చాడు. భూమి గుండ్రంగా లేదని నిరూపించడంలో ఇది కేవలం తొలి దశ మాత్రమేనని అన్నాడు. అంత ఎత్తు నుంచి కిందపడినా తాను మరణించకుండా ఉండేందుకు మోజావే ఎడారిని ప్రయోగస్ధలంగా ఎంచుకున్నట్లు వెల్లడించాడు.