ఎంఐఎం ఎమ్మెల్యే వీరంగం, ఉద్రిక్తత
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులను ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అడ్డుకున్నారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో అక్రమంగా నిర్మించిన 300 మీటర్ల గోడను జీహెచ్ఎంసీ అధికారులు పోలీసుల సాయంతో కూల్చివేస్తున్నారు. విషయం తెలుసుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకొని నానా హంగామా చేశారు.
గోడను తొలగిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులను తన మనుషులతో బెదిరించి అక్కడి నుంచి పంపించేయడానికి యత్నించారు. కమిషనర్ ఆదేశాల ప్రకారమే కూల్చివేస్తున్నామని ఎమ్మెల్యేకు చెప్పినా.. పట్టించుకోకుండా బూతు పురాణం మొదలుపెట్టారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.