mini lorry
-
రోడ్డు ప్రమాదంలో భర్త కళ్ల ముందే భార్య దుర్మరణం
జీడిమెట్ల: భార్యాభర్తలు షాపింగ్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన మినీ లారీ వారు ప్రయాణిస్తున్న భైక్‌ను ఢీ కొట్టడంతో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజీవ్‌గాంధీ నగర్, మోడీ ఎలిగెన్స్‌లో నివాసంఉంటున్న నాగరాజు, సిప్రారాణి త్రిపాఠి(28) దంపతులు శనివారం రాత్రి షాపింగ్ నిమిత్తం రంగా భుజంగా పైప్‌లైన్ రోడ్డు మీతుగా సుచిత్ర వైపు వెళ్తున్నారు. రంగా భుజంగా సినిమా థియేటర్ సమీపంలో వెనుకనుంచి వచ్చిన మినీ లారీ వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నాగరాజు ఎడమవైపునకు పడిపోగా అతడి భార్య సిప్రారాణి(28) కుడివైపు కింద పడింది. సిప్రారాణి తలపై నుంచి లారీ వెనుక టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన అము అక్కడికక్కడే మృతిచెందింది. ఎస్సై నాయుడు ఘటనస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేశారు. -
తెల్లారిన కూలీల బతుకులు
వినుకొండ (నూజెండ్ల): పొట్టకూటి కోసం వలస వచ్చిన నిరుపేదల పాలిట మినీ లారీ మృత్యుపాశమయ్యింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురి బతుకులు తెల్లారిపోగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా వినుకొండ రూరల్ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని పార్లపలి, మాసుమాను దొడ్డి, కొసిగి, పల్లెపాడు గ్రామాల నుంచి సోమవారం రాత్రి గుంటూరు జిల్లాకు సుమారు 100 మందికి పైగా వలస కూలీలు నాలుగు మినీ లారీల్లో బయలు దేరారు. యడ్లపాడు, పెదనందిపాడు ప్రాంతాల్లో మిర్చి, వేరుశనగ పొలాల్లో కూలి పనుల కోసం వీరంతా వస్తున్నారు. వీరిలో మాసుమానుదొడ్డి గ్రామానికి చెందిన కూలీలతో బయలుదేరిన మినీ లారీ అందుగుల కొత్తపాలెం గ్రామ శివారులోని లక్ష్మక్క వాగు బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఘటనలో భీముడు (50), యర్నాల శ్రీనివాసరావు (6), వాహనం యజమాని, డ్రైవర్ బొంతల ఉమేష్‌కుమార్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. వినుకొండ, బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల 108 వాహన సిబ్బంది సకాలంలో స్పందించి గాయపడ్డ వారిని పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృత దేహాలతో పాటు గాయపడిన వారిని బయటకు తీసి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమ సహచరుల వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మిగతా వలస కూలీలు భారీగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. వారందరినీ స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
మినీలారీ చోరీ
సూళ్లూరుపేట: పట్టణంలోని మున్నాబాయ్ దాబాహోటల్ సమీపంలో శనివారం రాత్రి నిలిపిన మినీ లారీ చోరీకి గురైందని దాని యజమాని అరుణాచలం సెల్వం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం నుంచే వాహనం కనిపించలేదని, పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని బాధితుడు తెలిపారు. ఎస్సై గంగాధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మినీ లారీ బోల్తా: ఒకరి మృతి
చిత్తూరు: మినీలారీ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వలమనేరు మండలం భూతలబండ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. చెన్నై వరద బాధితులకు వస్తువులను మినీలారీలో తీసుకెళ్తుండగా అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భీమవరంలో అగ్నిప్రమాదం
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ఫ్లైఓవర్ కింద బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది పూరిళ్లు దగ్ధం కాగా, ఓ మినీ లారీ కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. ఫ్లైఓవర్ కింద పది కుటుంబాలు గుడిసెల్లో నివసిస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి నిప్పు రవ్వలు ఎగసి పడడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. -
మినీ లారీ - ప్రైవేటు బస్సు ఢీ
చిత్తూరు (వి.కోట) : చిత్తూరు జిల్లా వి.కోట మండలం నాయకనేరి ఘాట్ వద్ద శనివారం మధ్యాహ్నం ఓ మినీ లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన వి.కోట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో ప్రైవేటు బస్సు వి.కోట నుంచి తమిళనాడు వెళ్తుండగా, మినీ లారీ తమిళనాడు నుంచి వి.కోట వైపు వస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.