‘అధికారిక లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు’
నెల్లూరు(రెవెన్యూ): పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు తెలిపిన సమయం ప్రకారం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్టు ఏపీ సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మస్తాన్‌బాబు మృతదేహం ఈ నెల 20న స్వగ్రామమైన గాంధీజనసంగంకు తేనున్నట్టు అతని సోదరి డాక్టర్ దొరసానమ్మ శనివారం ఫేస్బుక్ ద్వారా తెలిపారు. సోమవారం ఖతార్ ఎయిర్‌లైన్స్ ద్వారా మస్తాన్‌బాబు మృతదేహాన్ని అర్జెంటీనాలోని బ్యూనస్ఎయిర్స్ నుంచి తేనున్నట్లు చెప్పారు.