missing Indians
-
సుష్మా స్వరాజ్ నీకు ఇది తగునా.?
న్యూఢిల్లీ : ట్విట్టర్లో ప్రశ్నించినంత మాత్రాన అకౌంట్‌ను బ్లాక్ చేయడం తగునా.. అని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా నిలదీశారు. ఇందుకు సంబంధించిన స్ర్కీన్ షాట్లను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విదేశాంగ మంత్రి తనని బ్లాక్ చేయడం ద్వారా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఏదైనా అంశం గురించి అడిగితే ఒక పార్లమెంటు సభ్యుని ఖాతాను బ్లాక్‌చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ఒక మంత్రి వ్యవహరించే తీరు.. అని సుష్మా స్వరాజ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014లో ఇరాక్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయుల విషయంలో ఈ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్దం నడిచిన విషయం తెలిసిందే. గతంలో దీనిపై సుష్మా స్వరాజ్ పార్లమెంటులో మాట్లాడుతూ.. ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన భారతీయులు బాదుష్ జైలులో ఉన్నట్టు ఇరాక్ అధికారులు సమాచారమిచ్చారన్నారు. అపహరణకు గురైన వారిని మరణించినట్లు ప్రకటించడం చాలా తేలికైన పనని, కానీ తాను అలా చేయబోనన్నారు. అలా చెప్పిన నన్నెవరూ ప్రశ్నించే వారు లేరన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా అలా చెప్పడం సమంజసం కాదన్నారు. Is this the way to run external affairs ministry? Does it behove the office of Sushma Swaraj ji to block a Member of Parliament for asking tough questions on 39 Indians missing in Iraq? pic.twitter.com/CvYl8aLREF — Partap Singh Bajwa (@Partap_Sbajwa) 27 December 2017 -
ఆ పాపం నేను చేయను: సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: 'కచ్చితమైన ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి చనిపోయాడని ప్రకటించడం పాపం. అలాంటి పాపాన్ని నేను చేయను' అని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. 2014 నుంచి ఇరాక్‌లో కనిపించకుండాపోయిన 39మంది భారతీయుల ఆచూకీ గురించి బుధవారం ఆమె లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ విషయమై లోక్‌సభలో మాట్లాడేందుకు ఇప్పటివరకు మూడుసార్లు సుష్మ ప్రయత్నించినప్పటికీ.. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో అది వీలుపడలేదు. సోమవారం సాయంత్రం, మంగళవారం ఈ విషయమై సభలో ప్రకటన చేసేందుకు సుష్మా ప్రయత్నించారు. అయితే, సభ్యుల ఆందోళన మధ్య అందుకు వీలుపడలేదు. బుధవారం కూడా ఆమె ప్రకటన చేసే సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన దిగారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ పదేపదే సభ్యులకు నచ్చజెప్పి శాంతించారు. 2014లో ఇరాక్‌లోని మోసుల్ అపహరణకు గురైన 39మంది భారతీయుల గురించి ఎలాంటి సమాచారం లేదని, వారు చనిపోయారు? బంధీలుగా ఉన్నారా? అన్నదానిపై సమగ్ర ఆధారాలు లేవని సభకు తెలిపారు.