బాలిక వివాహం నిలిపివేత
Published Tue, Aug 9 2016 6:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
మల్లాపూర్: మైనర్‌బాలిక పెళ్లిచేసేందుకు యత్నించిన తల్లిదండ్రులకు తహశీల్దార్ రవీందర్‌రాజు, ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏఎస్సై అహ్మదుల్లాఖాన్ మంగళవారం ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎఎస్సై అహ్మదుల్లాఖాన్‌లతో కౌన్సెలింగ్ నిర్వహించారు. 18 ఏళ్లు నిండని బాలికకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని వారు సూచించారు.మండలంలోని సిరిపూర్ గ్రామానికి చెందిన గుగ్లావత్ రాంనాయక్–లక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె శశిరేఖ(16)కు అదే గ్రామానికి చెందిన భూక్య సురేష్‌తో ఈనెల 10న వివాహం నిశ్చయించారు. శశిరేఖ మెట్‌పల్లిలో ఇంటర్ చదువుతోంది. మైనర్‌బాలికకు వివాహం చేస్తున్నారని ఒడ్డెలింగాపూర్‌కు చెందిన బాలిక మేనత్త భూక్య జమున తహశీల్దార్ కార్యాలయం, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులను మంగళవారం తహశీల్దార్ కార్యాలయంకు పిలిపించి తహశీల్దార్, ఎంపీడీవో, ఏఎస్సైలు కౌన్సిలింగ్ నిర్వహించారు. శశిరేఖకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. అధికారులు, కులపెద్దలు, గిరిజన సంఘం నాయకుల కౌన్సెలింగ్‌లో రాంనాయక్–లక్ష్మీ దంపతులు తమ కుమార్తె వివాహ నిర్ణయాన్ని మార్చుకున్నారు. శశిరేఖకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం జరిపిస్తామని అధికారులకు అంగీకార పత్రాన్ని రాసి ఇచ్చారు.
Advertisement
Advertisement