minor children
-
ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ కోసం ఏ డాక్యుమెంట్లు అవసరం?
మీరు 5 ఏళ్ల లోపు చిన్న పిల్లల కోసం ఆధార్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, చిన్న పిల్లల ఆధార్ కోసం మీ దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆధార్ కేంద్రానికి ఒరిజినల్ పత్రాలను తీసుకెళ్లాలి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల బయోమెట్రిక్స్ క్యాప్చర్ అనే విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్(యుఐడీ) అనేది వారి తల్లిదండ్రుల యుఐడీతో లింక్ చేసిన డెమోగ్రాఫిక్ సమాచారం, పిల్లల ముఖ ఛాయాచిత్రం ఆధారంగా ప్రాసెస్ చేస్తారు. అయితే, ఈ మైనర్లకు 5 ఏళ్ల నుంచి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పది వేళ్లు, ఐరిస్, ఫోటోగ్రాఫ్ వంటి బయోమెట్రిక్ లను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కొరకు తల్లిదండ్రులు బిడ్డతో (5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు) ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ కోసం కింద పేర్కొన్న రెండు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. #AadhaarChildEnrolment To enroll your child for #Aadhaar, you only need the child's birth certificate or the discharge slip from the hospital and the Aadhaar of one of the parents. List of other documents that you can use for the child's enrolment: https://t.co/BeqUA07J2b pic.twitter.com/J1W3AYSVoP — Aadhaar (@UIDAI) July 27, 2021 పిల్లల జనన ధృవీకరణ పత్రం / ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ స్లిప్ / పిల్లల స్కూలు ఐడీ పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ -
వెట్టి చాకిరి కేసులో 17 ఏళ్ల జైలు
యాకుత్‌పురా: బాలలతో వెట్టి చాకిరి చేయించిన కేసులో బిహార్‌కు చెందిన నిందితుడికి 17 ఏళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాంపల్లిలోని 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డి.హేమంత్ కుమార్ బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. భవానీ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. బిహార్‌కు చెందిన షంషీర్ ఖాన్ (38) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి నషేమాన్‌నగర్ ఒవైసీ పాఠశాల ప్రాంతంలో గాజుల తయారీ కార్ఖానా నిర్వహిస్తున్నాడు. బిహార్‌కు చెందిన మైనర్ బాలలను నగరానికి తీసుకొచ్చి తన కార్ఖానా లో పనిచేయించాడు. 2016 జనవరి 2న అప్పటి భవానీ నగర్ ఎస్ఐ ప్రసాద్‌రావు, కార్మిక శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో గాజుల కార్ఖానాలో 11 మంది మైనర్ బాలలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అప్పటినుంచి కోర్టులో కొనసాగుతున్న కేసుపై ఈ మేరకు తీర్పు వెలువడింది. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు. -
ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో
సాక్షి, లక్నో: బిచ్చగాళ్ల రూపంలో పొంచి వున్న అరాచకవాదుల గురించి సినిమాల్లో చూశాం. కథల్లో విన్నాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం కథ కాదు. కఠోర వాస్తవం. గురువారం సాయంత్రం లక్నో, మున్షిపులియా ప్రాంతంలో విజయ్ బద్రి అలియాస్ బంగాలీ (55)ని అరెస్ట్ చేయడంతో బెగ్గర్ ర్యాకెట్ గుట్టు రట్టయింది. బిచ్చగాడుగా యాచకవృత్తి ముసుగులో తిరుగుతూ మైనర్లను హింసించి భయపెట్టి దొంగతనాలకు పాల్పడటం, ముఖ్యంగా మైనర్ అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం ఇతగాడి మోడస్ ఓపరాండీ. అయితే ఎంతటి నేరగాడికైనా పతనం తప్పదు. గట్టు రట్టు కాక తప్పదు కదా. విజయ్ కబంధ హస్తాలనుంచి తప్పించుకున్న బాధితులు (ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు) తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కారు. బారాబంకి వెళ్లే రైలులో బాద్షా నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) సిబ్బందిని ప్రశ్నించినప్పుడు.. తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటి సంద్రాలే అయ్యారు. తమ మాస్టర్ అసాంఘిక కార్యకలాపాల గుట్టు విప్పారు. 