Mission 2019
-
బీజేపీ ‘మిషన్ 2019’
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జాతీయ నాయకత్వం ఆదేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. పార్టీ రాష్ట్ర కమిటీకి జాతీయ నాయకత్వం పలు సూచనలు చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ‘మిషన్ 2019’కు సిద్ధం కావాలని ఆదే శించింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా పోలింగ్‌బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలంది. పార్టీపరంగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో గెలవాలంటే పోలింగ్ బూత్‌స్థాయిలో సెప్టెంబర్ 25న పార్టీ సిద్ధాంతవేత్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి, అక్టోబర్ 23న పార్టీ అగ్రనేత డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ బలిదానదినం, సామాజిక న్యాయ సాధనకు కృషిలో భాగంగా అంబేడ్కర్, జగ్జీవన్‌రాం జయంతులను చేపట్టాలని సూచించింది. హైదరాబాద్ స్టేట్‌కు విమోచన లభించిన సెప్టెంబర్ 17న అన్ని పోలింగ్ బూత్‌ల్లో జాతీయజెండాలను ఎగురవేసేలా కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రపార్టీకి అనుమతినిచ్చింది. ఆదివారంరాత్రి కేరళలోని కోజికోడ్‌లో ముగిసిన పార్టీ జాతీయ కార్యవర్గసమావేశంలో రాష్ట్రపార్టీ నాయకత్వానికి ప్రత్యేక ఆదేశాలిచ్చింది. బడుగులపై ప్రత్యేక దృష్టి... పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, హైదరాబాద్ విమోచనను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే డిమాం డ్‌పై నెలపాటు నిర్వహించిన తిరంగా యాత్ర విజయవంతంపట్ల ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు. రాష్ర్టంలో బడుగు, బలహీనవర్గాల జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవర్గాలను చేరుకునేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని అధిష్టానం సూచిం చింది. పేదల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించింది. ఈ ఏడాదంతా ‘గరీబ్ కల్యాణ్ వర్ష్’ పేదల సంక్షేమం, వారికి ప్రభుత్వ, పార్టీ, వ్యక్తులపరంగా సహాయం అందించడానికి ఈ ఏడాదంతా ‘గరీబ్ కల్యాణ్ వర్ష్’ను నిర్వహించాలని జాతీయ నాయకత్వం నిర్దేశం చేసింది. పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతిని పురస్కరించుకుని పేదలకు మేలు కలిగే కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. -
2019 నాటికి అధికారమే లక్ష్యం
పల్లెపల్లెకు బీజేపీ... గడపగడపకు నరేంద్రమోదీ 7న బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనం పాల్గొననున్న ప్రధాన మంత్రి కేంద్రం నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హన్మకొండ : 2019 నాటికి అధికారం లక్ష్యంగా ‘మిషన్–2019’తో ముందుకు పోతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యమ్నాయ శక్తిగా ఎదుగుతుందని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మిషన్–2019 రూపకల్పన చేశారని చెప్పారు. శనివారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని అభిరాం గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, అనంతరం జరిగిన పార్టీ బూత్ కమిటీ సమ్మేళనం జిల్లా సన్నాహక సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. పల్లెపల్లెకు బీజేపీ..గడప గడపకు నరేంద్ర మోదీ అనే నినాదంతో కార్యాచరణ చేపడతామన్నారు. ప్రతి గడపను తట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే అగష్టు 7వ తేదీన బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17వ తేదీ ప్రత్యేకతను, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రధానికి వివరించనన్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా జరుపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని లక్ష్మణ్ చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు శంకుస్థాపన చేస్తారన్నారు. దీంతో పాటు టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుకు, హెల్త్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేస్తారని, మిషన్ భగీరథను ప్రారంభించనున్నారని వెల్లడించారు. మనోహరాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. కేంద్రం విడుదల చేసే నిధులకు కాపలా కుక్కలా ఉంటామని, నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. అనంతరం బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రఘునాథరావు, దుగ్యాల ప్రదీప్‌రావు, నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నాగపురి రాజమౌళి, కాసర్ల రాంరెడ్డి, పెదగాని సోమయ్య, కూచన రవళి, పెసరు విజయచందర్‌రెడ్డి, ఒంటేరు జయపాల్, దిలీప్‌నాయక్ పాల్గొన్నారు. -
7న హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటన
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జనవరి 7వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ తీరును ఆయన సమీక్షిస్తారు. ఆగస్టులో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మిషన్ 2019ను ప్రకటించిన ఆయన వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిస్తూ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. వాటి అమలు ఎలా ఉందో కూడా ఇప్పుడు ఆయన సమీక్షించనున్నారు. వాస్తవానికి ఈనెల 27, 28 తేదీల్లోనే ఆయన తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది. కానీ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఉండటంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్‌తోపాటు వరంగల్‌లో పార్టీ రాష్ట్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. సమయం లభిస్తేనే ఈసారి వరంగల్‌కు వెళ్తారని, లేకుంటే జనవరి ఆఖరున్ల ఆ జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి.