Khiladi Gang
-
‘కిలాడి కపుల్’.. పెళ్లి పేరుతో 35 మందికి ట్రాప్.. కోటికిపైగా వసూల్!
లక్నో: మ్యారేజ్ బ్యూరోల్లో నకిలీ వివరాలతో మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వెలుగుచూసింది. నకిలీ మ్యాట్రిమోనియల్ ప్రోఫైల్స్ ద్వారా ఓ కిలాడి జంట ఏకంగా 35 మందిని మోసం చేసింది. వారికి సుమారు రూ.1.6 కోట్లకు టోకరా వేశారు దంపతులు. నకిలీ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న జంటను సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన మహిళ, జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు కలిసి ఇప్పటి వరకు 35 మందిని మోసగించారు. వారి నుంచి సుమారు రూ.1,63,83,000లు దోచుకున్నారు. ‘వివాహం పేరుతో తన కూతురి వద్ద రూ.27 లక్షలు తీసుకున్నారని ఓ సైనికాధికారి మొరాదాబాద్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ సెల్ టీంతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దర్యాప్తు చేపట్టిన టీం ఇద్దరిని అరెస్ట్ చేసింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టాం. గత ఏడాదిన్నరగా సుమారు 35 మందిని మోసగించినట్లు తేలింది. అందమైన ఫోటోలతో మ్యాట్రిమేనియల్ సైట్స్‌లో ఆకర్షించేలా ప్రోఫైల్స్ పెడతారు. ఎవరైనా వారి కాంటాక్ట్‌లోకి వస్తే వారిని మాటల్లో పెట్టి మచ్చిక చేసుకుంటారు. ఆ తర్వాత వివిధ కారణాలతో డబ్బులు అడుగుతారు. అరెస్ట్ చేసిన వారు జార్ఖండ్‌కు చెందిన బబ్లూ కుమార్, బిహార్‌కు చెందిన పూజా కూమారిగా గుర్తించాం. ఇరువురికి వివాహం జరిగింది ’ అని వివరాలు వెల్లడించారు డీఎస్పీ అనూప్ కుమార్. ఇదీ చదవండి: Squid Game: ఒకేసారి 1415 మంది విద్యార్థుల ఆట.. వీరికి రికార్డులు కొత్తేం కాదు.. -
వామ్మో.. మహా ముదుర్లు!
► జిల్లాలో సంచలనం ► సృష్టిస్తున్న కిలాడీ ముఠా ► ఆర్థికశాఖ మంత్రి బంధువులమని ► రాజధానిలో పనులు ఇప్పిస్తామని మాయమాటలు ► ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టించిన వైనం ► పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు కడప అర్బన్ : సార్.. ఆర్థిక శాఖ మంత్రికి మేము దగ్గరి బంధువులం.. మీకు రాజధాని ప్రాంతంలో పనులు ఇప్పిస్తాం.. అంటూ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కిలాడీ ముఠా ఉదంతమిది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన ఈ ముఠా జిల్లాలోని పలువురు ప్రముఖ నేతలను సైతం బురిడీ కొట్టించింది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాలాజీ, మిర్యాలగూడకు చెందిన రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు తాము ఆర్థిక శాఖ మంత్రి సమీప బంధువులమని జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులను కలిసి పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో ఏ పని కావాలన్నా తాము ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పిస్తామని నమ్మబలుకుతారు. వీరి వేషధారణ.. మాట తీరును చూసి ఇక ఏమాత్రం అనుమానించకుండా వెంటనే వారి మాయలో పడిపోతారు. ఇలా జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద రూ.2 లక్షలు, అధికార పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధుల వద్ద రూ.5లక్షలు, రూ.2లక్షలు చొప్పున తమ అకౌంట్లలో జమ చేయించుకున్నారు. వీరు తమకు అనుకూలమైన మహిళల అకౌంట్లలో ఈ మొత్తాన్ని జమ చేయించుకుని ఆ తర్వాత జల్సా చేసుకుంటారు. వీరి చేతిలో మోసపోయిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన వద్ద రూ.5లక్షలు తీసుకున్నారని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేయడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ మొత్తాన్ని తమ అకౌంట్లలో జమ చేయించుకున్న మహిళల ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. -
వీరంతా ఏమైపోయారు?
