MIM corporater
-
బీజేపీ నేతల చేతిలో చావుదెబ్బలు.. జైలుకు!
ఔరంగాబాద్ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించిన ఏఐఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ మటీన్ రషీద్‌ను ఏడాది పాటు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఔరంగాబాద్ పోలీసులు ఓ సంవత్సరం కాలం మటీన్‌ను జైలులో విచారించనున్నారు. ఏఐఎంఐఎం కార్పొరేటర్‌పై మహారాష్ట్ర చట్టం ఎంపీడీఏ-1981 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇటీవల వాజ్‌పేయి మరణానంతరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్ రాజు విద్యా సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఎంఐఎం సభ్యుడు సయ్యద్ మటీన్ వ్యతిరేకించారు. దీంతో రగిలిపోయిన బీజేపీ సభ్యులు ఆవేశంతో దాడికి దిగి సయ్యద్‌ను చితకబాదారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారి నుంచి సయ్యద్‌ను కాపాడి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. మటీన్‌పై దాడి చేసిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (‘వాజ్‌పేయికి నివాళి అర్పించను’.. రచ్చ రచ్చ!) అయితే గతంలోనూ జాతీయ గీతాన్ని ఆలపించడానికి మటీన్ నిరాకరించాడని.. ప్రస్తుతం వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించారని బీజేపీ కార్పొరేటర్లు తెలిపారు. మటీన్ తన చర్యల ద్వారా హిందూ-ముస్లిం మతాల విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం చేశారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు సిటీ చౌక్ పోలీసులు మటీన్‌ను అరెస్ట్ చేసి హర్సల్ జైలుకు తరలించారు. మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పనులు చేస్తే ఎంపీడీఏ కింద ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాల్సి ఉంటుందని కమిషనర్ చిరంజీవ్ ప్రసాద్ వివరించారు. -
వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించడంతో..
-
‘వాజ్‌పేయికి నివాళి అర్పించను’.. రచ్చ రచ్చ!
సాక్షి, ముంబై, ఔరంగాబాద్ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాప తీర్మానంను వ్యతిరేకించిన ఓ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కార్పొరేటర్‌పై బీజేపీ కార్పొరేటర్లు దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో చోటుచేసుకుంది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులందరూ నివాళి అర్పించేందుకు శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాజ్‌పేయి మృతికి సంతాపం వ్యక్తం చేయాలని బీజేపీ కార్పొరేటర్ రాజు విద్యా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అతడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎంఐఎం సభ్యుడు సయ్యద్ మటీన్ వ్యతిరేకించారు. దీంతో రగిలిపోయిన బీజేపీ సభ్యులు ఒక్కసారిగి అతనిపై దాడికి దిగి సయ్యద్‌ను చితకబాదారు. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తం కావడంతో వారి నుంచి సయ్యద్ తప్పించుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మటీన్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై బీజేపీకి చెందిన ఓ నేత మాట్లాడుతూ... మాజీ ప్రధాని మృతికి సంతాపం వ్యక్తం చేయవల్సిందిగా తీర్మానం ప్రవేశపెడితే దానిని వ్యతిరేకించారని, గతంలో కూడా సభలో జాతీయ గీతం పాడటానికి అతను వ్యతిరేకించారని తెలిపారు. తమ సభ్యుడిపై దాడి చేశారన్న వార్తను తెలుసుకున్న స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అక్కడున్న బీజేపీ నేతల కార్లను ధ్వంసం చేసి, కారు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. మటీన్‌పై దాడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఎంఐఎం, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్‌నగర్ బస్తీ సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక ఎంఐఎం కార్పోరేటర్లు అడ్డుకున్నారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా.. నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అనుచరులు, ఎంఐఎం కార్పోరేటర్లు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.