ఎంఐఎం మాకు ఫ్రెండ్లీ పార్టీ: హోం మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయ పార్టీలకు మాత్రమే స్థానం ఉంటుందని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) తమకు ఫ్రెండ్లీ పార్టీ అని కూడా నాయిని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అసలు తెలుగుదేశం పార్టీకి స్థానం లేదని, టీడీపీ నుంచి మరికొంతమంది నాయకులు టీఆర్ఎస్లో చేరుతారని ఆయన చెప్పారు. తాజాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గులాబి కండువా కప్పుకోడానికి సిద్ధమైన నేపథ్యంలో నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు.