Missing girls
-
National Crime Records Bureau: మూడేళ్లలో..13.13 లక్షల మంది మహిళలు మిస్సింగ్
న్యూఢిల్లీ: దేశంలో 2019–21 సంవత్సరాల మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండాపోయారని కేంద్రం తెలిపింది. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి అత్యధికంగా సుమారు 2 లక్షల మంది ఉన్నారని, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉందని పేర్కొంది. గత వారం పార్లమెంట్లో కేంద్ర హోం శాఖ ఇందుకు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నమోదు చేసిన గణాంకాలను వెల్లడించింది. మూడేళ్ల కాలంలో మిస్సయిన మొత్తం 13.13 లక్షల మందిలో బాలికలు 2,51,430 మంది కాగా, 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 10,61,648 అని వివరించింది. 2019–2021 మధ్య మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1,60,180 మహిళలు, 38,234 మంది బాలికలు అదృశ్యమయినట్లు ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న పశ్చిమబెంగాల్లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు మిస్సయ్యారని తెలిపింది. ఇదే సమయంలో మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు.. ఒడిశాలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు..ఛత్తీస్‌గఢ్‌లో 49,116 మంది మహిళలు, 10,817 మంది బాలికలు కనిపించకుండాపోయారు. 2019–21 మధ్య ఢిల్లీలో 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు కనిపించకుండాపోయారు. -
విశాఖలో అదృశ్యంమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు క్షేమం
-
బాలికల ఆచూకీ లభ్యం
సాక్షి, చింతలపూడి (పశ్చిమ గోదావరి): చింతలపూడి పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. హైదరాబాద్‌లో బాలికలను గుర్తించినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎన్.స్నేహిత తెలిపారు. గురువారం చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామం వెళ్లి డీఎస్పీ స్నేహిత బాలికలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాఘవాపురం గ్రామానికి చెందిన పగడాల ఐశ్వర్య, ఉమ్మడి దివ్య, ఉమ్మడి చిట్టి కలిసి బుధవారం ఉదయం స్కూల్‌కి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. సాయంత్రం స్కూల్ నుంచి ఇళ్లకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ పి.రాజేష్, ఎస్సై వి.క్రాంతికుమార్ల నేతృత్వంలో ఐదు బృందాలను ఏర్పాటు చేసి బాలికల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సత్తుపల్లిలోని సీసీ కెమెరాలను పరిశీలించినట్లు చెప్పారు. సత్తుపల్లితో పాటు ఖమ్మం, హైదరాబాద్ పోలీసులకు బాలికల ఫొటోలు అప్రమత్తం చేసినట్లు తెలిపారు. చివరికి హైదరాబాద్ ఎల్బీనగర్లో బాలికలను చూసిన ఒక వ్యక్తి సమాచారం అందించడంతో బాలికలను చింతలపూడి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. కేసును 12 గంటల్లో చాకచక్యంగా పరిష్కరించిన చింతలపూడి పోలీసులను డీఎస్పీ అభినందించారు. పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. -
వీరంతా ఏమైపోయారు?
గత పదేళ్లలో అదృశ్యమైపోయిన 32 వేల మంది ఇందులో బాలికలు, యువతులు, మహిళలే 18,170 మంది మూడేళ్లలో సగటున రోజుకు 8 మంది అమ్మాయిల మిస్సింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి చెందిన అవంతిక(పేర్లు మార్చాం) ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఆమెకు కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. ఏడాది పాటు ప్రేమ వ్యవహారం నడిపింది. పెళ్లి చేసుకుందా మని కుమార్ చెప్పడంతో అవంతిక ఇంట్లో పెద్దలకు చెప్పకుండా అతడితో విజయవాడ వెళ్లింది. ఆమెతో రెండు రోజుల పాటు గడిపిన కుమార్.. హైదరాబాద్ వెళ్లి డబ్బులు తీసుకువ స్తానని, అప్పటిదాకా ఏలూరుకు చెందిన సత్యం అనే తన స్నేహితుడు చూసుకుంటాడని చెప్పి వెళ్లాడు. కుమార్ వెళ్లిపోయాక అసలు విషయం బయటపడింది. తనను రూ.2 లక్షలకు అమ్మేశాడని అవంతికకు తెలిసింది. కానీ ఎలా బయటపడాలో తెలియదు. అవంతి క అదృశ్యంపై తల్లిదండ్రులు హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్‌ను అరెస్టు చేసి విచారించగా.. ఏలూరుకు చెందిన ఓ కిలాడీ గ్యాంగ్ ప్రేమ పేరుతో మైనర్లను, యువతులను వ్యభిచారం లోకి దింపుతున్నట్లు బయటపడింది. యువతులు, మహిళల అదృశ్యం కేసుల్లో ఇలాంటి మిస్టరీ ఏదో ఒకటి ఉండి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 32,794 మంది అదృశ్యం రాష్ట్రంలో 2007 జనవరి 1 నుంచి 2017 జనవరి 26 మధ్య 32,794 మంది అదృశ్య మయ్యారని పోలీసు లెక్కలు స్పష్టం చేస్తున్నా యి. అత్యధికంగా 18,170 మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులే ఉండడం ఆందోళనకరం. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి పరిశీలిస్తే.. 40 ఏళ్లలోపు వయసున్న 9,800 మంది మహిళ లు, 6,921 మంది పురుషులు కనిపించకుండా పోయారు. బాలికలు, యువతులు, మహిళల్లో చాలా వరకు అక్రమ రవాణా బారిన పడుతు న్నారనే అంచనాలున్నాయి. పురుషుల్లో అధిక శాతం యువత ఇంట్లో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటనలు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. మైనర్ల వ్యవహారంలో మాత్రం మాఫియా గ్యాంగులు, బెగ్గింగ్ ముఠాల హస్తం ఉందంటున్నారు. బిహార్, మహారాష్ట్ర, కోల్‌కతా, ఒడిశాలకు చెందిన ముఠాలు మైనర్లను కిడ్నాప్ చేయడం లేదా వారికి చిన్న చిన్న ఆశలు చూపి కార్మికులుగా వెట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతోందని చెబుతున్నారు. రోజూ సగటున 8 మంది! గత పదేళ్లలో తెలంగాణ జిల్లాల్లో కలిపి 32,794 మంది అదృశ్యమయ్యారు. సగటున రోజుకు 7 నుంచి 8 మంది జాడ తెలియకుండా పోతోందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. అదే గత మూడేళ్లలో అదృశ్యౖ మెన అమ్మాయిల సంఖ్యను పరిశీలిస్తే రోజూ 8 నుంచి 9 మంది అదృశ్యమవుతున్నారు. ఏటా అదృశ్యం కేసులు పెరిగిపోతూనే ఉన్నాయని పేర్కొంటున్నారు. అసలు బతికే ఉన్నారా? అమ్మాయిలు, మహిళలు కనిపించ కుండా పోతుండడంతో బాధిత కుటుంబా లు శోక సంద్రంలో మునిగిపోతున్నా యి. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయ డం తప్ప.. త్వరితగతిన దర్యాప్తు చేయకపో వడం, తగిన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందనే విమర్శలు న్నా యి. తమ కుమార్తె/కుమారుడు బతికు న్నారో లేదో కూడా తెలియని దుస్థితిలో కొన్ని కుటుంబాలు ఆందోళన చెందుతు న్నాయి. కేసుల విచారణలో పని ఒత్తిడి, సిబ్బంది కొరత కారణంగా మిస్సింగ్ కేసుల దర్యాప్తులో జాప్యానికి కారణమవుతోందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఇంటికి చేరిన బాలికలు
తిరుపతి క్రైం: తిరుపతిలోని ఓ హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థినులు ఇద్దరూ సోమవారం తమ గ్రామం చేరుకున్నారు. ఒకరిని విజయవాడ నుంచి పోలీసులు తీసుకురాగా, మరో బాలిక తానే ఒంటరిగా స్వగ్రామం చేరుకుంది. చదువుపై ఇష్టం లేకే.. ఏర్పేడు మండలం కోబాకకు చెందిన విద్యార్థినులు తిరుపతిలోని ఓ హాస్టల్లో ఉంటూ పదోతరగతి చదువుతున్నారు. వారిద్దరూ ఈనెల 24న స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో వీరు వరంగల్‌లో కీచకుల బారినపడినట్టు ప్రచారం జరిగింది. బాలికల అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న తిరుపతి అలిపిరి ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఓ బాలిక విజయవాడలో ఉన్న సమాచారం తెలుసుకుని సోమవారం ఆమెను తీసుకువచ్చారు. అలాగే వరంగల్‌లో అదృశ్యమైన బాలిక కూడా ఒంటరిగా సోమవారం స్వగ్రామం చేరుకుంది. వీరిద్దరినీ పోలీసులు విచారించగా.. బాలికలకు చదువుపై ఆసక్తి లేదని, దీంతో కరీంనగర్లో ఉన్న స్నేహితురాలి వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతో రైలులో వరంగల్ వెళ్లినట్లు తెలిసింది. రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక ప్లాట్‌ఫాంపై ఉండగా అక్కడ దుకాణంలో పనిచేసే ఒక వ్యక్తి బాలికలకు భోజనం పెడతానని చెప్పి తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలోకి మరో ఇద్దరు యువకులు వచ్చి అనుమానాస్పదంగా మాట్లాడుకోవడంతో అప్రమత్తమైన ఒక బాలిక పరారై విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకుంది. అక్కడ చైల్డ్‌లైన్ సంస్థ సభ్యులు బాలికను గుర్తించి విషయం తెలుసుకున్నారు. అనంతరం ఆ సంస్థ వారు వరంగల్‌కు వెళ్లి బాలికలు తలదాచుకున్న గదికి వెళ్లి చూడగా మరో విద్యార్థిని కనిపించకపోవడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఓ బాలికను విజయవాడ నుంచి పోలీసులు తీసుకురాగా, మరో బాలిక ఒంటరిగా స్వగ్రామం చేరుకుంది.