Minister harish ravu
-
4న దేవరుప్పులకు హరీశ్‌రావు రాక
► మంత్రి పర్యటనను విజయవంతం చేయూలి ► ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు దేవరుప్పుల : పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఈనెల 4వ తేదీన మంత్రి హరీశ్‌రావు దేవరుప్పులకు వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దయాకర్‌రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల నల్లకుంట చెరువులో తలపెట్టిన మిషన్ కాకతీయ చెరువు పనుల ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మండల టీఆర్ఎస్ నాయకులతో సమీక్ష జరిపారు. తాగు, సాగు నీరు అందించి పాలకుర్తిని సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలో భాగంగానే మంత్రి హరీశ్‌రావు పర్యటన ఖరారు అయినట్లు పేర్కొన్నారు. దేవరుప్పులకు వచ్చే దేవాదుల కాల్వ నీరును చెరువులు నింపేందుకు తూములు, వాగు పరివాహాక ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు కోసం చెక్‌డ్యామ్‌లు నిర్మాణాలకు నిధులు మంజూరు చేసేందుకు ఊరూరా పంచాయతీ తీర్మానాల ద్వారా వినతి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తానని, త్వరలో సమన్వయ కమిటీల నియమాకం చేపడుతానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఈదునూరి న ర్సింహరెడ్డి, మొలుగూరి రమేష్, బస్వ మల్లేశం, ఎంపీపీ సోమనర్సమ్మ, వైస్ ఎంపీపీ సోమయ్య, నాయకులు సాయిలు, మేకపోతుల ఆంజనేయులు, సోమనర్సయ్య, బిక్షపతి, జలంధర్‌రెడ్డి, వెంకన్న సర్పంచ్‌లు సునిత, హన్మంతు, భీముడు, భీమ్లా, వజ్రమ్మ, నర్సింహ్మరెడ్డి, సోమయ్య పాల్గొన్నారు. -
గోడౌన్లు వెంటనే నిర్మించాలి
మంత్రి హరీష్‌రావు కరీంనగర్ : మంజూరైన గోడౌన్లను వెంటనే నిర్మించాలని రాష్ర్ట భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.1,024 కోట్లతో 330 గోడౌన్లకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందన్నారు. మొదటి విడత మంజూరైన 128 గోడౌన్లను ఈనెలాఖరులోగా, రెండో విడతలోని 202 గోడౌన్లను జూలై నెలాఖరులోగా పూర్తి చేయూలని సూచించారు. స్థల సేకరణ సమస్య ఉన్న చోట వారంలోగా పరిష్కరించాలని, లేకుంటే ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ప్రధాని దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్న మార్కెట్ల అనుసంధానంలో రాష్ట్రానికి చెందిన 44 మార్కెట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఏకీకృత లెసైన్స్, ఆన్లైన్ మార్కెట్ సదుపాయంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. రెండో విడత మిషన్‌కాకతీయను విజయవంతం చేయూలని కోరారు. పారిశ్రామిక వేత్తలు, ప్రవాసభారతీయులను చెరువులు దత్తతకు ప్రోత్సహించాలని, డీఎస్పీలు కనీసం ఒక చెరువు దత్తత తీసుకోవాలన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జమ్మికుంట, సైదాపూర్ గోడౌన్ల పనులు త్వరలోనే చేపడతామన్నారు. ప్రాజెక్టుల భూసేకరణ సంది చర్చల ద్వార పూరి ్తచేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ జోయల్‌డేవిస్ మాట్లాడుతూ చెరువులను దత్తత తీసుకునే విషయం వారంలోగా కార్యాచరణ రూపొం దించి పంపిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అడిషనల్ ఎస్పీ అన్నపూర్ణ, ప్రత్యేక భూసేకరణ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.