నేపాల్లో మరో మారు భూకంపం
నేపాల్: పెను భూకంపానికి గురైన నేపాల్లో మరోసారి భూమి కంపించింది. సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా భయం గుప్పిట్లోకి జారుకుని ఇళ్ల బయటకు పరుగులు తీశారు.
గోర్ఖా అనే ప్రాంతంలో భూకంపం కేంద్రం నమోదై ఉన్నట్లు జాతీయ భూగర్భ శాస్త్రజ్ఞులు తెలిపారు. ఖట్మాండుకు 150 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉండటంతో ప్రకంపనలు ఖట్మాండుకు కూడా వ్యాపించాయి. గత ఏప్రిల్ 25న భారీ భూకంపం చోటుచేసుకుని దాదాపు పదివేలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.