కల్తీ మద్యం అమ్మితే పీడి యాక్ట్: జవహర్
అమరావతి: ఎక్సైజ్ శాఖా మంత్రిగా జవహర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మద్యం షాపుల ఏర్పాటుపై తొలి సంతకం చేశానని, ఎస్ఐ స్థాయి వరకు సిమ్ కార్డ్స్ ఇచ్చే ఫైల్ పై రెండో సంతకం చేశానని తెలిపారు. కల్తీ మద్యం అమ్మితే పీడి యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఎంఆర్పీ ధరలకు మించి అమ్మితే భారీగా జరిమాన విధిస్తామని పేర్కొన్నారు. డీ ఆడిక్షన్ సెంటర్స్ ను జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.