దళిత బాలికపై అత్యాచారం
పంజాబ్లో ఆడపిల్లల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ధారివాల్ తిండ్ గ్రామంలో పదమూడేళ్ల దళిత బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తెను విక్కీ అనే వ్యక్తి ఈనెల 12వ తేదీన ఆమె చదువుతున్న పాఠశాల ఆవరణ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అతడు ఆమెను బటాలాలోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు బెదిరించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న అతడికోసం గాలిస్తున్నామని తెలిపారు.