ఎంసెట్లో ‘నిమిషం’ నిబంధన దారుణం: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకపోవడం అమానవీయమని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులు కారణంగా పరీక్షా కేంద్రానికి కాస్త ఆలస్యంగా వస్తున్నారని, ఈ నేపథ్యంలో నిమిషం ఆలస్యమైతే పరీక్షకు అనుమతించకపోవడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. నిమిషం నిబంధన వల్ల వేలాది మంది విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారన్నారు.
కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ఆలస్యంగా వస్తున్నవారిని అనుమతిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎంసెట్ విషయంలో నిబంధనలను సడలించాలని ప్రభుత్వాన్ని కోరారు.