శ్రీలంక అందాల పోటీల్లో జడ్జీగా రష్మీ ఠాకూర్
జ్యోతినగర్ : శ్రీలంక దేశంలో నిర్వహించిన మిస్ శ్రీలంక 2017 అందాల పోటీల్లో జడ్జీగా ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్కు చెందిన మిస్ ప్లానెట్ ఇండియా 2016 విజేత రష్మీఠాకూర్ వ్యవహరించారు. ఈనెల 15నుంచి 18వరకు శ్రీలంకలో జరిగిన సీయోన్ మెజాస్టిక్ పైజాంట్ పోటీలకు రష్మీఠాకూర్ను న్యాయనిర్ణేతగా ఆహ్వానించారు. విజేతలుగా ఎంపికైన అందాల తారలకు ఆమె బహుమతులను అందించారు.