గత పదేళ్లలో అదృశ్యమైపోయిన 32 వేల మంది ఇందులో బాలికలు, యువతులు, మహిళలే 18,170 మంది మూడేళ్లలో సగటున రోజుకు 8 మంది అమ్మాయిల మిస్సింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి చెందిన అవంతిక(పేర్లు మార్చాం) ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఆమెకు కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. ఏడాది పాటు ప్రేమ వ్యవహారం నడిపింది. పెళ్లి చేసుకుందా మని కుమార్ చెప్పడంతో అవంతిక ఇంట్లో పెద్దలకు చెప్పకుండా అతడితో విజయవాడ వెళ్లింది. ఆమెతో రెండు రోజుల పాటు గడిపిన కుమార్.. హైదరాబాద్ వెళ్లి డబ్బులు తీసుకువ స్తానని, అప్పటిదాకా ఏలూరుకు చెందిన సత్యం అనే తన స్నేహితుడు చూసుకుంటాడని చెప్పి వెళ్లాడు. కుమార్ వెళ్లిపోయాక అసలు విషయం బయటపడింది. తనను రూ.2 లక్షలకు అమ్మేశాడని అవంతికకు తెలిసింది. కానీ ఎలా బయటపడాలో తెలియదు. అవంతి క అదృశ్యంపై తల్లిదండ్రులు హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్‌ను అరెస్టు చేసి విచారించగా.. ఏలూరుకు చెందిన ఓ కిలాడీ గ్యాంగ్ ప్రేమ పేరుతో మైనర్లను, యువతులను వ్యభిచారం లోకి దింపుతున్నట్లు బయటపడింది. యువతులు, మహిళల అదృశ్యం కేసుల్లో ఇలాంటి మిస్టరీ ఏదో ఒకటి ఉండి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 32,794 మంది అదృశ్యం రాష్ట్రంలో 2007 జనవరి 1 నుంచి 2017 జనవరి 26 మధ్య 32,794 మంది అదృశ్య మయ్యారని పోలీసు లెక్కలు స్పష్టం చేస్తున్నా యి. అత్యధికంగా 18,170 మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులే ఉండడం ఆందోళనకరం. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి పరిశీలిస్తే.. 40 ఏళ్లలోపు వయసున్న 9,800 మంది మహిళ లు, 6,921 మంది పురుషులు కనిపించకుండా పోయారు. బాలికలు, యువతులు, మహిళల్లో చాలా వరకు అక్రమ రవాణా బారిన పడుతు న్నారనే అంచనాలున్నాయి. పురుషుల్లో అధిక శాతం యువత ఇంట్లో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటనలు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. మైనర్ల వ్యవహారంలో మాత్రం మాఫియా గ్యాంగులు, బెగ్గింగ్ ముఠాల హస్తం ఉందంటున్నారు. బిహార్, మహారాష్ట్ర, కోల్‌కతా, ఒడిశాలకు చెందిన ముఠాలు మైనర్లను కిడ్నాప్ చేయడం లేదా వారికి చిన్న చిన్న ఆశలు చూపి కార్మికులుగా వెట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతోందని చెబుతున్నారు. రోజూ సగటున 8 మంది! గత పదేళ్లలో తెలంగాణ జిల్లాల్లో కలిపి 32,794 మంది అదృశ్యమయ్యారు. సగటున రోజుకు 7 నుంచి 8 మంది జాడ తెలియకుండా పోతోందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. అదే గత మూడేళ్లలో అదృశ్యౖ మెన అమ్మాయిల సంఖ్యను పరిశీలిస్తే రోజూ 8 నుంచి 9 మంది అదృశ్యమవుతున్నారు. ఏటా అదృశ్యం కేసులు పెరిగిపోతూనే ఉన్నాయని పేర్కొంటున్నారు. అసలు బతికే ఉన్నారా? అమ్మాయిలు, మహిళలు కనిపించ కుండా పోతుండడంతో బాధిత కుటుంబా లు శోక సంద్రంలో మునిగిపోతున్నా యి. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయ డం తప్ప.. త్వరితగతిన దర్యాప్తు చేయకపో వడం, తగిన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందనే విమర్శలు న్నా యి. తమ కుమార్తె/కుమారుడు బతికు న్నారో లేదో కూడా తెలియని దుస్థితిలో కొన్ని కుటుంబాలు ఆందోళన చెందుతు న్నాయి. కేసుల విచారణలో పని ఒత్తిడి, సిబ్బంది కొరత కారణంగా మిస్సింగ్ కేసుల దర్యాప్తులో జాప్యానికి కారణమవుతోందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.