కూలిన సైనిక విమానం: 25 మంది మృతి
డమాస్కస్: సిరియాలో యుధ్ద విమానం జనావాసాల మీద కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. చాలామంది గాయపడినట్టు తెలుస్తోంది. నైరుతి సిరియా నగరం జెరికోలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. విమాన సిబ్బంది ఆచూకీ తెలియలేదని మిలిటరీ వర్గాలు తెలిపాయి.
విమానం ఇళ్ల మీద కూలిపోవడంతో.. ఈ ప్రమాదంలో కొన్ని డజన్ల మంది గాయపడి ఉంటారని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.