జొకోవిచ్ ‘హ్యాట్రిక్’
ఇండియన్ వెల్స్ ఓపెన్ సొంతం
కాలిఫోర్నియా (అమెరికా): పురుషుల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను ఈ సెర్బియా స్టార్ వరుసగా మూడో ఏడాది సొంతం చేసుకొని హ్యాట్రిక్ సాధించాడు. ఫైనల్లో జొకోవిచ్ 6-2, 6-0తో మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను చిత్తుగా ఓడించి విజేతగా నిలిచాడు.
ఓవరాల్ ఈ టైటిల్‌ను ఐదోసారి నెగ్గిన జొకోవిచ్ ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా కెరీర్లో 27వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నెగ్గి అత్యధిక మాస్టర్స్ టైటిల్స్‌ను సాధించిన క్రీడాకారుడిగా రాఫెల్ నాదల్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.