మంత్రి గంటావి అనుచిత వ్యాఖ్యలు
మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘ అధ్యక్షురాలు నాగమణి
పాలకొండ : మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచిత వాఖ్యలు చేయడం తగదని మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘ జిల్లా అధ్యక్షురాలు కె.నాగమని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం పాలకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. భోజన పథకం మన రాష్ట్రంలోనే సక్రమంగా అమలవుతోందన్నారు. కనీస సదుపాలయాలు లేకపోయినా పథకం అమలు చేస్తున్నామన్న విషయాన్ని మంత్రి గంటా గుర్తించాలన్నారు.
కేవలం ప్రైవేటు వ్యక్తులకు నిర్వాహణ అప్పగించి, డబ్బులు దండుకోవడానికి మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆలోచనలు విరమించుకోక పోతే తీవ్రపరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీసం వంటగదులు లేకపోయినా పట్టించుకునేవారు లేరన్నారు. జిల్లాలో ఇప్పటికే రూ. 3 కోట్లు బిల్లులు బకాయిలు ఉన్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. సకాలంలో బిల్లులు రాకపోయినా, వసతులు లేకపోయినా, ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు. తమినాడులో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఇక్కడా కల్పించాలని డిమాండ చేశారు. అమెతో పాటు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.పద్మ, ఉపాధ్యక్షురాలు ఎ.మహాలక్ష్మి, నారాయణమ్మ ఉన్నారు.