గని తవ్వకాలను అడ్డుకున్నగామస్తులు
బనగానిపల్లె: ఖనిజ తవ్వకాల కోసం సిమెంటు కంపెనీకి అనుమతి ఇవ్వటాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. తమకు ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా బనగానిపల్లె మండలం మీరాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని భూమిని ప్రభుత్వం ఓ సిమెంటు కంపెనీకి లీజుకిచ్చింది. అందులో రాయిని తీసేందుకు గురువారం ఉదయం సదరు కంపెనీ సిబ్బంది రాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అదే ప్రాంతంలో వారు ఇప్పటికే రాయి తీస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ విషయంలో గ్రామస్తులతో కంపెనీ ప్రతినిధులకు వాగ్వాదం తీవ్రం కావటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.