Minorities Commission Chairman
-
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఇస్లాం ఖాన్
న్యూఢిల్లీ : తనపై నమోదైన దేశ ద్రోహ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీ మైనార్టీ కమిషన్ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ల్యాప్‌టాప్, ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవద్దని కోరారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, తనను బెదిరించి బయపెట్టాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే తాను ప్రభుత్వ ఉద్యోగిని అని, 72 సంవత్సరాల వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్ అనే కారణాలతో ఖాన్ ముందుస్తు బెయిల్ కోరారు. గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నట్లు అలాగే కోవిడ్-19 వచ్చే అవకాశం ఎక్కువ ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాని కేసు నుంచి తనకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఖాన్ తరఫు న్యాయవాదులు వ్రిందా గ్రోవర్, రత్న అప్పెండర్, సౌతిక్ బెనర్జీ పిటిషన్ దాఖలు చేశారు. (ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్‌పై దేశద్రోహం కేసు) కాగా ఏప్రిల్ 28న జఫారుల్ ఇస్లాం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై దోశ ద్రోహ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఖాన్ వ్యాఖ్యలు మత భవాలను రెచ్చగొట్టే విధంగా, సమాజానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని వసంత్ కంజ్ ప్రాంతానికి చెందిన నివాసితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జఫారుల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు సెక్షన్ 124 ఏ(దేశద్రోహం), సెక్షన్ 153ఏ (జాతి వివక్ష వ్యాఖ్యలు) కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కేసులు నమోదు చేసింది. (జులై 1 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు) -
ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్‌పై దేశద్రోహం కేసు
ఢిల్లీ : ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్‌పై గురువారం దేశదేహ్రం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీస్ విభాగం పేర్కొంది. రెండురోజుల క్రితం జఫారుల్ ఇస్లాం సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై సెక్షన్ 124 ఏ( దేశద్రోహం), సెక్షన్ 153 ఏ( జాతి వివక్ష వ్యాఖ్యలు) కింద కేసులు నమోదు చేసినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ నీరజ్ ఠాకూర్ తెలిపారు. వసంత్ కంజ్ ప్రాంతానికి చెందిన నివాసితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జఫారుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఏప్రిల్ 28న సోషల్ మీడియా వేదికగా (ట్విటర్, ఫేస్బుక్) మతాలను రెచ్చగొట్టేలా జఫారుల్ వ్యాఖ్యలు ఉన్నాయని, మత సామరస్యానికి విఘాతం కలిగించేలా, సమాజంలో చీలికను తెచ్చేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఖాన్ ఆరోపించిన మత వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దేశాన్నిమోసం చేసి పారిపోయిన నేరస్థుడి పేరు ఖాన్ తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. భారత అధికారుల అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ ఇప్పటికే ఆ నేరస్థుడి మీద రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. అంతేగాక అతనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ), మనీలాండరింగ్, టెర్రర్ సంబంధిత కేసుల కింద బుక్ చేసింది. అలాంటి వ్యక్తిని జఫారుల్ ప్రశంసించడం దేశద్రోహం కిందే లెక్కగడతారని ఫిర్యాదులో ఉంది. అయితే దీనిపై జఫారుల్ స్పందిస్తూ... తనపై ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్తలు అవాస్తవమన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైందని తన దృష్టికి వచ్చేంతవరకు ఈ విషయాన్ని నమ్మనన్నారు. అయితే గురువారం ట్విటర్ వేదికగా నెటిజన్లను క్షమాపణలు కోరారు. ' నేను చేసిన ట్వీట్ కొంతమందికి బాధ కలిగించింది. కానీ తన వ్యాఖ్యలతో ఏ ఒక్కరిని కించపరిచాలనే ఉద్దేశం నాకు లేదు. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి' అంటూ జఫారుల్ ఇస్లాం ఖాన్ ట్వీట్ చేశారు. -
కరోనా: ‘మర్కజ్, నిజాముద్దీన్ అని చెప్పొద్దు’
న్యూఢిల్లీ: తబ్లిగి జమాత్ ప్రార్థనలు భారత్‌లో కరోనా వ్యాప్తి ఉధృతికి కారణమై వేలాది మంది వైరస్ బారిన పడేలా చేశాయి. గత నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ఈ ప్రార్థనలు జరగ్గా.. మనదేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా హాజరయ్యారు. ఈనేపథ్యంలో ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ (డీఎంసీ) రాష్ట్ర ఆరోగ్యకు శాఖకు ఓ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ రోజూవారీ హెల్త్ బులెటిన్‌లో ‘నిజాముద్దీన్ మర్కజ్’ అని ప్రత్యేకంగా పేర్కొంటూ కేసుల వివరాలు ఇవ్వకూడదని విన్నవించింది. ఈమేరకు డీఎంసీ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. వైరస్ సోకినవారి వివరాలు ఇస్తున్న క్రమంలో తబ్లిగి జమాత్ లేదా మర్కజ్ నుంచి వచ్చినవారు ఇంతమంది.. అంటూ ప్రత్యేకంగా చూపెట్టడం ఒక మతాన్ని తక్కువ చేసినట్టేనని అన్నారు. కాగా, బుధవారం వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఢిల్లీలో 669 కేసులు నమోదవగా.. 426 కేసులు మర్కజ్‌కు చెందినవే. (చదవండి: క్వారంటైన్‌లోని తబ్లిగి జమాత్ సభ్యుల వికృత చర్య) ‘దురాలోచనతోనే ఇలాంటి వర్గీకరణ వార్తలతో మా మతంపై పలు మీడియా సంస్థలు, హిందుత్వ శక్తులు ద్వేషం పెంచుతున్నాయి. వాటి కారణంగా కొన్ని ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. ముస్లిం వ్యక్తులను సోషల్ బాయ్‌కాట్ చేస్తున్నారు. మొన్న ఈశాన్య ఢిల్లీలో ఓ యువకుడిని కొట్టి చంపారు. ఇప్పటికైనా నిజాముద్దీన్ మర్కజ్ పేరును వార్తలు, బులెటిన్లలో పేర్కొనవద్దు’ అని ఇస్లాం ఖాన్ ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక వర్గం, మతం ఆధారంగా కరోనా కేసులు వివరాలు ప్రకటించొద్దని చెప్పింది. వైరస్‌కు గురికావడమనేది ఎవరి తప్పిదం కాదని, బాధితుల వివరాలు వార్తల్లో ప్రచురించొద్దని కేంద్ర హోంశాఖ కూడా చెప్పింది’అని ఆయన తెలిపారు. (చదవండి: వలస కార్మికులను తరలించండి) -
మహిళలు దర్గాలకే వెళ్లి ప్రార్థించాలా?
హైదరాబాద్: ఎక్కడ మహిమ పరిచినా భగవంతుడికి తెలిసిపోతుంది కాబట్టి మహిళలు ప్రత్యేకంగా మసీదులు, దర్గాలకు వెళ్లి ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదని ఉమ్మడి రాష్ట్రాల మైనారిటీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ అన్నారు. ఆథ్యాత్మిక కేంద్రాల సందర్శనలో మహిళలు వినయ విధేయతలతో మెలగాలని సూచించారు. హజీ అలీ దర్గాలోకి మహిళలను అనుమతించాలన్న బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రసూల్ ఖాన్ ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు మసీదుల్లోకానీ, బహిరంగ ప్రదేశాల్లోకానీ ప్రార్థనలు చేయడాన్ని ఇస్లాం ప్రోత్సహించదని, ఆ విషయంలో నిషేధం సమర్థనీయం కాదని రసూల్ ఖాన్ అన్నారు. దర్గాలకు వెళ్లాలా, వద్దా అన్నది వ్యక్తిగత అభిప్రాయమని, అయితే అంతిమతీర్పు(జడ్జిమెంట్ డే) రోజులన ఎవరికివారే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని అన్నారు.'నా పాయింట్ ఏమంటే..మహిళలు దర్గాలకు వెళ్లేకాదు, ఇంట్లోనూ ప్రార్థన చేసుకోవచ్చు. వాటిని దేవుడు వింటాడు. ప్రత్యేక ప్రదేశాల్లో ప్రార్థిస్తేనే అవి దేవుడికి చేరినట్లుకాదు' అని రసూల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే, మారుతున్న కాలాన్ని బట్టి ఇస్లాం సంప్రదాయాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నదని, ఇప్పుడు మహిళలు సైతం మసీదులకు వెళుతున్నారని రసూల్ ఖాన్ గుర్తుచేశారు. హైదరాబాద్ సహా సౌదీ అరేబియాలోని చాలా మసీదుల్లో మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని తెలిపారు.