
జీడిమెట్ల: భార్యాభర్తలు షాపింగ్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన మినీ లారీ వారు ప్రయాణిస్తున్న భైక్‌ను ఢీ కొట్టడంతో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజీవ్‌గాంధీ నగర్, మోడీ ఎలిగెన్స్‌లో నివాసంఉంటున్న నాగరాజు, సిప్రారాణి త్రిపాఠి(28) దంపతులు శనివారం రాత్రి షాపింగ్ నిమిత్తం రంగా భుజంగా పైప్‌లైన్ రోడ్డు మీతుగా సుచిత్ర వైపు వెళ్తున్నారు. రంగా భుజంగా సినిమా థియేటర్ సమీపంలో వెనుకనుంచి వచ్చిన మినీ లారీ వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో నాగరాజు ఎడమవైపునకు పడిపోగా అతడి భార్య సిప్రారాణి(28) కుడివైపు కింద పడింది. సిప్రారాణి తలపై నుంచి లారీ వెనుక టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన అము అక్కడికక్కడే మృతిచెందింది. ఎస్సై నాయుడు ఘటనస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment