అమెరికా మాల్ లో కత్తితో దాడి: 7మందికి గాయాలు
మిన్నెసోటా: అమెరికాలోని మిన్నెసోటా మాల్ లో దుండగుడు బీభత్సం సృష్టించాడు. షాపింగ్ కు వచ్చిన వారిపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనలో దాదాపు ఏడుగురికి కత్తి గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దాడి అనంతరం మాల్ ను మూసేసి.. ఆ ప్రాంతానికి తమ అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కాగా, దాడికి పాల్పడిన వ్యక్తికి ఉగ్రవాదసంస్ధతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.