మిరప నారుకు డిమాండ్
బొమ్మనహాళ్: హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలో మిరపనారుకు డిమాండ్ పెరిగింది. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్, దేవగిరి, ఉంతకల్లు, కర్ణాటక బెంచికొట్టాల వద్ద ఎర్రనేలలతో పాటు నీరు సమృద్ధిగా ఉండటంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు రైతులు బ్యాడిగి, గంగావతి, రాయచూరు ప్రాంతాల నుంచి నాణ్యమైన మిరప విత్తనాలను సేకరించి నారు పెంచుతున్నారు.ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదల సమయం దగ్గరపడడంతో చాలా మంది మిరపనారు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా హెచ్చెల్సీకి నీరు విడుదలకు మందుగా 45 రోజుల మిరప పైరును సిద్ధం చేసుకున్నారు.