మిర్యాలగూడ డిపో వద్ద ఉద్రిక్తత
మిర్యాలగూడ: రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షాలు చేస్తున్నబంద్ లో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బస్సు డిపో ఎదుట సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకులు బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డు తొలగించడానికి ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.