minor murder
-
పొలానికి వెళ్లిన చిన్నారిపై అఘాయిత్యం
ముజఫర్‌పూర్/పట్నా: బిహార్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. పశువులను మేపడానికి వ్యవసాయం పొలం వద్దకు వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురయింది. ఘటనా ప్రాంతంలోనే ఉన్న ఆమె తమ్ముడిని (7)సైతం దుండగుడు ప్రాణాలతో విడిచిపెట్టలేదు. ఈ ఘోరం ముజఫర్‌పూర్ జిల్లాలోని పారు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వ్యవసాయ పొలం వద్ద రెండు కుంటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం పశువులను మేపడానికి తమ్ముడిని తీసుకుని పొలం వద్దకు వెళ్లిన చిన్నారిపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. అడ్డుగా వచ్చిన ఆమె తమ్ముడిని, అనంతరం పాపను హత్యచేసి పక్కనే ఉన్న నది గట్టుపై పడేసి పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. చిన్నారుల తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన ముగ్గురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, కేసు నమోదు చేశామనీ, పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్ తెలిపారు. గత కొంత కాలంగా బిహార్‌లో అత్యాచార ఘటనలు తీవ్రమవుతున్నాయి. 2018 మొదటి మూడు నెలల్లో మహిళలు, బాలికలపై 127 అత్యాచార ఘటనలు చోటుచేసుకోగా, జూన్ నెల ముగిసేసరికి ఆ సంఖ్య రెట్టింపు అయిందని పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
జైలుకు పంపాడని 13 పోట్లు పొడిచాడు..
హైదరాబాద్: జైలుకు వెళ్లేందుకు కారణమయ్యాడంటూ ఓ బాలుడ్ని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యచేవారు. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్‌కు చెందిన జావేద్ (22)లు చైన్ స్నాచింగ్ తోపాటు ఇతర కేసుల్లో పట్టుబడి జైలుకు వెళ్లొచ్చారు. అతడికి జైలు శిక్ష పడేందుకు శాస్త్రిపురం ఓవైసీహిల్స్ ప్రాంతానికి చెందిన షాబాద్ (17) సాక్ష్యం ఉపకరించింది. నిజానికి షాబాద్ కూడా చిన్నపాటి నేరస్తుడే. గత నెలలో పోలీసులు నగరంలోని నేరగాళ్ల వివరాలు తెలుసుకునేందుకు సమగ్ర సర్వే చేపట్టారు. ఆసమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో షాబాద్.. జావేద్ దగ్గర ఆశ్రయం పొందాడు. ఎప్పటినుంచో షాబాద్ పై కక్ష పెట్టుకున్న జావెద్.. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇజముల్లా (19)తో కలిసి షాబాద్‌ను బైక్‌పై మీరాలం ట్యాంక్ వద్దకు తీసుకెళ్లారు. షాబాద్‌ను ఇజముల్లా పట్టుకోగా... జావేద్ కత్తితో గొంతుపై పొడిచాడు. జైలుకు పంపాడన్న పగతో షాబాద్ కడుపు, ఛాతీలపై 13 సార్లు పొడిచాడు. చనిపోయాడని నిర్దారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. నవంబర్ 29వ తేదీన ఉదయం అటుగా వచ్చిన వారు మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేయగా మృతుడి పూర్తి వివరాలు, హత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడు జావేద్‌పై హుస్సేనీఆలం, కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్‌లో స్నాచింగ్, తదితర కేసులున్నాయి. అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు పోలీసులు తెలిపారు.