Military Helicopter
-
నవ వధువుని మిలటరీ హెలికాప్టర్లో తీసుకెళ్లిన కమాండర్! ఆగ్రహించిన ప్రజలు
Commander landing near the bride's house: తాలిబన్ కమాండర్ నవ వధువుని ఇంటికి తీసుకెళ్లేందుకు మిలటరీ హెలికాప్టర్ని ఉపయోగించారంటూ ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మీడియా కథనం ప్రకారం... ఒక తాలిబన్ వ్యక్తి నవ వధువుని తీసుకుని మిలటరీ చాపర్‌లో పయనించాడని అఫ్గాన్ స్థానిక మీడియా పేర్కొంది. అతను తన భార్యను తీసుకుని ఆ చాపర్‌లో అప్గనిస్తాన్‌లోని లోగర్ నుంచి ఖోస్ట్ ప్రావిన్స్ వెళ్లినట్లు తెలిపింది. పైగా ఆ వ్యక్తిని హక్కాని శాఖ కమాండర్‌గా పేర్కొంది. అంతేకాదు ఆ కమాండర్ నవవధువు ఇంటి దగ్గర హెలికాప్టర్ నుంచి దిగుతున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యక్తి ఆమెని వివాహం చేసుకునేందుకు తన మామగారికి దాదాపు రూ. 10 లక్షలు పైనే చెల్లించాడని వెల్లడించింది. అంతేగాక ఆ వ్యక్తి ఖోస్ట్‌లో నివశిస్తున్నాడని, అతని భార్య పుట్టిల్లు లోగర్‌లోని బార్కి బరాక్ జిల్లాలో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయంటూ కథనాలు వచ్చాయి. ఈ విషయమై తాలిబన్ డిప్యూటి అధికార ప్రతినిధి ఖారీ యూసుఫ్ అహ్మదీ స్పందిస్తూ... ఆ వ్యాఖ్యలను ఖండించారు. సేనాధిపతి చేసిన వ్యాఖ్యలను శత్రువులు చేస్తున్న తప్పుడూ ప్రచారంగా పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఆరోపణలను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ తోసిపుచ్చింది కూడా. ఐతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు ఈ చర్యను ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఇది ప్రజా ఆస్తులను దుర్వినియోగపరచడం కిందకే వస్తుందంటూ ప్రజలు పెద్ద ఎత్తున మండిపడ్డారు. -
సముద్రంలో కుప్పకూలిన మిలిటరీ విమానం
టొరంటో : కెనడాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. నాటో టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా ప్రయాణించిన హెలికాప్టరు గ్రీస్ లోని లోనియన్ సముద్రతీరంలో కుప్పకూలిందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడీ వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతు ఆయ్యారని తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, వారంతా క్షేమంగా భయటపడాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని మెరైన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ఆఫీసర్ సబ్ లెఫ్టినెంట్ అబ్బిగైల్ కోబ్రౌగా గుర్తించినట్లు పేర్కొన్నారు. (కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి) ఘటనపై కోబ్రౌ తల్లి మాట్లాడుతూ..నా అందమైన గారాలపట్టి నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అంటూ వాపోయింది. హెలికాప్టరులో రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలుగురు సభ్యులతో పాటు మరో ఇద్దరు సెన్సార్ ఆపరేటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరి కుటుంబాలకు ప్రాథమికంగా సమాచారం అందించామని, అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. (కెనడా ప్రధాని.. వర్క్ ఫ్రమ్ హోమ్ ) -
చొచ్చుకువచ్చిన చైనా సైనిక హెలికాఫ్టర్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా సైనిక విమానం సోమవారం నియంత్రణ రేఖను దాటి భారత గగనతలంలోకి చొచ్చుకురావడం కలకలం రేపింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బరహోటి ప్రాంతంలో చైనా మిలటరీ హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టింది. గగనతల నిబంధనలను ఉల్లంఘించి చైనా సైనిక హెలికాఫ్టర్ భారత గగనతలంలోకి ఎలా వచ్చిందనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది. మరోవైపు డోక్లాం వివాదం నేపథ్యంలో ఇరు దేశాలు ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. డోక్లాం వ్యవహారంలో చైనా దూకుడు పెంచడంతో భారత్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గత నెలరోజుల్లో చైనా హెలికాఫ్టర్లు మన గగనతలంలోకి చొచ్చుకురావడం ఇది నాలుగోసారి. ఈనెల 10న మూడు చైనా సైనిక హెలికాఫ్టర్లు బరహోతిలో ప్రవేశించాయి. నాలుగు కిలోమీటర్ల మేర భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన చాపర్లు దాదాపు ఐదు నిమిషాల పాటు చక్కర్లు కొట్టాయి. మార్చి 8న లడఖ్‌లో రెండు చైనా హెలికాఫ్టర్లను గుర్తించారు. భారత గగనతలంలోకి 18 కిమీ లోపలికి అవి చొచ్చుకువచ్చాయి. ఫిబ్రవరి 27న చైనా హెలికాఫ్టర్ లడఖ్లనో డెసాంగ్, ట్రిగ్ హైవే చేరువలో 19 కిలోమీటర్లలోపలికి భారత గగనతలంలోకి వచ్చి కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. -
స్కూలు భవనంపై కూలిన హెలికాప్టర్
కౌలాలంపూర్: మలేసియా మిలటరీకి చెందిన హెలికాప్టర్ ఓ పాఠశాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు సహా 22 మంది గాయపడ్డారు. మంగళవారం బోర్నియో ద్వీపంలోని సబా రాష్ట్రం తవాలో ఈ దుర్ఘటన జరిగింది. సాధారణ మిలటరీ కార్యకలాపాల్లో భాగంగా ఈ హెలికాప్టర్ వెళ్లినట్టు మలేసియా ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. పాఠశాల భవనం పైకప్పుపై హెలికాప్టర్ అత్యవసరంగా క్రాష్ ల్యాండ్ అయినట్టు చెప్పారు. ఇందులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. కాగా పైలట్ పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
పాఠశాలలో కూలిన ఆర్మీ హెలిక్యాప్టర్
కౌలాలంపూర్: మిలటరీకి చెందిన యుద్ధ విమానం ప్రమాదవశాత్తు పాఠశాలలో పడిపోయింది. ఇందులో ఏడు మంది విద్యార్థులతో సహా 22 మందికి గాయాలయ్యాయి. పైలట్ పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటన మలేషియాలోని సభా రాష్ట్రం తవు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కౌలాలంపూర్ ఆర్మీకి చెందిన శిక్షణ విమానం ప్రమాదవశాత్తు బోర్నియా ద్వీపం సభా రాష్ట్రంలోని తవు గ్రామంలోని పాఠశాల క్యాంటీన్ పై కప్పుకు ఢీ కొట్టింది. వెంటనే పాఠశాలలో పడిపోయింది. కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.