Minister T. Harisravu
-
రైతులు కష్టపడాలని కోరుకుంటున్నారా?
కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ మండిపాటు ► రైతులకు సాయమందకుండా చేసేందుకే సంఘర్షణ సమితులు ► రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వం అందించనున్న ఎకరాకు రూ.8 వేల ఆర్థిక సాయం రైతులకు అందకుండా అడ్డుకునేందుకే కాంగ్రెస్ రైతు సంఘర్షణ సమితులను ఏర్పాటు చేస్తానంటోందని సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ‘టీఆర్ఎస్ పాలన రైతుల పాలిట శాపమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అంటున్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం తీసుకుంటున్న చర్యలు కాంగ్రెస్ పాలిట శాపమవుతున్నాయి’అని పేర్కొన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మండలి విప్ బోడకుంటి వేంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో హరీశ్ మాట్లాడారు. కాంగ్రెస్ నేతల మాటల్లో శాడిజం కనిపిస్తోందని, రైతులను ఆత్మన్యూనతలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. మిషన్ కాకతీయతో 5 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టించామని, కాంగ్రెస్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టులు తమ హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయని పేర్కొన్నారు. ‘ఉత్తమ్ గుండె మీద చేయి వేసుకుని మాట్లాడాలి. అబద్ధాలు ప్రచారం చేయొద్దు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతల పాలన. అప్పటి కరెంటు సరఫరాకు ఇప్పటి కరెంటు సరఫరాకు ఏమైనా పోలిక ఉందా? పంట దిగుబడిపై కూడా ఆయన అబద్ధాలు చెబుతున్నారు’అని హరీశ్ దుయ్యబట్టారు. అన్ని విషయాలను రైతులు గమనిస్తున్నారని, ఎవరు చెబుతున్నది నిజమో వారే తేలుస్తారని పేర్కొన్నారు. రూ.17 వేల కోట్లు విడుదల చేసి రుణ మాఫీ ప్రక్రియ పూర్తి చేయడం కాంగ్రెస్ నేతలకు కన్పించట్లేదా అని ప్రశ్నించారు. నీలం తుపాను వచ్చినప్పుడు తెలంగాణ జిల్లాలకు ఓ న్యాయం, ఆంధ్రా జిల్లాలకు ఓ న్యాయం అన్నట్లు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవర్తించారని, అప్పుడు మంత్రిగా ఉన్న ఉత్తమ్ ఈ అన్యాయంపై నోరుమెదిపారా అని ప్రశ్నించారు. అవినీతి అంతానికే.. అవినీతి అంతానికే భూరికార్డుల ప్రక్షాళన చేపడుతున్నామని, తమ పెత్తందారీ పోకడ లు పోతాయనే భయంతోనే కాంగ్రెస్ నేతలు దీన్ని అడ్డుకుంటున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. వారి వైఖరి ఇలానే ఉంటే ఇపుడున్న సీట్లు కూడా దక్కవని హెచ్చరించారు. రైతులు ఇంకా కాంగ్రెస్ పాలనను మర్చిపోలేదని, ఎరువులు, విత్తనాల కోసం వారు పడ్డ కష్టాలు గుర్తున్నాయన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో 2013–14 బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించింది రూ.4,040 కోట్లయితే, తెలంగాణ వాటా రూ.1,697కోట్లని,2017–18 బడ్జెట్లో వ్యవసాయానికి రూ.6,812 కోట్లు తమ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలన్న తేడా లేకుండా సీఎం నిధులు విడుదల చేస్తున్నారని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నియోజకవర్గ అభివృద్ధి నిధిగా రూ.3 కోట్లు ఇవ్వడంలో తామెలాంటి వివక్ష చూపట్లేదని స్పష్టం చేశారు. పెసర కొనుగోలుకు కేంద్రం అంగీకారం మంత్రి హరీశ్ చర్చలు సఫలం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెసర్ల కొను గోలుకు కేంద్రం అంగీకరించింది. రెండు రోజుల కిందట ఢిల్లీలో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. నాఫెడ్ తరఫున రాష్ట్ర మార్క్‌ఫెడ్ సంస్థ సోమవారం పెసర్ల కొనుగోలు ప్రారంభించనుంది. దీనిపై కేంద్ర మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం డైరెక్టర్ శశిభూషణ్, నాఫెడ్ ఎండీ సంజీవ్ కుమార్‌తో హరీశ్‌రావు శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని వారిని కోరారు. పెసర్లు క్వింటాలుకు రూ.5,575 మద్దతు ధరగా నిర్ణయించినట్టు శశిభూషణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయంలోని తన చాంబర్లో మార్కెటింగ్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో హరీశ్ సమీక్షించారు. 20 నుంచి 25 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. పెసర్లు ఎక్కువగా పండే ప్రాంతాలను గుర్తించి అక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
చెరువుల రక్షణే లక్ష్యం
- రూ.3 కోట్లతో పెద్దచెరువు అభివృద్ధి - పర్యాటక కేంద్రంగా మారుస్తాం - మంత్రి హరీశ్‌రావు వెల్లడి పటాన్చెరు: చెరువుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. చెరువుల రక్షణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా పటాన్చెరు మండలంలోని అమీన్పూర్ పెద్దచెరువు అభివృద్ధికి రూ.2 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బయోలాజికల్ హెరిటేజ్ సైట్‌గా దీన్ని మారుస్తామన్నారు. పెద్దచెరువును ఆదివారం మంత్రి సందర్శించారు. అమీన్పూర్ చెరువును దత్తత తీసుకుని, దాని అభివృద్ధికి కృషి చేస్తున్న ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, ఇతర అధికారులను ఆయన అభినందించారు. చెరువు వద్ద రెండు గంటలు గడిపిన హరీష్ మాట్లాడుతూ... చెరువులో కూకట్పల్లి మొదలుకుని ఇతర ఆవాస ప్రాంతాల నుంచి వస్తున్న మురుగు నీటి శుద్ధి కోసం ప్రత్యేక ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు మరో కోటి రూపాయల జీహెచ్ఎంసీ నిధులు వెచ్చిస్తామన్నారు. పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. చెరువు విశిష్టతను కాపాడుతూ, ఎఫ్టీఎల్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం చెరువు వద్ద మొక్క నాటారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జేసీ వెంకట్రామ్రెడ్డి, జిల్లా ఎస్పీ సుమతి, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, తహాశీల్దార్ ఫర్హీన్ షేక్, ఇరిగేషన్ శాఖా ఎస్ఈ సురేందర్, రాష్ట్ర పీసీబీ అధికారి అనిల్‌కుమార్ పాల్గొన్నారు. 41 రకాల సీతాకోకచిలుకలు అమీన్పూర్ పెద్ద చెరువు పరిసరాల్లో 171 పక్షిజాతులు జీవిస్తున్నాయని చెరువును దత్తత తీసుకున్న తేజ్‌దీప్‌కౌర్ మంత్రికి వివరించారు. ఇందులో విదేశీ వలస పక్షులు, 41 రకాల సీతాకోక చిలుక లు, 9 రకాల వన్యప్రాణులు, 250 రకాల అరుదైన, ఔషధ మొక్కలు ఉన్నాయన్నారు. చెరువులో కలుషితాల వల్ల మొత్తం జీవ వైవిధ్యానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. దీన్ని పరిర క్షించాలన్నారు. బ్లాస్టింగ్లు ఆపాలన్నారు. అక్రమ నీటి చౌర్యం, బోరు నీటి వ్యాపార క్షేత్రాలను స్థానిక రెవెన్యూ శాఖ నియంత్రించలేకపోతుందని తేజ్‌దీప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి, స్థానిక టీఆర్ఎస్ నేత గాలి అనిల్‌కుమార్ ఇంట్లో తేనీటీ విందుకు హరీష్ హాజరయ్యారు. -
చెరువుకట్టలను తీర్చిదిద్దాలి
- పర్యాటక కేంద్రాలుగా మార్చాలి - ‘హరితహారం’ను విజయవంతం చేయూలి - భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు - మంత్రులు రామన్న, పద్మారావుతో కలిసి పర్యటన నెక్కొండ/నల్లబెల్లి/చెన్నారావుపేట/దుగ్గొండి: మిషన్ కాకతీయ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు నిర్వహించిన చెరువు కట్టలపై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు కోరారు. చెరువు కట్టలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించా రు. మంత్రులు జోగు రామన్న, టి. పద్మారావుతో కలిసి మంగళవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. చెరువు కట్టలపై ఈత, తాటి, టేకు మొక్కులు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నెక్కొండలో హరీష్‌రావు మాట్లాడారు. గ్రామీణులకు జీవనాధారంగా చెరువులను మార్చి అభివృద్ధి చేయూల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బండ్‌కు ఇరువైపులా నాటే మొక్కలను గౌడ కులస్తులు, ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు సూచించారు. హరత తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కోరారు. నెక్కొండలోని తెలంగాణ బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థినులు హరితహారం ర్యాలీ నిర్వహించారు. మంత్రి హరీష్‌రావుకు సమస్యలు విన్నవించారు. గీత కార్మికుల బతుకులు బాగు పడాలె మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులు, చెరువు కట్టలపై ఈత, తాటి వనాల పెంపకంతో గీత కార్మికుల బతుకులు బాగుపడాలని మంత్రి హరీష్‌రావు ఆకాంక్షించారు. చెన్నారావుపేట మండలం వుగ్దుంపురం, గురిజాలలో పర్యటించారు. గురిజాలలో వుహిళలు బతుకవ్ము, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. ‘గురిజాల గ్రావూన్ని వురువలేం..పల్లెనిద్ర చేసింది గుర్తుంది..తప్పనిసరిగా వుుఖ్యవుంత్రి కేసీఆర్ వురల వస్తాడు.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిచేస్తాం’ అన్నారు. పింఛన్లు ఇప్పించాలంటూ మంత్రులకు పలువురు వృద్ధులు వినతిపత్రాలు అందించారు. దుగ్గొండిలో.. దుగ్గొండి మండలంలో మిషన్ కాకతీయలో భాగంగా 10 చెరువులను పునరుద్ధరించారు. ఈ చెరువు కరకట్టలపై స్థానిక గౌడ కులస్థులతో మంగళవారం మొక్కలు నాటిం చారు. వెంకటాపురం పెద్దచెరువు, దుగ్గొండి పెద్దచెరువుల వద్ద, తిమ్మంపేట గుండం చెరువు కట్టలపై మంత్రులు హరీష్‌రావు, పద్మారావు, జోగు రామన్న మొక్కలు నాటారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో 60 చెరువులపై ఒకేసారి లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి రామన్న అభినందించారు. జిల్లాలో ఇప్పటికే 1.17 కోట్ల మొక్కలు నాటడం పూర్తి అయిందన్నారు. మానుకోట ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, సీఎం పీఆర్వో గటిక విజయ్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపెల్లి రవీందర్రావు, ఆర్డీఓలు భాస్కర్‌రావు, రామకృష్ణారెడ్డి, డీఎస్పీ మురళీధర్‌రావు, నెక్కొండ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జెడ్పీటీసీ బక్కి కవిత, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్నభి,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు హంస విజయురావురాజు తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. పార ఎందుకు తెచ్చుకోలేదు? నల్లబెల్లి మండలం నారక్కపేట లచ్చిరెడ్డికుంట కట్టపై మొక్కలు నాటేందుకు పార లేకపోవడంతో అటవీశాఖ అధికారులపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సక్రమంగా లేవని అసహనం ప్రదర్శించారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మరావు, టీఆర్ఎస్ నర్సంపేట నియోజక వర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డిలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. చెరువు ఆయకట్టు, చెరువు శిఖం వివరాలను సర్పంచ్ మోర్తాల రామారావును మంత్రి అడిగి తెలుసుకొన్నారు. మొక్కలు నాటడం పూర్తయ్యేవరకు అటవీశాఖ అధికారులు ఇక్కడే ఉండి పర్యవేక్షించాలన్నారు. అంతకు ముందు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వరంగల్ సౌత్ డీఎఫ్ఓ కిష్టా, నర్సంపేట ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ సుధీర్, ఎంపీపీ బానోతు సారంగపాణి, తాహసీల్దార్ డీఎస్ వెంకన్న, ఎంపీడీఓ మూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.