15,16,14 సంవత్సారాల పిల్లలతో రైల్వే ప్లాట్‌ఫాంలలో దొంగతనాలకు ఉసిగొల్పుతాడు..అంతేకాదు మత్తుమందు ఇచ్చి పిల్లల శరీరాలపై గాయం చేసి, ఆ రక్తాన్ని తన వికలాంగ కాలి బ్యాండేజిపై పూసుకొని సానుభూతి పొందేవాడు. పిల్లలు చోరీ చేసిన మొబైల్ ఫోన్లు, వాలెట్లు, ఇ-రిక్షా బ్యాటరీలు, ఇతర వస్తువులను అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. దీనికి ప్రతిగా పిల్లలకు దక్కేది మాత్రం. రోజుకి రూ.100, పేవ్మెంట్ల మీద నిద్ర. తప్పించుకునే ఉద్దేశంతో ఎలాగోలా రూ.70 దాచుకున్నామని బాధిత పిల్లలు చెప్పారు. గతంలో చాలాసార్లు పారిపోవడానికి ప్రయత్నించి, దొరికిపోయి దెబ్బలుతిన్నామని విలపించారు. తమతోపాటు మరో పది మంది అతని చెరలో ఉన్నట్టు చెప్పారు. వీరి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు అతగాడి ఆటకట్టించారు. విజయ్‌ని మున్షిపులియాలో అరెస్ట్ చేశామని కిడ్నాప్, పిల్లల అక్రమ రవాణా, దోపిడీ కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. దీని వెనక పెద్ద రాకెట్ ఉన్నట్టు అనుమానిస్తున్న అధికారులు, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరో ముగ్గురితో కలిసి ఈ రాకెట్టును నడుపుతున్నట్లు నిందితుడు విజయ్ ఒప్పుకున్నాడని పోలీసు అధికారులు ఎం.కె.ఖాన్, రాజ్దేవ్ మిశ్రా తెలిపారు. రక్షించిన నలుగురు బాధిత మైనర్లను లక్నోలోని చైల్డ్‌లైన్‌కు అప్పగించి, ఛైల్డ్ వెల్ఫేర్ కోర్టు ముందు హాజరుపరిచామని కమిటీ సభ్యులు సంగీత శర్మ చెప్పారు. వారి తల్లిదండ్రులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. బెంగాల్‌కు చెందిన విజయ్ బద్రి ఒక ప్రమాదంలో కాలు కోల్పోయాడు. అనంతరం బిక్షాటన ద్వారా పొట్ట పోసుకునేవాడు. క్రమంగా మురికివాడల్లోని పిల్లలే టార్గెట్‌గా పథకం వేశాడు. బట్టలు, బువ్వ, డబ్బు పేరుతో వారిని మభ్యపెట్టి తనవైపు తిప్పుకునేవాడు. అలా వారిని వ్యభిచారం, ఇతర నేరాలకు ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. -
ఏడుగురి హత్యకేసులో మరణశిక్ష రద్దు
సాక్ష్యాలు సరిగా లేవన్న హైకోర్టు ధర్మాసనం నిందితుడిని ఆశ్రమంలో ఉంచాలని ఆదేశం హైదరాబాద్: తన ఇద్దరు బిడ్డలతో పాటు భార్య హత్యకేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చిన ఐదుగురిని చంపిన కేసులో నిందితుడు, సీఆర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ శంకరరావును హైకోర్టు నిర్దోషిగా విడిచిపెట్టింది. అతడిని విశాఖపట్నంలోని ఓ ఆశ్రమంలో ఉంచాలని ఆదేశించింది. కీలక సాక్షుల సాక్ష్యాలను నమోదు చేయకపోవడం ఈ కేసును బలహీనపరిచిందని, అత్యంత హీనమైన నేరాల విషయంలో కూడా చాలాసార్లు ఇలాగే జరుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు శంకరరావుకు శ్రీకాకుళం జిల్లా సెషన్స్ కోర్టు 2012లో మరణశిక్ష విధించగా, అతడు హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ విచారణలో అనేక 'మిస్సింగ్ లింకులు' ఉన్నాయని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, జస్టిస్ ఎంఎస్కె జైస్వాల్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామమైన మెట్టపేటకు చెందిన శంకరరావు తన మైనర్ కొడుకు, కూతురు సహా మొత్తం ఏడుగురిని హతమార్చాడంటూ 2010 డిసెంబర్ 1న జలుమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు అప్పటికే తన భార్యను హత్యచేసిన కేసులో దోషిగా శిక్ష అనుభవించి, బెయిల్‌పై విడుదలయ్యాడని పేర్కొన్నారు. ఆ కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారన్న కోపంతోనే అతడు ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలతో పాటు తన ఇద్దరు పిల్లలను కూడా చంపేశాడని ప్రాసిక్యూషన్ వాదించింది. గ్రామంలో బాంబులు పేల్చి అరాచకం సృష్టించినట్లు కూడా తెలిపింది. అయితే.. ఈ కేసులో మృతుల సమీప బంధువులు, వారసుల నుంచి వాంగ్మూలాలు తీసుకోకపోవడం ప్రాసిక్యూషన్ వాదనలో పారదర్శకత లేని విషయాన్ని రుజువు చేస్తోందని ధర్మాసనం భావించింది. సాధారణంగా అయితే నిర్దోషిగా తేలిన తర్వాత వారిని స్వేచ్ఛగా విడిచిపెడతామని.. కానీ తన భార్యను, ఇద్దరు పిల్లలను కోల్పోయిన శంకరరావు మానసికంగా బాగా దెబ్బతిన్నాడని, అందువల్ల అతడిని ఏడాదిపాటు విశాఖపట్నంలోని రామకృష్ణ మఠంలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.