minar
-
బాల్యవివాహాన్ని అడ్డుకున్న ‘చైల్డ్‌లైన్’
కుల్కచర్ల: అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు సహకరించిన వారిపై చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రీనివాస్ శంకర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి రాములు హెచ్చరించారు. మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన బాలయ్య, మంగమ్మల కుమార్తె (17)కు మైనారిటీ తీరకుండానే పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఈ విషయం చైల్డ్ లైన్ ప్రతినిధులకు తెలియడంతో గురువారం స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో బండవెల్కిచర్ల గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలకు పెళ్లి వయస్సు రాకముందే వివాహం చేస్తే కలిగే అనర్థాల గురించి వివరించారు. తహసీల్దార్ శ్రీనివాస్ దగ్గరకు తీసుకొచ్చి వారితో హమీ పత్రం రాయించుకున్నారు. తమ బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన తరువాతనే పెళ్లి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
బాలికపై లైంగిక దాడి
కొడకండ్ల : ఏడేళ్ల బాలికపై.. విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొడకండ్లలోని ప్రైమరీ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న బాలిక తల్లిదండ్రు లు గురువారం కూలి పనులకు వెళ్లడంతో ఆమె ఇంటి వద్దే ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంటి ఎదురుగా చెట్టు కింద పడుకున్న బాలికపై అ దే వీధికి చెందిన బండారు సోమన్న (16) లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, జరిగిన సంఘటనను బాలిక సాయంత్రం వేళలో తల్లికి వివరించింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జనగామ డీఎస్పీ పద్మనాభరెడ్డి.. మహిళా పీఎస్ ఎస్సై రాజ్యలక్షి్మతో శుక్రవారం గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. అనంతరం లైంగికదాడికి పా ల్పడిన సోమన్నపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పాలకుర్తి సీఐ కరుణసాగర్‌రెడ్డి, ఎస్సై ఎంబాడి సత్యనారాయణ, పీఎస్సై రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
బాలిక వివాహం నిలిపివేత
మల్లాపూర్: మైనర్‌బాలిక పెళ్లిచేసేందుకు యత్నించిన తల్లిదండ్రులకు తహశీల్దార్ రవీందర్‌రాజు, ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏఎస్సై అహ్మదుల్లాఖాన్ మంగళవారం ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎఎస్సై అహ్మదుల్లాఖాన్‌లతో కౌన్సెలింగ్ నిర్వహించారు. 18 ఏళ్లు నిండని బాలికకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని వారు సూచించారు.మండలంలోని సిరిపూర్ గ్రామానికి చెందిన గుగ్లావత్ రాంనాయక్–లక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె శశిరేఖ(16)కు అదే గ్రామానికి చెందిన భూక్య సురేష్‌తో ఈనెల 10న వివాహం నిశ్చయించారు. శశిరేఖ మెట్పల్లిలో ఇంటర్ చదువుతోంది. మైనర్‌బాలికకు వివాహం చేస్తున్నారని ఒడ్డెలింగాపూర్‌కు చెందిన బాలిక మేనత్త భూక్య జమున తహశీల్దార్ కార్యాలయం, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులను మంగళవారం తహశీల్దార్ కార్యాలయంకు పిలిపించి తహశీల్దార్, ఎంపీడీవో, ఏఎస్సైలు కౌన్సిలింగ్ నిర్వహించారు. శశిరేఖకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. అధికారులు, కులపెద్దలు, గిరిజన సంఘం నాయకుల కౌన్సెలింగ్‌లో రాంనాయక్–లక్ష్మీ దంపతులు తమ కుమార్తె వివాహ నిర్ణయాన్ని మార్చుకున్నారు. శశిరేఖకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం జరిపిస్తామని అధికారులకు అంగీకార పత్రాన్ని రాసి ఇచ్చారు.