కార్మికులకు కనీస పెన్షన్ రూ. వెయ్యి
కార్మికశాఖ ప్రతిపాదనకు ఆర్థికశాఖ ఆమోదం
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని కార్మికులకు నెలకు రూ. వెయ్యి కనీస పెన్షన్ ఇవ్వాలన్న కార్మికశాఖ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 44 లక్షల మంది పెన్షనర్లలో 5 లక్షల మంది వితంతువులు సహా 27 లక్షల మందికి తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద కనీస వేతన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు పెంచాలన్న ప్రతిపాదనకు కూడా ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది.