వీరంతా ఏమైపోయారు? | 32 thousand people missing in Last ten years | Sakshi
Sakshi News home page

వీరంతా ఏమైపోయారు?

Published Fri, Jan 27 2017 3:30 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

32 thousand people missing in Last ten years

గత పదేళ్లలో అదృశ్యమైపోయిన 32 వేల మంది
ఇందులో బాలికలు, యువతులు, మహిళలే 18,170 మంది
మూడేళ్లలో సగటున రోజుకు 8 మంది అమ్మాయిల మిస్సింగ్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానికి చెందిన అవంతిక(పేర్లు మార్చాం) ఓ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. ఆమెకు కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. ఏడాది పాటు ప్రేమ వ్యవహారం నడిపింది. పెళ్లి చేసుకుందా మని కుమార్‌ చెప్పడంతో అవంతిక ఇంట్లో పెద్దలకు చెప్పకుండా అతడితో విజయవాడ వెళ్లింది. ఆమెతో రెండు రోజుల పాటు గడిపిన కుమార్‌.. హైదరాబాద్‌ వెళ్లి డబ్బులు తీసుకువ స్తానని, అప్పటిదాకా ఏలూరుకు చెందిన సత్యం అనే తన స్నేహితుడు చూసుకుంటాడని చెప్పి వెళ్లాడు. కుమార్‌ వెళ్లిపోయాక అసలు విషయం బయటపడింది. తనను రూ.2 లక్షలకు అమ్మేశాడని అవంతికకు తెలిసింది. కానీ ఎలా బయటపడాలో తెలియదు. అవంతి క అదృశ్యంపై తల్లిదండ్రులు హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్‌ను అరెస్టు చేసి విచారించగా.. ఏలూరుకు చెందిన ఓ కిలాడీ గ్యాంగ్‌ ప్రేమ పేరుతో మైనర్లను, యువతులను వ్యభిచారం లోకి దింపుతున్నట్లు బయటపడింది. యువతులు, మహిళల అదృశ్యం కేసుల్లో ఇలాంటి మిస్టరీ ఏదో ఒకటి ఉండి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

32,794 మంది అదృశ్యం
రాష్ట్రంలో 2007 జనవరి 1 నుంచి 2017 జనవరి 26 మధ్య 32,794 మంది అదృశ్య మయ్యారని పోలీసు లెక్కలు స్పష్టం చేస్తున్నా యి. అత్యధికంగా 18,170 మంది అమ్మాయిల మిస్సింగ్‌ కేసులే ఉండడం ఆందోళనకరం. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి పరిశీలిస్తే.. 40 ఏళ్లలోపు వయసున్న 9,800 మంది మహిళ లు, 6,921 మంది పురుషులు కనిపించకుండా పోయారు. బాలికలు, యువతులు, మహిళల్లో చాలా వరకు అక్రమ రవాణా బారిన పడుతు న్నారనే అంచనాలున్నాయి. పురుషుల్లో అధిక శాతం యువత ఇంట్లో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటనలు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. మైనర్ల వ్యవహారంలో మాత్రం మాఫియా గ్యాంగులు, బెగ్గింగ్‌ ముఠాల హస్తం ఉందంటున్నారు. బిహార్, మహారాష్ట్ర, కోల్‌కతా, ఒడిశాలకు చెందిన ముఠాలు మైనర్లను కిడ్నాప్‌ చేయడం లేదా వారికి చిన్న చిన్న ఆశలు చూపి కార్మికులుగా వెట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతోందని చెబుతున్నారు.

రోజూ సగటున 8 మంది!
గత పదేళ్లలో తెలంగాణ జిల్లాల్లో కలిపి 32,794 మంది అదృశ్యమయ్యారు. సగటున రోజుకు 7 నుంచి 8 మంది జాడ తెలియకుండా పోతోందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. అదే గత మూడేళ్లలో అదృశ్యౖ మెన అమ్మాయిల సంఖ్యను పరిశీలిస్తే రోజూ 8 నుంచి 9 మంది అదృశ్యమవుతున్నారు. ఏటా అదృశ్యం కేసులు పెరిగిపోతూనే ఉన్నాయని పేర్కొంటున్నారు.

అసలు బతికే ఉన్నారా?
అమ్మాయిలు, మహిళలు కనిపించ కుండా పోతుండడంతో బాధిత కుటుంబా లు శోక సంద్రంలో మునిగిపోతున్నా యి. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేయ డం తప్ప.. త్వరితగతిన దర్యాప్తు చేయకపో వడం, తగిన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందనే విమర్శలు న్నా యి. తమ కుమార్తె/కుమారుడు బతికు న్నారో లేదో కూడా తెలియని దుస్థితిలో కొన్ని కుటుంబాలు ఆందోళన చెందుతు న్నాయి. కేసుల విచారణలో పని ఒత్తిడి, సిబ్బంది కొరత కారణంగా మిస్సింగ్‌ కేసుల దర్యాప్తులో జాప్యానికి కారణమవుతోందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement