Minister Dinesh gundurav
-
...వారిపై క్రిమినల్ చర్యలు
- బీపీఎల్ కార్డులు అక్రమంగా కలిగి ఉన్నవారికి మంత్రి హెచ్చరిక - కార్డుల స్వాధీనానికి మరో రెండు నెలలు గడువు పెంపు - కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా బీపీఎల్ కార్డులు కలిగి ఉన్న వారు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని, అలా చేయని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ తెలిపారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో దినేష్ గుండూరావ్ మాట్లాడారు. అక్రమ బీపీఎల్ కార్డుదారులను తెలుసుకునేందుకు గాను ప్రత్యేక డ్రైవ్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. ఈ డ్రైవ్‌లో ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తం గా దాదాపు రెండువేల మంది అక్రమ బీపీఎల్ కార్డుదారులను అధికారులు గుర్తిస్తున్నారని పేర్కొన్నా రు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మరో రెండు నెలలు గడువు విధిస్తోం దని, ఈ గడువు పూర్తయ్యేలోగా వారంతట వారే బీపీఎల్ కార్డులను ప్రభుత్వానికి అందజేయాలని హెచ్చరించారు. ఇక కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కోసం అర్జీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ రేషన్ సరుకుల సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నామని తెలి పారు. ఇక ఇప్పటికే రాష్ట్రానికి అవసరమైన మోతాదులో ఆహార ధాన్యాలను కేంద్రం నుంచి కొనుగోలు చేసి ఉంచామని చెప్పారు. ఇంకా అవసరమైతే కేంద్ర ఆహార మండలి నుంచి మరిన్ని ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని దినేష్ గుండూరావ్ వెల్లడించారు. -
నిరాశతోనే అలా మాట్లాడుతున్నారు
- రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ బెంగళూరు: రాజకీయ అస్థిత్వాన్ని జేడీఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కోల్పోయిందని రాష్ట్ర ఆ హార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ విమర్శించారు. ఈ పరిణామంతో జేడీఎస్ పార్టీ నేత హెచ్.డి.కుమారస్వామి నిరాశలో కూరుకుపోయారని, అందుకే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దినేష్ గుండూరావ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేపాల్ భూకంప బాధితులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభిం చిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నభాగ్య పథకం రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలకు మూడు పూటలా భోజనం చేసే అదృష్టాన్ని కల్పించిందని అన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయలేదని, అందుకే ప్రజలు ఆయన్ను అధికారం నుంచి దించేశారని విమర్శించారు. ఇక కుమారస్వామి తనపై చేసిన వ్యాఖ్యలపై దినేష్ గుండూరావ్ స్పందిస్తూ....‘నేను అవినీతికి పాల్పడినట్లు, అందుకు సంబంధించిన ఆధారాలు ఆయన వద్ద ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా కుమారస్వామి చెబుతూనే ఉన్నారు. అయితే కుమారస్వామి ఎప్పుడూ ఆ ఆధారాలను బయటపెట్టలేదు. ఎందుకంటే అసలు నేను అవినీతి చేసి ఉంటే, అందుకు సంబంధించిన ఆధారాలు ఉండేది, వాటిని బయటపెట్టగలిగేది. ఇదంతా ప్రజలను మభ్యపెట్టేందుకు కుమారస్వామి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రమే’ అని పేర్కొన్నారు.